Jagtial
-
వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
జగిత్యాల/జగిత్యాలటౌన్/మేడిపల్లి/కథలాపూర్:జిల్లాకేంద్రంలో గురువారం మధ్యాహ్నం గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మురుగు కాలువల్లోని చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. లోతట్టు ప్రాంతాలైన తులసీనగర్, లింగంచెరువు, పార్క్ సందులను పరిశీలించారు. ఆమె వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి, బల్దియా సిబ్బంది ఉన్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీరు ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మేడిపల్లి వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడిపల్లి మండలకేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు నీరు రోడ్లపైకి చేరింది. భీమారంలోని కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మేడిపల్లి నుంచి దేశాయిపేట వరకు ఇటీవల వేసిన డబుల్ రోడ్డు పక్కన సైడ్‌బర్మ్ మట్టి కొట్టుకపోవడంతో వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కథలాపూర్‌లో భారీ వర్షం కథలాపూర్‌లో భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. -
భాగ్యరెడ్డి వర్మ ఆదర్శం
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలటౌన్: సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జగిత్యాలక్రైం: దళిత ఉద్యమానికి పునాది వేసిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అని అడిషనల్ ఎస్పీ భీంరావ్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఏటా మే 22న జయంతిని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, ఆర్ఎస్సై రమేశ్, డీపీవో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ధర్మపురిలో మారుమోగిన శ్రీరామ నామం ధర్మపురి: హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీప్రసన్నాంజనేయ స్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. స్వామివారికి వేదపండితులు క్షీరాభిషేకం చేశారు. అంజన్న మాలలు ధరించిన భక్తులంతా కొండగట్టు నుంచి ధర్మపురికి చేరుకున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ధర్మపురికి చెందిన గునిశెట్టి అంజన్న మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు పాల్గొన్నారు. నృసింహుడి ఆదాయం రూ.8లక్షలుశ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం టికెట్లు, ప్రసాదాలు, అన్నదానం ద్వారా రూ. 8,18,480 వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.డీఎస్పీ రఘుచందర్ బదిలీ నిలిపివేతజగిత్యాలక్రైం: ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇందులో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ను ఇంటలీజెన్సీ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న వెంకటస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా రఘుచందర్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్‌లో మహా చండీయాగంజగిత్యాలటౌన్: జూన్ 14, 15న ఉద్యమకారుల మహా చండీయాగం చేపడుతున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని యాగం చేపడుతున్నామన్నా రు. తిమ్మాపూర్ మండలంలోని తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యాగం ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి భారతపు లింగా రెడ్డి, ప్రేంకుమార్, వేణుగోపాల్, చినారెడ్డి, మల్లేశం, గాలిపెల్లి సత్తవ్వ, శంకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత అన్నారు. ప్రాజెక్టులో అవినీతి లేదని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ నాగరత్న బెంచ్ స్పష్టం చేసిందన్నారు. నీటి ప్రాజెక్ట్‌లు ప్రజాప్రయోజనాల కోసం చేపడతారని, ప్రాజెక్ట్‌లతో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారని గుర్తు చేశారు. ఇది సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్‌రెడ్డి సర్కారుకు చెంప పెట్టు అన్నారు. -
యువతకు ఉపాధి కల్పిస్తాం
జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. గురువారం జగిత్యాల మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న 12 మంది ఎస్టీ, 152 మంది మైనార్టీ, 57 మంది ఈబీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
జగిత్యాల: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 428 కేంద్రాల ద్వారా 65,554 మంది రైతుల నుంచి 3.88 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని, రూ.723.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నరకాలకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని వివరించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు ప్రారంభం గొల్లపల్లి: మండలంలోని దమ్మన్నపేట నుంచి హనుమాన్ ఆలయం వరకు నిర్మించిన సీసీరోడ్డును విప్ అడ్లూరి మాజీమంత్రి జీవన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ పురాపాటి రాజిరెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ధర్మపురి: ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మీ చెక్కులను విప్ పంపిణీ చేశారు. 54 మందికి రూ.54 లక్షల చెక్కులు అందించారు. పేద ల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఎంపీడీవో రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సుమన్, నాయకులు ఎస్ దినేష్, చిలుముల లక్ష్మణ్ తదితరులున్నారు. -
అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలి
జగిత్యాల: మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. వార్డుల్లో కొనసాగుతున్న పనులను నాణ్యతతో చేయించాలని, ఆగిపోయిన పనులకు తిరిగి టెండర్లు పిలవాలని, వర్షాకాలానికి ముందే పూర్తి చేసేలా చూడాలని సూచించారు. డీఈ నాగేశ్వర్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్, ఏఈలు చరణ్, అనిల్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంచాలి విద్యార్థుల్లో దేశభక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గురువారం ఓల్డ్ హైస్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలు వివరించాలని, మత్తుకు బానిస కాకుండా చూడాలన్నారు. డీఈవో రాము, మండల విద్యాధికారి చంద్రకళ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పాలన వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనం
మల్లాపూర్/కోరుట్ల/కోరుట్లరూరల్: కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనంలో పయని స్తోందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నా రు. మల్లాపూర్‌లో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాల్లో కోత పెడుతున్న ప్రభుత్వం ప్రజలు, రైతులను వంచిస్తోందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి కొట్లాడుతానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి పాల్గొన్నారు. హనుమాన్ జయంతిలో ఎమ్మెల్యే కోరుట్ల/కోరుట్ల రూరల్: కోరుట్లతోపాటు కల్లూర్ హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం ప్రారంభించారు. నాయకులు చీటి వెంకట్రావు, రాజేశ్, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. -
Operation Kagar: మావోళ్లు ఎలా ఉన్నరో?
సాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది. భయపెడుతున్న ఘటనలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, సీ–60, ఎస్‌వోజీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లావాసులే కీలకం పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్ విజయ్, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్ దాతు ఐలయ్య, సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది. -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
మెట్‌పల్లిరూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగుతున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం బండలింగాపూర్ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు వెంటనే తరలించాలని ఆదేశించారు. లారీల కొరత ఎక్కడా లేదన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, డీసీవో మనోజ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, వర్షాలు పడుతున్న నేపథ్యంలో వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని 65 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. ఇప్పటివరకు 11,51,922 క్వింటాళ్ల ధాన్యం సేకరించామన్నారు. ఏపీఎం గంగాధర్, సీసీలు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు. -
క్యూఆర్ కోడ్ అమలులో రెండు ఠాణాలకు ప్రశంసలు
జగిత్యాలక్రైం: ప్రజలు, బాధితులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా పోలీసు శాఖ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. సీఎఫ్‌సీ ద్వారా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో పది పోలీస్స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందులో జిల్లా నుంచి మేడిపల్లి ఠాణ రాష్ట్రంలో రెండో ర్యాంక్, ఇబ్రహీంపట్నం ఆరో ర్యాంక్ సాధించాయి. మేడిపల్లి ఎస్సై శ్యాంరాజ్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్‌కు బుధవారం హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్ చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ వారిని అభినందించారు. జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్రస్థాయిలో ప్రశంస పత్రం అందుకోవడం అభినందనీయమన్నారు. మేడిపల్లికి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు ఆరో స్థానంలో ఇబ్రహీంపట్నం ఠాణా డీజీపీ చేతులమీదుగా పత్రాలు అందుకున్న ఎస్సైలు -
నవ భారత నిర్మాత రాజీవ్‌గాంధీ
జగిత్యాలటౌన్: నవ భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్‌గాంధీ అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇందిరాభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజీవ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనకు ఆయన కృషిని మరువలేమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, నక్క జీవన్, రఘువీర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో.. ధర్మపురి: రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని విప్ అడ్లూరి అన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నాయకులు ఎస్ దినేష్, వేముల రాజు, సింహరాజు ప్రసాద్, చిలుముల లక్ష్మణ్ తదితరులున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభంమేడిపల్లి: మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. కట్లకుంటలో బీరప్ప కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్‌కు నోటీసులు కక్ష సాధింపు చర్యజగిత్యాల: కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యేనని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మంచి పరిపాలన అందించారని, ప్రజలు, రైతులకు నీరు అందించాలని కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని, అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని తెలిపారు. పంటలకు నీరు అందించక ఎండబెట్టిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదన్నారు. కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ చూసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. ధర్మపురిలో భక్తుల రద్దీధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రసన్నాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీలక్ష్మీనృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కొలతల ప్రకారం విద్యార్థులకు దుస్తులుజగిత్యాలరూరల్: విద్యార్థులకు కొలతల ప్రకారమే దుస్తులను మహిళా సంఘాల సభ్యులతో కుట్టి ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. పొరండ్లలోని గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులు కుడుతున్న ఏకరూప దుస్తుల యూనిట్‌ను సందర్శించారు. జిల్లాలో పాత 18 మండలాల్లో క్లస్టర్ల వారీగా కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసి దుస్తులు కుట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉన్నది మాట్లాడితే ఉలుకెందుకు?
