
శాశ్వత పరిష్కారం వెతకాలి
టెర్రరిస్టులను అంతమొందించేందుకు శాశ్వత పరిష్కారం వెతకాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
సాగరతీరం..
అందగత్తెల విహారం
ఫ నాగార్జునసాగర్‌కు మిస్‌వరల్డ్ పోటీదారులు ఫ గిరిజన సంప్రదాయ రీతిలో స్వాగతం
ఫ విజయవిహార్‌లో ఫొటోషూట్‌తో సందడి ఫ బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి
ఫ మహాస్థూపంలో ధ్యానం ఫ బుద్ధ చరిత్ర నృత్య ప్రదర్శనను తిలకించిన ముద్దుగుమ్మలు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ తీరంలో సోమవారం సుందరీమణులు విహరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్‌వరల్డ్ –2025 పోటీలకు హాజరైన అందగత్తెలు.. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో నిర్వహించిన బుద్ధజయంతికి హాజరయ్యారు. వీరు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథిగృహానికి చేరుకుని అక్కడ కాసేపు సేదదీరిన అనంతరం విజయవిహార్ వెనుకభాగంలో జలాశయతీరంలోని పార్కులో ఫొటోషూట్‌లో సందడి చేశారు. ఆ తర్వాత బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి, పూజలు చేశారు. అక్కడినుంచి మహాస్థూపం వరకు నడిచి వెళ్లగా అక్కడ తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో వారికి స్వాగతం పలికారు. మహాస్థూపం వద్ద శిల్పాల గురించి తెలుసుకున్నారు. మహాస్థూపంలో ధ్యానం చేశారు. ఫొటో ప్రదర్శన, బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శనను తిలకించారు. డిన్నర్ అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
బుద్ధపూర్ణిమ బౌద్ధులకు ఎంతో ప్రత్యేకం
– కలెక్టర్ ఇలా త్రిపాఠి
బుద్ధపూర్ణిమ బౌద్ధులకు ఎంతో ప్రత్యేకమని కలెక్టర్ ఇలాత్రిపాఠి అన్నారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా సాగర్ బుద్ధవనానికి హాజరైన ప్రపంచ సుందరీమణులకు బుద్ధ పూర్ణిమ గురించి ఆమె వివరించారు. బుద్ధపూర్ణిమను మీ అందరితో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. బుద్ధుడు ప్రపంచానికి ప్రశాంత జీవన విధానాన్ని నేర్పించాడని పేర్కొన్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మీ మాతృదేశాలలో తెలియాజేయాలని సుందరీమణులను కోరారు. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ మిస్‌వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వడం గొప్ప విషయమన్నారు. ప్రపంచ బౌద్ధులంతా దర్శించుకునే విధంగా ఇక్కడ బుద్ధవనం నిర్మాణమైందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌తోపాటు బౌద్ధప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం తగు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతోనే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ఎస్‌పీ శరత్ చంద్రపవార్, ఐఏఎస్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీలు రమేశ్, మౌనిక, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వెల్లంకి గెస్ట్‌హౌస్‌లో
సేదదీరిన అందాల భామలు
చింతపల్లి : సుందరీమణులు చింతపల్లి మండల పరిధిలోని తీదేడు గ్రామ శివారులో గల వెల్లంకి గెస్ట్‌హౌస్‌లో సోమవారం సందడి చేశారు. వారు నాగార్జునసాగర్ వెళ్తూ మార్గమధ్యలో వెల్లంకి గెస్ట్‌హౌస్‌లో 30 నిమిషాల పాటు సేదదీరారు. మిస్‌వరల్డ్ పోటీదారులు మండల కేంద్రం మీదుగా వెళ్తుండడంతో వారిని చూసేందుకు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఆసక్తి చూపారు. మాల్ వెంకటేశ్వరనగర్ నుంచి నాగార్జునసాగర్ వరకు పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

శాశ్వత పరిష్కారం వెతకాలి

శాశ్వత పరిష్కారం వెతకాలి

శాశ్వత పరిష్కారం వెతకాలి