
సర్టిఫికెట్లు ప్రదానం
నల్లగొండ టూటౌన్ : సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ సంస్థ నిర్వహించిన నైపుణ్య శిక్షణ అభివృద్ధి (టాస్క్)కు సహకరించిన యూనివర్సిటీ సిబ్బందికి శుక్రవారం ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సరిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని టాస్క్‌ను రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అల్వాల రవి, డాక్టర్ వై.ప్రశాంతి, సుధారాణి, జయంతి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.