ఎగుమతికి లారీలేవీ? | - | Sakshi
Sakshi News home page

ఎగుమతికి లారీలేవీ?

May 7 2025 2:23 AM | Updated on May 7 2025 2:23 AM

ఎగుమత

ఎగుమతికి లారీలేవీ?

తూకం వేసిన ధాన్యం

బస్తాలు కల్లాల్లోనే..

లారీల కొరతతో కొన్నిచోట్ల కాంటాలు కూడా వేయడం లేదు

ధాన్యం ఎగుమతి అయినా..

మిల్లుల వద్ద కూడా కొర్రీలు

ధాన్యం అమ్ముకునేందుకు

రైతులకు సవాలక్ష కష్టాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తగా మారింది. అధికారుల అజమాయిషీ లేకధాన్యం కల్లాలకు తెచ్చిన రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిర్ధేశిత తేమ శాతం వచ్చినా తూకం వేయక, వేసినా కూడా లారీలు రాక రోజుల తరబడి ఆ కల్లాల వద్దే పడిగాపులు కాయాల్సిన వస్తోంది. కొన్ని చోట్ల లారీ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో రైతులే వాహనాలను పెట్టుకొని ధాన్యం తరలించాల్సి వస్తోంది. ఆ తరువాత ట్రక్‌ షీట్‌ ఆలస్యంగా రావడం, చివరకు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు రావడం కూడా 20 రోజులపైనే పడుతోంది.

కొర్రీలు పెట్టి కోత విధిస్తున్నారు

కల్లాల్లో తూకం వేసేప్పుడు బస్తాకు కిలో అధికంగా తూకం వేస్తుండగా, తూకం వేసిన ధాన్యం మిల్ల రు వద్దకు తీసుకెళ్లాక, ధాన్యం బాగలేదంటూ దిగుమతి చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారు. దీంతో సంబంధిత కొనుగోలు కేంద్రానికి మిల్లర్లు ఫలానా రైతు ధాన్యం బాగలేదని చెప్పడం, దీంతో నిర్వాహకులు నీ ధాన్యం బాగలేదంట.. బస్తాకు 2 కిలోలు మిల్లర్లు కోత వేస్తారట.. లేదంటే నీ ఇష్టం అని చెబుతుండటంతో రైతులు అంగీకరించక తప్పడంలేదు. ఇలా 40 కిలోల బస్తాకే 3 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటేనే ట్రక్‌ షీట్‌ రైతుకు అందుతోంది. అప్పుడే ఆ ట్రక్‌ షీట్‌ ఆధారంగా రైతు ఎంత విక్రయించారన్న వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. లేదంటే ధాన్యం వెనక్కి పంపిస్తామంటూ బెదిరిస్తున్నారు.

మిల్లర్లు ఆడిందే ఆట...

మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. అసలే కాంట్రాక్టర్లు కొద్దిపాటి లారీలను ధాన్యం రవాణాకు పంపిస్తున్నారు. అయితే ధాన్యం దిగుమతి చేసుకోలేమంటూ నల్లగొండ చుట్టుపక్కల ఉన్న మిల్లర్లు రెండు మూడు రోజులు కొర్రీలు పెట్టడంతో నల్లగొండ ధాన్యాన్ని మిర్యాలగూడ, దేవరకొండ మిల్లులకు తరలించినట్లు సమాచారం. అంటే ఇటు ట్రాన్స్‌పోర్టు చార్జీలు ప్రభుత్వంపై అదనంగా పడుతున్నాయి. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో మిల్లర్లు చెప్పిందే వినాల్సివస్తోంది.

ఆత్మకూర్‌.ఎస్‌ మండలంలో లారీల కొరత తీవ్రంగా ఉంది. కాంటాలు వేసినా లారీలు సకాలంలో రాకపోవడంతో బస్తాలు అలాగే ఉంటున్నాయి. రోజుకు రెండు మూడు లారీలు రావాల్సి ఉండగా మూడు రోజులకు ఒక లారీ మాత్రమే వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నాం

నేరేడుచర్లలోని ఐకేపీ కేంద్రంలో ధాన్యం కాంటాలు వేసినా లారీలు రావడం లేదు. దీంతో సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుంటే బిల్లులను చెల్లిస్తామని అధికారులు చెప్పారు. దీంతో సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నాం.

– ధానావత్‌ చాంప్లా, పుల్గంబండతండా, నేరేడుచర్ల

లారీలు సమయానికి రావడం లేదు

దాదాపు 60 క్వింటాల ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు అవుతుంది. వారానికి రెండు లారీలు కూడా వెళ్లడం లేదు. దీంతో కాంటాలు ఆలస్యం అవుతున్నాయి. రోజు రెండు నుండి మూడు లారీలు వస్తే కాంటాలు త్వరగా అవుతాయి.

– గుద్దేటి జాన్‌రెడ్డి, ఆత్మకూరు.ఎస్‌

ఎగుమతికి లారీలేవీ?1
1/3

ఎగుమతికి లారీలేవీ?

ఎగుమతికి లారీలేవీ?2
2/3

ఎగుమతికి లారీలేవీ?

ఎగుమతికి లారీలేవీ?3
3/3

ఎగుమతికి లారీలేవీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement