
భూ భారతి దరఖాస్తులు 1,690
గరిడేపల్లి: భూ భారతి చట్టం కింద గరిడేపల్లి మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. ఈనెల 5 తేదీన ప్రారంభమైన ఈ సదస్సులు 12వతేదీతో ముగిశాయి. ఇందులో రైతులు వివిధ సమస్యలపై మొత్తం 1,690 దరఖాస్తులు అందించారు. వీటిలో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 731, అత్యల్పంగా డిజిటల్ సంతకం పెండింగ్‌పై ఆరు దరఖాస్తులు వచ్చాయి.
త్వరలో క్షేత్రస్థాయిలో విచారణ
భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలాన్ని ప్రకటించారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తహసీల్దార్ బండ కవిత, డీఏఓ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సదస్సులను కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, అదనపు కలెక్టర్ రాంబాబుతో పాటు పలువురు అధికారులు పర్యవేక్షించారు. 1,940 మంది రైతులకు దరఖాస్తు ఫారాలు అందించారు. అయితే 1,690 మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందించారు. రైతులకు సహకారం అందించేందుకు ఆయా గ్రామాల్లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉండి దరఖాస్తులను నింపి ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి జూన్ 1వ తేదీలోగా దరఖాస్తులు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు.
రెవెన్యూ గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు
తాళ్లమల్కాపురంలో 73, రాయినిగూడెం 140, కాల్వపల్లి 50, గడ్డిపల్లి 61, గరిడేపల్లి 193, కుతుబ్‌షాపురం 140, గానుగబండ 69, వెలిదండ 269, సర్వారం 118, పొనుగోడు 321, కల్మలచెర్వు 256 దరఖాస్తులు వచ్చాయి.
మిస్సింగ్ సర్వే నంబర్లు 731
పెండింగ్ మ్యుటేషన్ 26
డిజిటల్ సంతకం పెండింగ్ 06
విస్తీర్ణంలో తేడాలు 73
పేర్లలో తప్పుల సవరణ 07
ప్రొహిబిటెడ్ ల్యాండ్ 46
అసైన్డ్‌ల్యాండ్ 196
పౌతి 69
సాదాబైనామా 130
ఇతర సమస్యలు 406
ఫ పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గరిడేపల్లి మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు
ఫ రైతుల నుంచి అనూహ్య స్పందన
ఫ అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 731 దరఖాస్తులు.. అత్యల్పంగా డిజిటల్ సంతకం పెండింగ్‌పై ఆరు..
ఫ వచ్చేనెల 1లోగా సమస్యలు పరిష్కరించేలా ప్రణాళిక
జూన్ 1లోగా సమస్యలు పరిష్కరిస్తాం
గడిడేపల్లి మండలంలో భూ భారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం ఐదు టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేయనుంది. ఈ సమస్యలను జూన్ 1వ తేదీలోగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా కలెక్టర్ ఎంపిక చేసి సదస్సులు నిర్వహించడం సంతోషంగా ఉంది.
– బండ కవిత, తహసీల్దార్

భూ భారతి దరఖాస్తులు 1,690