ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
చివ్వెంల : ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేట సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఖైదీలను భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన లీగల్ లిటరసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్ల హక్కులు, విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో బార్ అసోసియేసన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టుపల్లి ప్రవీణ్‌కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు ఎండీ అబ్దుల్ లతీఫ్, శ్రీనివాస్, డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, మధు, పీపీ లక్ష్మణ్ నాయక్, ఏజీపీ పూల్‌సింగ్ నాయక్ పాల్గొన్నారు.


