
ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి
తిరుమలగిరి( తుంగతుర్తి): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను మిల్లర్లు వేగంగా దిగుమతి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. శుక్రవారం తిరుమలగిరిలోని ఏఎస్‌ఆర్ మిల్లును అదనపు కలెక్టర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. అనంతరం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని జనగాం మిల్లుకు తరలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.హరిప్రసాద్, ఏఓ నాగేశ్వరరావు, ఏపీఎం మధుసూదన్, ఆర్‌ఐ జార్జ్‌రెడ్డి, ఏఈఓ లక్ష్మీచైతన్య పాల్గొన్నారు.
అర్హత లేని వైద్యులపై చర్యలు తప్పవు
సూర్యాపేట టౌన్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో అర్హత లేని వైద్యులు వైద్యం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కోటాచలం, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ, శ్రీకృష్ణ ఆసుపత్రులను తనిఖీ బృందం సభ్యులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రుల అర్హతలను పరిశీలించి టీఎస్‌ఎంసీ అర్హత లేని ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ చేయబడవని తెలిపారు. బయో మెడికల్ వేస్టేజ్ సర్టిఫికెట్, పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్స్ సర్టిఫికెట్, రోమా, ఫైర్ ఎక్సేషన్ సర్టిఫికెట్ వైశాల్యాన్ని బట్టి, ఫైర్ సిలిండర్స్, బిల్డింగ్ పర్మిషన్ లెటర్, డాక్టర్ సర్టిఫికెట్స్ విత్ ఫొటోస్ తప్పకుండా ఉండి తీరాలన్నారు. వారి వెంట డాక్టర్ ఆనంద్, తనిఖీ బృందం సభ్యులు తదితరులు ఉన్నారు.
వాసవి క్లబ్ సేవలకు ప్రత్యేక గుర్తింపు
నేరేడుచర్ల : అత్యుత్తమ సేవలను అందించినందుకు వాసవి క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉత్తమ వాసవి క్లబ్‌గా సూర్యాపేట జిల్లా ఎంపికై ందని వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ ఇటీవల వైజాగ్‌లో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఐదు నెలలుగా వాసవి క్లబ్ నిర్దేశించిన సేవ కార్యక్రమాలను గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఉత్తమ జిల్లాగా ఎంపికై నందుకు వనిత క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేయాలి
సూర్యాపేట : నకిలీ వైద్యులపై దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదుచేసి వారి అక్రమ ఆస్తుల్ని జప్తు చేసి కఠినంగా శిక్షించాలని సూ ర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పాకిస్తాన్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్లను స్మరిస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లికార్జున్ మాట్లాడుతూ అర్హతలేని డాక్టర్లు, స్కానింగ్ సెంటర్ల స్కాంపై ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్యదర్శులు తన్నీరు యాదగిరి, సట్టు వెంకన్న, దేవత్ కిషన్ నాయక్, జనార్దన్, వీరబోయిన భగవాన్ కన్నా యాదవ్, మూడ్ రవీంద్ర నాయక్, వీరబోయిన సంజీవ్ నాయక్, కమలాకర్‌రావు, చిరంజీవి, లింగయ్య పాల్గొన్నారు.

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి