
శిశువుల ఆరోగ్యానికి మిషన్ ఇంద్రధనుష్
నాగారం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం పిల్లల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తోంది. శిశువులకు సోకే పోలియో, క్షయ, కాలేయ సమస్యలు, మెదడు వాపు, మీజిల్స్, డిప్తీరియా తదితర వ్యాధుల నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించటానికి పలు రకాల వ్యాక్సిన్లను మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో అందజేస్తున్నారు. సాధారణంగా ప్రతి వారం ఒక రోజు ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలను అందజేస్తున్నారు. కానీ కొందరు పిల్లలకు వేయించడం లేదు. అలాంటి వారి కోసం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల్లో ప్రతి నెలా 21 నుంచి 28 వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి వారిని గుర్తిస్తూ ఆయా టీకాలను అందజేస్తున్నారు. గర్భిణులకు సైతం టీకాలు ఇస్తున్నారు. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది 0–2 సంవత్సరాల శిశువులకు పలు రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించటానికి టీకాలు అందజేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
జిల్లాలో ఈ కార్యక్రమం 2023లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడు నెలల పాటు నిర్వహించి చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చారు. 2024లో కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది మళ్లీ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మిషన్ ఇంద్రధనుష్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు.
పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు
ఫ శిశువు జన్మించగానే ఇవ్వాల్సిన టీకాలు
బీసీజీ (టీబీ కోసం), ఓపీవీ(పోలియో రాకుండా), హెపటైటిస్–బి (కాలేయ సమస్యల నివారణకు).
ఫ ఆరువారాలకు..
పెంటావాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ, ఐపీవీ
ఫ పది వారాలకు..
పెంటావాలెంట్, ఓరల్ పోలియో, రోటా వైరస్.
ఫ 14వారాలకు..
పెంటావాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ, ఐపీవీ
ఫ16 నెలల అనంతరం..
ఎంఆర్, జేఈ, ఓరల్ పోలియో, డీపీటీ
ఫ 9 నెలలు పూర్తయ్యాక..
ఎంఆర్(మీజిల్స్, రుబెల్లా), జేఈ(జపనీస్ ఎన్‌సెపలిటిస్), పీసీవీ, ఐపీవీ–దీన్ని పూర్తి ఇమ్యునైజేషన్ అంటారు.
ఫ ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభం
ఫ టీకా తీసుకోని పిల్లలను
గుర్తించి వ్యాక్సినేషన్
ఫ జూన్ వరకు ప్రత్యేక కార్యక్రమం
టీకాలు వేయిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు
తల్లిదండ్రులు తమ రెండేళ్లలోపు పిల్లలకు నిర్దిష్ట సమయాల్లో సూచించిన టీకాలను వేయించుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. కొందరు అవగాహన లేమితో సకాలంలో టీకాలను వేయించుకోవటం లేదని గుర్తించి వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా టీకాలను వేస్తున్నాం.
– రత్న, జిల్లా వ్యాధి నిరోధక
టీకాల అధికారి, సూర్యాపేట.
వాక్సినేషన్ వివరాలు ఇలా....
సంవత్సరం కేంద్రాలు టార్గెట్ పిల్లలు టీకాలు వేసింది గర్భిణులు వ్యాక్సినేటెడ్
2023 2,248 2,200 2,243 530 545
2025 ఏప్రిల్ 1,073 1,300 1,323 295 302
2025 మే 751 1,185 1,113 320 270

శిశువుల ఆరోగ్యానికి మిషన్ ఇంద్రధనుష్