మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

May 16 2025 1:47 AM | Updated on May 16 2025 1:53 AM

మిల్ల

మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

చివ్వెంల(సూర్యాపేట) : మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు ఆదేశించారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని వల్ల భాపురం గ్రామ శివారులోని జగన్మాత, దురాజ్‌పల్లి గ్రామ శివారులోని నవతర్న మిల్లులను తనిఖీ చేశారు. మిల్లుల్లో దిగుమతి ఆలస్యం కావడంతో లారీలు మిల్లులో ఉంటున్నాయని, దీనివల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హమాలీలను ఎక్కువ సంఖ్యలో నియమించుకుని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ డీటీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులు సత్వరమే పూర్తి చేయాలి

నూతనకల్‌ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే పనులను సత్వరమే పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ అప్పారావు సూచించారు. గురువారం నూతనకల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వివిధ రకాల పనులను చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో కాంటాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునిత, ఎంపీఓ శశికళ, ఏపీఓ మామిడి శ్రీరాములు, ఏపీఎం రమణాకర్‌, సీసీలు ముత్తయ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను

కాపాడుకోవడమే ధ్యేయం

టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్‌

భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే ధ్యేయంగా అధిష్టానం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ పరిశీలకుడు, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ పేర్కొన్నారు.గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సూర్యాపేట, చివ్వెంల మండలాల కాంగ్రెస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.మండల, గ్రామ అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పోటీలో నిలబడాలనుకునే కార్యకర్తలు అప్లికేషన్‌ ఫారం పూర్తి చేసి అందజేయాలన్నారు. కార్యకర్తల కోసం త్యాగాలు చేసిన కుటుంబం రాంరెడ్డి దామోదర్‌ రెడ్డిది అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, మార్కెట్‌ డైరెక్టర్‌ ధరావత్‌ వీరన్న నాయక్‌, కోతి గోపాల్‌ రెడ్డి, ఎలిమినేటి అభినయ్‌, తిరుమల ప్రగడ అనురాధ, చింతమల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా పుష్పయాగం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు. యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రాతఃకాలార్చన, సుప్ర భాత సేవ, ద్రవిడ ప్రబంధసే వాకాలం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకంతో సమస్ర కుంకుమార్చనలు చేశారు శ్రీస్వామి అమ్మవార్లకు ద్వాదశసేవలు, శృంగారడోలోత్సవం, పవళింపుసేవ చేపట్టారు.అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. తిరుకల్యాణోత్సవాలు ముగిసినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌ తెలిపారు.

మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి1
1/2

మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి2
2/2

మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement