
నంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద, నంబర్ ప్లేట్ లేని, మైనర్ డ్రైవింగ్, సరైన పత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వ్యక్తులను పట్టుకుని వారిపై కూడా ెకేసులు నమోదు చేశారు. అనంతరం డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులను నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు ఎన్ సందీప్‌రెడ్డి, వి. శంకర్, జె. సైదులు, ఏఎస్‌ఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనయ్య పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల: నంబర్ ప్లేట్లు లేని, సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపినట్లయితే వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటామని నార్కట్‌పల్లి సీఐ నాగరాజు హెచ్చరించారు. చిట్యాలలో సోమవారం ఎస్‌ఐ ఎన్. ధర్మాతో కలిసి నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.