రోడ్డెక్కిన కిక్కు!
రోడ్లపైనే పార్కింగ్..
జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో మూడు వైన్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారి వెంటే ఉన్నాయి. దీంతో సాయంత్రమైతే వైన్స్‌ల ఎదుట మందుబాబులు క్యూ కడుతుండటంతో రోడ్డుపైనే బైక్‌లు పార్కింగ్ చేసి మద్యం సేవిస్తున్నారు. ఈ రోడ్డులో ఎక్కువగా రద్దీ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కొత్తబస్టాండ్ సమీపంలో గల వైన్స్ ఎదుట అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారు. అదేవిధంగా జమ్మిగడ్డ సమీపంలోని జాతీయ రహదారి వెంట, ఇందిరమ్మ కాలనీ సమీపంలో, పిల్లలమర్రి రోడ్డు సమీపంలో, కుడకుడ గ్రామ శివారులో ప్రాంతాల్లో వైన్స్‌లు ఉన్నాయి. మందుబాబులు ఈ వైన్స్‌ల సమీపంలోని ఖాళీ స్థలాల్లోనే మద్యం సేవించి హల్‌చల్ చేస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం
● మద్యం మత్తులో
హల్‌చల్ చేస్తున్న యువకులు
● ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు
సూర్యాపేట: కొందరు మందుబాబులు బహిరంగ మద్యపానం చేస్తున్నారు. వైన్స్‌ల్లో పర్మిట్ రూంలు, బార్లు ఉన్నా... కొందరు ఖాళీ స్థలాలు, రోడ్డు మీదనే మద్యం తాగుతున్నారు. అటువైపుగా వచ్చిన విద్యార్థులను, మహిళలను ఇబ్బందులు పెడుతున్నారు. మరికొందరు గొడవలకు సైతం దిగుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మందుబాబులు రోడ్ల మీదనే వాలిపోతున్నారు. దీంతో ప్రజలు ఆయా చోట్ల రోడ్ల మీదకు రావాలంటే జంకుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రాత్రివేళల్లో మద్యం సేవించి బాటిళ్లు అక్కడే పడేస్తున్నారు. ఫలితంగా ఉదయం పాదచారులకు, వాకింగ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్‌లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.
కొరవడిన పర్యవేక్షణ
జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలపై ఎకై ్సజ్ అధికారులు, పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. రాత్రి వేళలో ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణాల దగ్గర బహిరంగంగానే తాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రోడ్డెక్కిన కిక్కు!
రోడ్డెక్కిన కిక్కు!


