
మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ
నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం హైదరాబాద్‌లో నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందేలా చూడాలని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల సహకార సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తాని హామీ ఇచ్చారని కుంభం తెలిపారు.