
పనిచేసిన వారికే పదవులు
భానుపురి : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే, పీసీసీ పరిశీలకుడు భూక్యా మురళీ నాయక్, సహ పరిశీలకుడు ఛత్రురావు అన్నారు. డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన శుక్రవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ పట్టణ కమిటీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అర్హులైన నాయకులకు కచ్చితంగా పదవులు వస్తాయని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు, వార్డు అధ్యక్షుల పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఫ పీసీసీ పరిశీలకుడు మురళీ నాయక్