● పార్టీ మారి బుకాయింపా? ● మాజీమంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాలటౌన్: ఉన్నది మాట్లాడితే ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. తాను గాంధీభవన్‌లో మాట్లాడుతుండగా సంజయ్ ఏ పార్టీ అని మీడియా మిత్రులు అడిగితే స్పీకర్‌ను అడగాలని మాత్రమే చెప్పానని, తానెక్కడా సహనం కోల్పోలేదని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 1983 నుంచి 14సార్లు బీ ఫాం పొందడం తనకు.. పార్టీకున్న అనుబంధానికి నిదర్శమని, అత్యధిక సార్లు టికెట్ పొందానని, అత్యధికసార్లు గెలిచింది.. ఓడిపోయింది కూడా తానేనని వివరించారు. 2014లో ఉత్తర తెలంగాణ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా గెలిచిందిన తానేనన్నారు. బీఆర్ఎస్ పాలనపై తాను చేసిన పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజాజీవితాన్ని ఎప్పుడూ లాభనష్టాలతో చూడలేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి ఉల్టా చోర్ కోత్వాల్కుడాంటే అన్న చందంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నర్సింగాపూర్‌లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపల్లి దుర్గయ్య, గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లు శ్రమిస్తే.. ముప్పై ఏళ్లు దిగుబడి
● ఆయిల్‌పాం సాగువైపు రైతుల మొగ్గు ● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్ బాధ్యత కంపెనీదే ● ఈ సారి 3వేల ఎకరాల్లో సాగు లక్ష్యంకరీంనగర్అర్బన్: ఇష్టారీతిగా మందుల పిచికారీ, ఎరువుల వాడకంతో సాగు నేలలు గుల్లబారుతున్నాయి. పంట దిగుబడులు తగ్గుతుండగా పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలో అన్నదాతకు అధిక ఆదాయన్నిచ్చే ఆయిల్‌పాం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లు శ్రమిస్తే 30ఏళ్ల వరకు ఆదాయం వస్తుండగా మందుల పిచికారీ, ఎరువుల వాడకం ఉండదు. జిల్లాలో గత రెండేళ్లలో 2,500 ఎకరాల వరకు సాగు చేయగా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే మానకొండూరు మండలం వేగురుపల్లిలో ముత్తారెడ్డి పంట దిగుబడి పొందుతుండగా ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యా న, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు లోహి యా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. 3వేల ఎకరాలు లక్ష్యం జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు దాదాపు 12,000 ఎకరాల్లో ఆయిల్‌పాంను సాగు చేస్తున్నారు. వివిధ మండలాల్లో మరికొంత మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాలుగేళ్లు పంట సాగుకు శ్రమిస్తే 30 ఏళ్లపాటు ఏటా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడులు తీయొచ్చు. ఒక టన్నుకు రూ.20,000 అయినా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం రైతుకు వస్తుంది. జూలై నుంచి జనవరి వరకు పంట దిగుబడులను తీయొచ్చని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ● ఆయిల్‌పాం సాగు చేసే ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ సిస్టం కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ● మొక్కలకు సబ్సిడీ అందించడంతోపాటు బిందు సేద్యం ద్వారా నీరు అందించడానికి డ్రిప్ పరికరాలనూ సబ్సిడీపై అందించనుంది. ఆయిల్‌పాం మొక్కలను 80 శాతం సబ్సిడీపై రూ.1,140 రైతు వాటా చెల్లిస్తే ఎకరాకు 57 మొక్కలు ప్రభుత్వం అందిస్తుంది. ● నాలుగేళ్లు పంట నిర్వహణకు ఎకరాకు రూ.4,200 ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. ఇక వచ్చిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ● ప్రస్తుతం మానకొండూరు మండలం అన్నారంలో కేంద్రం ఏర్పాటు చేయగా డైరెక్టర్ ఆఫ్ హర్టికల్చర్ నిర్ణయించిన రేట్ల ప్రకారం కొనుగోలు చేయనుండగా దళారీ వ్యవస్థ అసలే ఉండదు. ● పంట చేతికొచ్చే నాలుగేళ్లలో అంతర పంటలుగా మొక్కజొన్న, పత్తి, పెసర, మినుములు, బొబ్బర, వేరుశనగ మొదలగు పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
భూసేకరణ పరిహారం ఫైళ్లు మాయం
