
చిన్నారులకు వరం.. బాలభవన్
ఫ లలిత కళలపై వేసవిలో ఉచిత శిక్షణ
ఫ శిక్షణ పొందుతున్న 670 మంది
విద్యార్థులు
సూర్యాపేట : లలిత కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని బాల భవన్ ఓ వరంగా మారింది. డ్యాన్స్, పేరిణి నృత్యం, ఆర్ట్, క్రాఫ్ట్, తబలా, మ్యూజిక్, కోలాటం, డ్రాయింగ్ ఇలా అనేక అంశాలపై విద్యార్థులకు నచ్చిన కళలపై వేసవి సెలవుల్లో తర్ఫీదు ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న బాల భవన్‌ను వసతుల దృష్ట్యా ఈ ఏడాది జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోకి మార్చారు. అక్కడే శిక్షణ ఇస్తున్నారు. జూన్ 11 వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగనుంది.
శిక్షణకు మొత్తం 670 అడ్మిషన్లు
ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు శిక్షణ నిర్వహిస్తుండటంతో చిన్నారులతో పాఠశాల ఆవరణ కోలాహలంగా ఉంది. ఈ శిక్షణకు మొత్తం 670 విద్యార్థులు అడ్మిషన్లు రాగా ప్రస్తుతం 350 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
డ్యాన్స్ నేర్చుకుంటున్నా
నేను బాలభవన్‌లో నాలుగేళ్లుగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. వేసవి సెలవుల్లో ప్రతి రోజు తప్పకుండా శిక్షణకు హాజరవుతాను. నాకు గత ఉగాది పురస్కారాల్లో నంది అవార్డు, కళా ఉత్సవంలో స్టేట్ లెవల్ ద్వితీయ బహుమతి వచ్చింది. ఇక్కడ మాస్టర్లు డ్యాన్స్ బాగా నేర్పిస్తున్నారు.
– వర్ష, విద్యార్థిని

చిన్నారులకు వరం.. బాలభవన్

చిన్నారులకు వరం.. బాలభవన్