
అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన బాలబాలికలకు 2025 సంవత్సరంలో అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డులకు జూలై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డుకు 5నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులని, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, ధైర్య సాహసాలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కళలు వంటి సేవారంగాలోల ప్రావీణ్యం కలిగి ఉండాలని సూచించారు. ఆన్‌లైన్‌లో national Awards (https://awards.gov.in) దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం దరఖాస్తు కాపీలను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు.
భౌతిక శాస్త్రం అంటేనే నిజాన్ని నిగ్గు తేల్చేది
సూర్యాపేటటౌన్ : భౌతిక శాస్త్రం అంటేనే నిజాన్ని నిగ్గు తేల్చేదని, ఉపాధ్యాయులు ఈ సబ్జెక్టుపై అవగాహన పెంచుకొని విద్యార్థులకు బోధిస్తే ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చని కోర్సు కో ఆర్డినేటర్ వి.యతిపతిరావు అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని హనుమాన్ నగర్‌లోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకు రెండవ స్పెల్ శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐదు రోజుల శిక్షణలో నియమ నిబంధనలు, క్రమశిక్షణ పాటిస్తూ రిసోర్స్ పర్సన్ చెప్పిన అంశాలను జాగ్రత్తగా ఆకళింపు చేసుకోవాలన్నారు. వీటిని పాఠశాలలో అమలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీఎస్‌టీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రామలింగారెడ్డి, ఆర్పీలు అంకతి వెంకన్న, ఎస్. కె.ఖాదర్ బాషా, మధుసూదన్ రెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అక్రమ రవాణాను
నిరోధించడం అందరి బాధ్యత
సూర్యాపేటటౌన్ : మనుషుల అక్రమ రవాణాను నిరోధించడం అందరి బాధ్యతఅని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ సూచించారు. మనుషుల అక్రమ రవాణా పై ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం సూర్యాపేట కేజీబీవీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద నేరంగా ఉందని, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీనికి గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంజయ్య, చంద్రయ్య, శ్రావ్యశృతి, శ్రావణ్, టీచర్స్ పాల్గొన్నారు.
ఎస్‌ఈటీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
తాళ్లగడ్డ (సూర్యాపేట) : స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (ఎస్‌ఈటీ) అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకు న్నారు. సూర్యాపేట పట్టణంలో స్వామి నారా యణ గురుకుల పాఠశాలలో ఆ సంఘం సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్ను కున్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలిగా వురిమల్ల గీత, ఉపాధ్యక్షులుగా హసానబాద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పొడిశెట్టి సైదులు, కార్యదర్శిగా మట్టపల్లి సైదులు, కోశాధికారిగా పి.వనజ, జిల్లా కౌన్సిలర్‌గా షేక్ నీలోఫర్ లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక విద్యావిధానాన్ని పటిష్టపర్చడానికి కృషి చేస్తానన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల సమస్యల పరిష్కారానికి పాటుపడుతానన్నారు.

అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి