
లారీల కొరత లేకుండా చూస్తాం
తిరుమలగిరి (తుంగతుర్తి): కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని మిల్లులకు పంపిన 24 గంటల లోపు ట్రక్ షీట్లు తెచ్చి ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం లోపు తేమ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ బి. రాంబాబు, తహసీల్దార్ హరిప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎస్‌కే జాన్‌మహ్మద్ ఉన్నారు.
పౌరసరఫరాల శాఖ
కమిషనర్ డీఎస్ చౌహాన్