
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపర్చిన కేంద్రం
మఠంపల్లి: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్ర పాలకులు బలహీన పరిచారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం మఠంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలుచేస్తూ పార్లమెంట్ వ్యవస్థను పూర్తిగా వాళ్లకే ఉపయోగపడేలా చేస్తోందన్నారు. ఎన్నికల వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని, న్యాయవ్యవస్థ పట్టాలు తప్పిందని,మీడియా మొత్తం కార్పొరేట్ శక్తులకు బందీ అయిందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు, యాదగిరిరావు, నాగారపుపాండు, భూక్యాపాండు నాయక్, వెంకటరెడ్డి, యాకూబ్, సైదులు పాల్గొన్నారు.