
స్థూపం నిర్మాణంలో భాగస్వాములు కావాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : తెనాలి పట్టణంలోని బుర్రిపాలెం రోడ్డులో ఉన్న సరస్వతి ఆలయంలో స్థూపం నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పెనుగొండ శ్రీవాసవి శాంతిధామం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) పిలుపునిచ్చారు. గురువారం శ్రీ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో పాల్గొని వెళ్తూ మార్గ మధ్యలో సూర్యాపేట పట్టణంలోని శ్రీ వాసవి మాత సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈగ దయాకర్ గుప్తా నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడారు. దేశంలోనే మొదట్టి సారిగా సరస్వతి స్షూపం నిర్మించి అందులో శ్రీచక్రం ఆకారంలో ఉన్న లక్ష రాతిపలకలను నిక్షిప్తం చేయనున్నట్లు తెలిపారు. స్థూపం నిర్మాణంలో పాలుపంచుకోవడం ద్వారా శ్రీ సరస్వతి మాత అనుగ్రహం పొందవచ్చన్నారు. ఎంతో పవిత్రమైన కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపకులు ఈగ దయాకర్ గుప్తా, విజయ లక్ష్మి దంపతులు, భక్తులు మిర్యాల శివకుమార్, గోపారపు రాజు, బోనగిరి విజయకుమార్, బెలిదే అంజయ్య, బొల్లం రమేష్, కలకోటి నరసయ్య, గుండా శ్రీనివాసు, తేడ్ల ప్రభాకర్, సత్తయ్య, మిర్యాల కవిత, తెడ్ల పల్లవి, ఇమ్మడి పద్మ, హనుమాండ్ల పుష్ప, బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు.