
పొలాల్లో మట్టి తవ్వి.. రోడ్డు విస్తరణ పనులు !
నేరేడుచర్ల : మంత్రి ఉత్తమ్‌కుమార్ సొంత నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు పనులను సదరు కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నాడు. నిబంధనలు పాటిస్తే లాభాలు రావనే ఉద్దేశంతో నాణ్యత లేకుండా కల్వర్టులు, రోడ్డు విస్తరణ పనులు చేయిస్తున్నాడు. పైగా ఎలాంటి అనుమతులు లేకుండా రైతుల పొలాల్లో గాతులు తీస్తూ అందులో వెళ్లిన మట్టితో రోడ్డు విస్తరణ పనులు చేయిస్తున్నాడు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు
నేరేడుచర్ల నుంచి వయా పత్తెపురం పెన్‌పహాడ్ మండలం దూపాడుకు వరకు దాదాపు 14 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను సూర్యాపేట పట్టణానికి చెందిన ఎస్‌కేఆర్ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. దీంతో గతకొన్ని రోజులుగా రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఇంత వరకు బాగనే ఉన్నా.. సదరు కాంట్రాక్టర్లు రోడ్డు విస్తరణ చేయాలంటే ఆ రోడ్డుకు మట్టిపోసి వెడల్పు చేయాల్సి ఉంటుంది. అయితే మట్టిని వేరే ప్రాంతాల నుంచి ప్రభుత్వం అనుమతితో తీసుకురావాలి కానీ దూరం వెళితే అధిక ఖర్చు అవుతుందని, ఎలాంటి లాభం ఉండదనే ఉద్దేశంతో రైతుల అనుముతుల తీసుకోకుండానే రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లో పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లతో 5 నుంచి 6 ఫీట్ల లోతు గాతులను తవ్వి మట్టిని రోడ్డుకు పోస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు మూడు కిలోమీటర పరిధిలోనే దాదాపు 40 మంది రైతుల పంటపొలాల్లో గాతులు తవ్వి ఆ మట్టిని రోడ్డు విస్తరణకు వినియోగిస్తున్నాడు. మా పంట పొలాల్లో ఎందుకు మట్టి తీస్తున్నావని ప్రశ్నిస్తే వారితో ఘర్షణ పడుతూ మీ దిక్కు ఉన్న చోట చెప్పుకొమ్మని బెదిరిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి నియోజకవర్గంలోనే రైతులకు అన్యాయం జరుగుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని రైతులు కంటతడి పెడుతున్నారు. అయితే ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్ మట్టి కావాలంటే తప్పనిసరిగా రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సెస్ చెల్లించి మట్టిని తోలేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెస్ కట్టకుండానే కాంట్రాక్టర్ ప్రభుత్వ పని అని చెబుతూ ఎక్కడ మట్టి కనిపిస్తే ఆ మట్టిని టిప్పర్ల ద్వారా తీసుకెళ్తాన్నాడు. ఈ తవ్వకాలను నిలుపుదల చేయాలనే చూసే రెవవెన్యూ అఽధికారులను సైతం బెదిరిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఫ నేరేడుచర్ల– దూపాడు రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్వాకం
ఫ ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ
స్థలమంటూ బెదిరింపులు
ఫ గగ్గోలు పెడుతున్న నేరేడుచర్ల
మండల రైతులు

పొలాల్లో మట్టి తవ్వి.. రోడ్డు విస్తరణ పనులు !