
వరికొయ్యలు కాలిస్తే భూసారం తగ్గుతుంది
తాళ్లగడ్డ (సూర్యాపేట): పొలాల్లో వరికొయ్యలు, ఎండు గడ్డిని కాలిస్తే భూసారం తగ్గడంతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని డీఏఓ జి.శ్రీధర్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో రైతుల పొలాలను సందర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలోని వరికొయ్యలు, గడ్డికి, వ్యర్థాలకు నిప్పు పెడితే భూమిలో పంటలకు మేలు చేసే ఎరలు నశిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.కృష్ణ సందీప్, ఏఈఒ ముత్తయ్య, రైతులు వెంకట్‌రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపకరణాలకు
దరఖాస్తు చేసుకోవాలి
తుంగతుర్తి : అర్హత కలిగిన దివ్యాంగులు, వయోవృద్ధులు సహాయ ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు అన్నారు. శనివారం తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులు, వయోవద్ధులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ దరఖాస్తులను అలింకో సంస్థ వారు పరిశీలించి అర్హత కలిగిన దివ్యాంగులకు, వయోవద్ధులకు సహా య ఉపకరణాలు అందిస్తారన్నారు. ఇప్పటివరకు 150 అర్హత ఉన్న దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుకుమార్, సీడీపీఓ శ్రీజ, సూపర్‌వైజర్స్ మంగమ్మ, కై రున్నిషా, ప్రమీల, అలింకో సాఫ్ట్ రష్మీరంజన్, రాజా బాబు, సాయి, సంజీవ, వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ముగిసిన వృత్యంతర శిక్షణ
సూర్యాపేట : చివ్వెంల మండలం దురాజ్‌పల్లి సమీపంలోని స్వామి నారాయణ గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజు లుగా నిర్వహిస్తున్న మొదటి విడత వృత్యంతర శిక్షణ శనివారం ముగిసింది. చివరి రోజులు ఆర్పీలు తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గంలోని గణితం, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లతోపాటు ప్రాథమిక పాఠశాలలకు చెందిన సుమారు 750 మందికిపైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల ఉపాధ్యాయులకు ఈనెల 20 నుంచి రెండో విడత శిక్షణ అందించనున్నట్టు డీఈఓ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్వాలిటీ కంట్రోల్ అధికారి జనార్దన్, సెక్టోరియల్ అధికారులు రాంబాబు, శ్రవణ్‌కుమార్ పర్యవేక్షించారు.

వరికొయ్యలు కాలిస్తే భూసారం తగ్గుతుంది

వరికొయ్యలు కాలిస్తే భూసారం తగ్గుతుంది