సిరిసిల్ల: జిల్లాలో భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి. జిల్లాలో భారీ, మధ్యతరహా జలాశయాల నిర్మాణాలు, కాల్వలు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు పట్టాభూములను సేకరించారు. ప్రజాప్రయోజనార్థం ప్రజల నుంచి సేకరించిన భూములకు సంబంధించిన రికార్డులు(ఫైళ్లు) జిల్లా రెవెన్యూ అధికారుల వద్ద కనిపించడం లేదు. గతంలో జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడంపై జిల్లా అధికారులు అయోమయానికి గురయ్యారు. గతంలో జిల్లాలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ఆ రికార్డులను మాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. మధ్యమానేరు జలాశయానికి సంబంధించి అప్పటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) నటరాజ్ ఫైళ్లు మాయం చేశారని అతనిపై అప్పట్లోనే కేసు నమోదైంది. అతని వద్ద ఫైళ్ల రికవరీకి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత జిల్లాలో మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు–9, 8, 7, 6, 5లకు సంబంధించిన భూసేకరణలు భారీ ఎత్తున జరిగాయి. మొత్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల ఫైళ్లు మాయం కావడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి నివేదిక.. కేసు నమోదుకు అవకాశం సిరిసిల్ల, వేములవాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో భూసేకరణ ఫైళ్లు కనిపించడం లేదు. ఆ రెండు ఆఫీస్‌ల్లో పూర్తి స్థాయిలో వెదికిన అధికారులు రికార్డులు లేవని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు రికార్డులను మాయం చేసిన గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఎన్ని ఫైళ్లు మాయమయ్యాయి.. ఎంత మేరకు పరిహారం చెల్లించారు.. ఎన్ని ఎకరాలకు చెల్లించారు.. ఎందుకు రికార్డులు మాయం చేశారు అనే అంశాలను బయటకు రాకుండా జిల్లా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాజన్నసిరిసిల్ల జిల్లాలో భూసేకరణ ఫైళ్ల మాయం రెవెన్యూ అధికారుల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవోపై కేసు నమోదై, పూర్తి స్థాయి విచారణ జరిగితే భూసేకరణలో జరిగిన అక్రమాలన్నీ బయటపడనున్నాయి. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యేకాధికారి పూర్తి స్థాయిలో వివరాలను క్రోఢీకరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం విశేషం. అధికారుల అయోమయం జిల్లాలో పనిచేసిన అధికారిపై కేసు నమోదుకు సిఫార్సు -
తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడి మృతి
ముస్తాబాద్ (సిరిసిల్ల): మండలంలోని కొండాపూర్‌లో పెద్దూరి బలరాంగౌడ్(56 ) అనే గీతాకార్మికుడు తాటిచెట్టు పై నుంచి పడి దుర్మరణం చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన పెద్దూరి బలరాంగౌడ్ మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ, ముగ్గురు కొడుకులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు తాటి వనానికి వెళ్లి గాలించగా ఓ చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. మోకు జారీ చెట్టుపై నుంచి పడి మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు. భార్య పద్మ, కుమారులు శివ, శ్రవణ్, సంజయ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం
ధర్మపురి: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం పాలైన ఘటన ధర్మపురిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన వొడ్నాల భూమేశ్ అలియాస్ భూమేశ్వర్ భార్య బింధు కరీంనగర్లో టీటీసీ చేస్తోంది. ధర్మారం డిగ్రీ కళాశాలలో ప్రైవేటు అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. బింధు ప్రతిరోజూ కరీంనగర్ వెళ్లడానికి ఉదయం బస్టాండ్‌కు వస్తుంది. జగిత్యాల మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. ఎప్పటిలాగే బుధవారం కూడా భర్త భూమేశ్తో కలిసి ద్విచక్రవాహనంపై బస్టాండ్‌కు వచ్చింది. అప్పుడే బస్సు వెళ్లిందని తెలుసుకున్న భూమేశ్ బస్సును అందుకునేందుకు జగిత్యాల వైపు బయల్దేరాడు. పట్టణ శివారులోని పెట్రోల్‌బంక్ వద్దకు రాగానే రాంగ్రూట్లో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. భూమేశ్ (43) తలకు బలమైన గాయాలయ్యాయి. బింధు కాలుకు ఫ్యాక్చర్ అయింది. ఇద్దరినీ జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. భూమేశ్ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. భూమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. టాటా ఏస్ వాహనం నడిపింది మైనర్ అని, అతడిది తీగళధర్మారమని పోలీసులు గుర్తించారు. భూమేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. భూమేశ్ మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఎన్టీపీసీ ప్లాంట్‌లో ప్రమాదం .. