ఊరూరా నిఘా కమిటీలు | - | Sakshi
Sakshi News home page

ఊరూరా నిఘా కమిటీలు

May 6 2025 1:24 AM | Updated on May 6 2025 1:24 AM

ఊరూరా నిఘా కమిటీలు

ఊరూరా నిఘా కమిటీలు

చిలుకూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట, పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం ఊరూరా నిఘా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల నిబంధనలు ఉల్లంఘింస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం ఈ ఏడాది పని దినాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. మార్గ దర్శకాలకు అనుగుణంగా పనులు చేయలని నిర్ణయించింది.

పేరుకే సామాజిక తనిఖీలు

జిల్లాలో 23 మండలాల్లో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 63 వేల జాబ్‌కార్డులు ఉండగా వీటిలో 5,70,275 మంది కూలీలు ఉన్నారు. 3,34,539 మంది కూలీలు ఉపాధిహామీ పని చేస్తున్నారు. ఏటా చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి పలు అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కేవలం నామ మాత్రపు రికవరీతో సరి పెడుతున్నారు. సమస్యను గుర్తించిన కేంద్రం ప్రభుత్వం పనుల్లో మార్గ దర్శకాలు పాటించడం లేదంటూ పని దినాల్లో కోత విధించడం మొదలు పెట్టింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో ఐదుగురితో కూడిన నిఘా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిఘా కమిటీలు రాష్ట్ర సాయికి పరిమితం కావడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ సిబ్బందే కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వీరు స్థానికులు కాకుండా వేరే గ్రామానికి చెందిన వారిని నియమించనున్నారు.

ఉపాధిహామీ పనుల్లో అవినీతి అడ్డుకట్టకు చర్యలు

ఐదుగురు సభ్యులతో కమిటీ

వారానికోసారి పనుల పరిశీలన

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం..

ఉపాధి పనులను కమిటీ వారానికోసారి పరిశీలించి పనుల మంజూరు, పనులు జరుగుతున్న తీరు, కూలీల హాజరు, డబ్బుల చెల్లింపులు తదితర వివరాలను గుర్తించి మండల పరిషత్‌ అధికారులకు అందజేస్తుంది. మండలాధికారులు కలెక్టర్‌కు నివేదిస్తారు. ఇక నుంచి నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించాలని పనుల వివరాలను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తనిఖీల్లో వెల్లడైన రికవరీ నిధులను తాత్సారం చేయకుండా రాబట్టాలని కొత్త ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement