
మట్టపల్లిలో వైభవంగా చక్రతీర్థస్నానం
మఠంపల్లి: మట్టపల్లిలో కొనసాగుతున్న తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం అర్చకులు కృష్ణానదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామిఅమ్మవారికి చక్రతీర్థస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో పూర్ణాహుతి చేపట్టారు. యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రాతాః కాలార్చన, సుప్ర భాత సేవ, ద్రవిడ ప్రబంధసేవాకాలం, పంచామృతాభిషేకం, మంత్ర పుష్ప నీరాజనాలతో శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారికి సమస్ర కుంకుమార్చన చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను పల్లకిలో కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్‌కు తరలించి వసంతసేవ, చక్రస్నానం నిర్వహించారు. ఆలయ ప్రవేశం అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. సాయంత్రం దోపుఉత్సవం, ధ్వజారోహణం, మౌనబలి నిర్వహించారు. గురువారం రాత్రి పవళింపుసేవతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు , లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, బ్రహ్మాచార్యులు ,ఆంజనేయాచార్యులు, శేషగిరిరావు ,శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మట్టపల్లిలో వైభవంగా చక్రతీర్థస్నానం