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టులో వేడిఆయిల్ లీకేజీ కావడంతో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రామగుండం ప్రాజెక్టు స్టేజ్–2లోని 500 మెగావాట్ల నాలుగో యూనిట్ ప్రాంతంలో ఫ్యాబ్ ఎరెక్టర్స్ సంస్థలో బుధవారం ఉదయం షిప్టులో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిరవేన కొమురయ్య, అన్నపూర్ణకాలనీకి చెందిన మహ్మద్ అంకూస్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయిల్ ఫైర్ చేసేందుకు ఉన్న ట్యాంకుల నుంచి వేడి ఆయిల్ టర్బైన్‌కు వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా లీకేజీ కావడంతో కాంట్రాక్టు కార్మికులపై పడింది. దీంతో తోటి కాంట్రాక్టు కార్మికులు ప్రమాద విషయాన్ని అధికారులకు తెలియజేశారు. వెంటనే అంబులెన్స్ ద్వారా ఇద్దరు కార్మికులను చికిత్స నిమ్తితం పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రిలో చేర్పించారు. సిరవేన కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అంకూస్‌కు చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని అధికారులు సందర్శించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హుజూరాబాద్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన శ్రావణ్(34) ప్రైవేటు ఉద్యోగి. తన ద్విచక్ర వాహనం వెళ్తుండగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతుడి జేబులో ఉన్న సెల్ఫోన్లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేయగా మృతుడి పేరు మాత్రమే తెలిసింది. చౌరస్తా వద్ద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్వగ్రామం చేరిన మృతదేహంమల్యాల: పోలాండ్ దేశంలో కారు ఢీకొని చనిపోయిన మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ (29) మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. మల్యాలకు చెంది పర్శరాం, భూలక్ష్మీ కుమారుడు మనోజ్ ఉపాధి కోసం మస్కట్ వెళ్లి వచ్చాడు. ఐదు నెలల క్రితం పొలాండ్ దేశం వెళ్లాడు. అక్కడ ఫిక్కీ అనే గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 12న డ్యూటీకి వెళ్తుండగా.. వెనుక నుంచి కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పొలాండ్‌లోని తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల చంద్రభాను, కార్యదర్శి గంగుల శైలేంద్ర సహకారంతో మృతదేహం స్వగ్రామానికి చేరింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆయన చితికి తండ్రి పర్శరాం తలకొరివి పెట్టాడు. స్వగ్రామం చేరిన మృతదేహంమల్యాల: పోలాండ్ దేశంలో కారు ఢీకొని చనిపోయిన మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ (29) మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. మల్యాలకు చెంది పర్శరాం, భూలక్ష్మీ కుమారుడు మనోజ్ ఉపాధి కోసం మస్కట్ వెళ్లి వచ్చాడు. ఐదు నెలల క్రితం పొలాండ్ దేశం వెళ్లాడు. అక్కడ ఫిక్కీ అనే గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 12న డ్యూటీకి వెళ్తుండగా.. వెనుక నుంచి కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పొలాండ్‌లోని తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల చంద్రభాను, కార్యదర్శి గంగుల శైలేంద్ర సహకారంతో మృతదేహం స్వగ్రామానికి చేరింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆయన చితికి తండ్రి పర్శరాం తలకొరివి పెట్టాడు. -
చదవనిద్దాం.. ఎదగనిద్దాం
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థి దశలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత వేసే అడుగే కీలకం. ఇంటర్లో సరైన అడుగు పడితేనే జీవితంలో త్వరగా స్థిరపడతాం. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. తమ పిల్లల ఆసక్తిని తెలుసుకొని ప్రొత్సహించినప్పుడే భవిష్యత్‌లో రాణించగలుగుతారు. ఈ సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని విద్యావేత్తలు, మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టమైన కోర్సులను పిల్లలపై బలవంతంగా రద్దువద్దని కోరుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలలు, 31 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 14 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. అడ్మిషన్.. ఆలోచించాల్సిన సమయం పదోతరగతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలో 12,245 మంది, రాజన్నసిరిసిల్లలో 6,629, పెద్దపల్లిలో 7,157, జగిత్యాలలో 11,636 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరంతా ఇంటర్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు సిద్ధమవగా.. మరికొందరు హైదరాబాద్, కరీంనగర్ వంటి పట్టణాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో చేరేందుకు ఇప్పటికే అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మరికొందరు విద్యార్థులు పాలీసెట్ రాసి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అత్తెసరు మార్కులతో పాసైన వారు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకోవడం ఉత్తమమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అయితే ఏం చదువాలో అనే నిర్ణయం విద్యార్థులకు వదిలేయాలని, సలహాలు.. సూచనలు మాత్రమే ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులు కరీంనగర్ 12,245 రాజన్నసిరిసిల్ల 6,629 పెద్దపల్లి 7,157 జగిత్యాల 11,636 -
