
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : వన మహోత్సవాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో డీఎఫ్‌ఓ సతీష్ కుమార్ కన్వీనర్‌గా నిర్వహించిన వన మహోత్సవం, అటవీ రక్షణ కమిటీ సమావేశంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ కలిసి 50.4 లక్షలు, అటవీ శాఖ 2.3 లక్షలు, మున్సిపాలిటీలు 1.3 లక్షల మొక్కలు మొత్తం 54 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారని తెలిపారు. వర్షాకాలం మొదలైనందున జూన్ 10 లోపే మొక్కలు పెద్ద ఎత్తున నాటాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అటవీ క్షేత్రస్థాయి పర్యటన, సర్వే, భూ సేకరణతో పాటు పంచానామా సమయంలో పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వివి అప్పారావు, ఆర్డీఓలు వేణు మాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీపీఓ యాదగిరి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, డీఐఈఓ భానునాయక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, దయానంద రాణి, జగదీశ్వరరెడ్డి, అబ్కారీ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్, పశుసంవర్థకశాఖ అధికారి శ్రీనివాస్, ఇండస్ట్రీస్ మేనేజర్ సీతారాం నాయక్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, ఎఫ్‌ఆర్ ఓ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్