
నాలా నిండా వ్యర్థాలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. పలు వీధుల్లో రోజూ చెత్త తొలగించకపోవడం.. డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నా వారంతా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెత్త సేకరణకు పరిమితమయ్యారు. దీంతో మిగతా చోట్లలో డ్రెయినేజీల్లో చెత్త, మురుగు పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెయినేజీలు పూడిపోతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వినిస్తున్నాయి. దీంతో దుర్వాసనతో తట్టుకోలేకపోతున్నామని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ తొలగించకపోవడంతో..
సూర్యాపేట పట్టణంలోని 28 వార్డులో తాళ్లగడ్డ ఫైర్ స్టేషన్ ఎదురుగా జెజెనగర్‌లో, రాజారాం కాలేజ్ రోడ్, చర్చి కాంపౌండ్ వెనుక భాగం, గోపాలపురం, 60 ఫీట్ల రోడ్ నాలా, నల్లాలబావి, డీమార్ట్ దగ్గర నాలాలు, పట్టణంలోని పలు వీధుల్లో డ్రెయినేజీలు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. రోజూ ఇంట్లో, వీధిలోని వ్యర్థాలు ఊడ్చి కుప్పచేసినా పారిశుద్ధ్య కార్మికులు ఎత్తకుండా వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలో వాడుకునే నీరు, వ్యర్థఆహార పదార్థాలు పైపులైన్ల ద్వారా డ్రెయినేజీల్లోకి చేరుతున్నా వాటిని తొలగించడం లేదు. దుర్వాసనను తట్టుకోలేక కాలువలపై బండలు, అట్టాలు, బస్తాలు కప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పది. అలాగే చర్చి కాంపౌండ్ వెనుక ప్రాంతంలో ఖాళీ స్థలాలు చెత్త డంపు కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీలు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకుపోయి అధ్వానంగా మారారయి. 60 ఫీట్ల రోడ్డు, నల్లాలబావి ప్రాంతాల్లో ప్రధాన నాలాలకు వచ్చే కాలువల్లో పూడిక తీయక కొన్నిచోట్ల మట్టితో నిండి గడ్డి మొలకెత్తడం పారిశుద్ధ్యకార్మికుల, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫలితంగా దోమలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అంటున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్ శానిటనీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ను వివరణ కోరగా కార్మికులను పంపించి మురుగు కాలువలను శుభ్రం చేయిస్తామని తెలిపారు.
ఖాళీ స్థలాల్లోని వ్యర్థాలను తొలగించాలి
చర్చి కాంపౌండ్ ప్రాంతంలో డ్రెయినేజీలు మురుగు, చెత్తతో నిండి ఉన్నాయి. కాలువలు పూడి నీరుపారక దుర్వాసన వస్తోంది. ఖాళీ స్థలాల్లో వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలలో దోమలు వృద్ధి చెంది రాత్రిళ్లూ ఇబ్బంది పడుతున్నాం. అధికారులు చొరవ చూపి కాలువల్లో పూడిక తీయించాలి.
– గుడుపురి సత్యం, చర్చి కాంపౌండ్
సూర్యాపేట పట్టణంలో
మురుగుతో నిండుతున్న డ్రెయినేజీలు
డంపింగ్ యార్డులుగా పలు వీధులు
కొన్నిచోట్లనే చెత్త తొలగింపు
అధికారుల పర్యవేక్షణ కరువు
దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు
మున్సిపల్
కార్మికుల వివరాలు
ఔట్‌సోర్సింగ్ 313
కాంట్రాక్టు 110
పర్మినెంట్ 48
మొత్తం 471
ప్రధాన నాలాలను శుభ్రం చేయాలి
పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మురుగు నీరు ప్రధాన నాలాల్లోకి వస్తోంది. దీంతో నాలాల్లోకి చెత్త చేరుతోంది. నాలాల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధభరితంగా మారుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు నాలాల నుంచి షీల్ట్ తీయించి శుభ్రం చేయించాలి.
– కిరణ్ కుమార్, తాళ్లగడ్డ

నాలా నిండా వ్యర్థాలు

నాలా నిండా వ్యర్థాలు

నాలా నిండా వ్యర్థాలు

నాలా నిండా వ్యర్థాలు