సూచనలు, మార్కెటింగ్
ఆయిల్‌పాం సాగుకు జిల్లాలోని నేలలు అనుకూలం. రైతులకు రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తాం. పంట కోతకు వచ్చాక మేమే మార్కెటింగ్ నిర్వహిస్తాం. ఎకరాకు 57 మొక్కలు అవసరం కాగా ఒక మొక్క పూర్తి ఖర్చు రూ.198 కానీ, సబ్సిడీపై రైతులకు ఒక మొక్కను కేవలం రూ.20 అందిస్తున్నాం. – కె.విజయ్‌భరత్, ప్రాజెక్ట్ మేనేజర్, లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ రైతుల నుంచి స్పందన ఆయిల్‌పాం సాగుకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ప్రతీ మండలంలో వంద ఎకరాలకు పైగా సాగులో ఉంది. ప్రభుత్వం అదనంగా మరో 3వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. తదనుగుణంగా సదస్సులు నిర్వహిస్తుండగా రైతులు ముందుకొస్తున్నారు. – ఆర్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి -
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు. ఇద్దరికీ 64 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. ఒకే ఊరిలో ఉంటున్నా చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో దశాబ్ద కాలంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. వృద్ధాప్యానికి చేరువైనా రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు మాట్లాడుకోక పోవడం నాగయ్య కుమారుడు శ్రీనివాస్‌ను కలచివేసింది.ఎలాగైనా ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. ఇదిలా ఉండగా నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ నెల 18న మూడో రోజు కార్యక్రమం (పిట్టకు పెట్టుడు) నిర్వహించగా, అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఈక్రమంలో ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ భావించాడు. సోదరులు మామిండ్ల అంజయ్య, శ్రీనివాస్, రాజు, తిరుపతి, ఇతర బంధువులకు చెప్పడంతో వారు సహకారం అందించారు. నాగయ్య, రామయ్యకు బంధాల ప్రాధాన్యత వివరించారు. దీంతో ఇద్దరూ చెమర్చిన కళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఘటన కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.సావుదలకు పట్టింపులెందుకు..మేము వృద్ధాప్యంలోకి వచ్చాం. కాటికి కాలుజాపిన మాకు పట్టింపులు ఎందుకు. గతంలో చిన్నచిన్న కారణాలతో దూరమయ్యాం. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాం.– మామిండ్ల నాగయ్యపొరపాట్లను వదిలిపెట్టాంమేము ఐదుగురం అన్నదమ్ములం. ముగ్గురు ఇదివరకే చనిపోయారు. మేమిద్దరం ఉన్నాం. ఉన్న ఇద్దరం కలిసుంటే బాగుంటుందని అనిపించింది. పదేళ్లుగా దూరంగా ఉంటున్న మేము చనిపోయేవరకు కలిసే ఉంటాం.– మామిండ్ల రామయ్య -
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారితో వీరేందర్‌నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది. 16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు.. సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్‌నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర.. ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్‌నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం. – నక్క మానస, పెళ్లి కూతురు ఆనందమో.. బాధో తెలియడం లేదు పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – వీరేందర్‌నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడుఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు -
పచ్చిరొట్ట విత్తనాల ధరలు తగ్గించండి
● రాయికల్‌లో రైతుల రాస్తారోకో ● మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్జగిత్యాలరూరల్(రాయికల్): పచ్చిరొట్ట విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాయికల్‌లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. బీఆర్ఎస్ రాయికల్ పట్టణ కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ ధరలు రెండింతలు పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. వాటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సై సుధీర్‌రావు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు వ్యవసాయాధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతునాయకులు కుర్మ మల్లారెడ్డి, తిరుపతి, సంజీవ్, నరేశ్, గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
భూ భారతి సరిచేసేనా..?
● జిల్లాలో భూ సమస్యలు అధికం ● ధరణి స్థానంలో భూ భారతి చట్టం ● పైలెట్ ప్రాజెక్ట్‌గా బుగ్గారం ఎంపిక ● వందల్లో దరఖాస్తుల స్వీకరణజగిత్యాల: ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా బుగ్గారం మండలాన్ని ఎంపిక చేయగా.. ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మండలంలో వందల్లో దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అసైన్డ్, అటవీ భూములు, పార్ట్–బీలో పేర్కొన్న నిషేధిత జాబితాలోని భూ ములు అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చట్టంతో సమస్యలు తీరుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభంగా అయ్యేలా చట్టం రూ పొందించడంతోపాటు తహసీల్దార్లు, ఆర్డీవో లకు మ్యూటేషన్ అధికారం కల్పించడంతో సమస్యలు వేగవంతంగా తీరే అవకాశాలున్నాయంటున్నా రు. జిల్లాలో గత నెల 15 నుంచి 30వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. బుగ్గారంలో రైతుల నుంచి ఈనెల 5 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన సమస్యలను పరి ష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో బృందానికి నాయబ్ తహసీల్దార్, గిర్దవార్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లను కేటాయించారు. మొదట రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తద్వారా గ్రామాల్లో రైతుల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటించి భూమి భౌగోళిక హద్దుల్ని నమోదు చేస్తారు. సంబంధిత వివరాలను తహసీల్దార్లకు నివేదించగా దానిపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటారు. వందల్లో దరఖాస్తులు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న బుగ్గారం మండలంలో మొత్తం 744 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు 84, పెండింగ్ మ్యూటేషన్లు 22, ఏరియా కరెక్షన్ 128, డీఎస్ పెండింగ్ 10, ల్యాండ్ నేచర్ క్వాలిషిఫికేషన్ 9, పట్టాదారు డిటేయిల్స్ 10, నిషేధిత భూముల గురించి 11, అసైన్డ్ భూమి గురించి 21, సక్సెషన్ 108, ల్యాండ్ ఇక్వేషన్ 2, సాదాబైనామాలు 298, పట్టా ల్యాండ్ల గురించి 35, కాస్తు గురించి ఒక టి, డూప్లికేట్ పాస్బుక్ల గురించి 4, మెర్జింగ్ ఖా తా గురించి ఒక దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికారులు 181 దరఖాస్తులను విచారించగా 563 విచారణ చేపడుతున్నారు. బుగ్గారంలో 10 గ్రామాలు ఉండగా.. 122661.21 ఎకరాల భూ మి ఉంది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులు అధికా రులు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. రైతుల్లో ఆశలు భూభారతి చట్టంతో రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ధరణి పోర్టల్ అమలులో ఉన్నప్పుడు చాలామంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రతీది సీసీఎల్ వరకు వెళ్లే పరిస్థితి ఉండేది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో కొన్ని పరిష్కారం అ య్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు చేసేదేమీలేక ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి స్థానంలో భూభారతి తీసుకురావడంతో అన్ని సమస్యలకు వెసులుబాటు కల్పించడంతో రైతులకు ఇది ఎంతో మేలు జరుగుతుంది. నేరుగా రైతుల వద్ద నుంచి దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ ఇక నుంచి కొత్తగా సర్వే పటం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. ముఖ్యంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కొమ్మనపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. మొదట ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, వక్ఫ్, అటవీ తదితర భూములును సర్వే చేయనున్నారు. పహాణిలో ఉన్న వివరాలు, సర్వే ద్వారా వచ్చిన వివరాలను సరిచూసి చర్యలు తీసుకోనున్నారు. ఇలా త్వరలోనే జిల్లా వ్యాప్తంగా వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.