
మెడికల్ మాఫియాను అరికట్టాలి
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలో కొనసాగుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసి, అన్ని వర్గాల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేటు యాజమాన్యాలకు విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న డీఎంహెచ్‌ఓను తొలగించాలన్నారు. అర్హతలు లేకున్నా, తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా వైద్యం అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలను అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అఖిల్ కుమార్, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, టీయూసీఐ, ఆయా సంఘాల నాయకులు పేర్ల నాగయ్య, ఎస్‌కే.గులాం, సంతోషి, కట్టా కల్పన, పేర్ల మల్లమ్మ, గుండ గాని రేణుక, ఎస్‌కే.కరీంబీ, విజయ్‌రెడ్డి, అంజయ్య, కట్టా రమేష్, పాల్వా యేసు, బొజ్జ ముత్తయ్య, పాల్వాయి అనసూయ తదితరులు పాల్గొన్నారు.