
పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి తక్షణమే దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కోరారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనుమతి పత్రాలు లేకుండా, గడువు ముగిసిన వీసాలతో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించాలన్నారు. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు దేశంలో నరమేధం సృష్టించి శాంతియుతంగా ఉంటున్న దేశంలో అల్లర్లు జరిగేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, మాజీ ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, వెంకటరెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎం.డీ. ఆబిద్, రంగరాజు రుక్మారావు, బూర మల్సూర్, రంగినేని లక్ష్మణరావు, బండపల్లి శ్రీనివాస్, పేరాల లక్ష్మణ రావు, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.