దరఖాస్తులకు పరిష్కారం ఇప్పటికే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూభారతి చట్టంపై అవగాహన కల్పించాం. పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం ఎంపిక కాగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. మండలంలో 744 దరఖాస్తులు వచ్చాయి. 181 విచారణ చేపట్టాం. 563 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది. సత్యప్రసాద్, కలెక్టర్ బుగ్గారం మండల విస్తీర్ణం 19,735.36రెవెన్యూ గ్రామాలు 10పంచాయతీలు 10మొత్తం భూమి 12,261.21 ఎకరాలు ఎండోమెంట్ : 7.01 ఎకరాలు అటవీ : 2,474.25 ఎకరాలు వక్ఫ్ : 1.27 ఎకరాలు సీలింగ్ అసైన్డ్ : 480.16 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ : 716.38 ఎకరాలు ప్రభుత్వ భూమి : 7113.20 ఎకరాలు -
రెక్కలు?
భూముల ధరలకుసాక్షిప్రతినిధి,కరీంనగర్: భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దాన్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువురుశాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కమిటీలు ఇలా.. భూముల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్‌బాడీస్) చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్‌గా సబ్‌రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్‌గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్‌రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్‌గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. మే నెలాఖరుకు నివేదిక ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు వారి పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరున (28న) నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నారు. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2024 88,762 231.98 2025 32,383 86.25 మరోసారి మార్కెట్ విలువ పెంపు 50 నుంచి 100శాతం పెంచేలా కసరత్తు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం ఆదేశం మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు నివేదిక పంపేందుకు ఈ నెలాఖరు వరకు సమయం భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు -
జగిత్యాలకు ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు
● జగిత్యాల అంటే తానే అన్నట్లు జీవన్‌రెడ్డి అనుకోవద్దు ● కాంగ్రెస్‌లో అత్యధికసార్లు ఓటమి పాలైంది ఆయనే.. ● జీవన్‌రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫైర్జగిత్యాల: జగిత్యాలకు ఎవరేం చేశారో ప్రజలందరికీ తెలుసని, తాను చేసిన అభివృద్ధిని చూసే తనను రెండోసారి గెలిపించారని స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మోతెలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల అంటే తానే అన్నట్లు జీవన్‌రెడ్డి అనుకోవడం సరికాదని హితవు పలికారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు టికెట్ ఇచ్చిందని, అత్యధికసార్లు ఓడిపోయింది కూడా ఆయనేనని గుర్తు చేశారు. గాంధీభవన్‌లో కూర్చుని తనను ఇండిపెండెంట్ అనడం సరికాదన్నారు. గతంలో అనేకమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని, జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా డబుల్బెడ్రూంలు మంజూరు చేయించానని గుర్తు చేశారు. జీవన్‌రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, హుందాతనం కాపాడుకుంటే మంచిదని, సీనియర్ నాయకుడిగా సలహాలు ఇవ్వాలని సూచించారు. తనను తరచూ విమర్శిస్తే ఊరుకోనన్నారు. ఆయన అనుచరులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇకనుంచి సంహించబోనన్నారు. 2014లో ఇవే చివరి ఎన్నికలు అని చెప్పడంతో తనపై జీవన్‌రెడ్డి గెలిచినా. నైతిక విజయం తనదేనన్నారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన జేఎన్టీయూ, న్యాక్ సెంటర్ గుట్టల్లో పెట్టారని, అక్కడకు సరైన రోడ్లు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ఎత్తిపోతల పథకంగానీ.. చెరువులు నింపే ప్రయత్నంగానీ చేయలేదన్నారు. ఆయన వెంట నాయకులు దామోదర్‌రావు, ముజాహిద్, గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, రాజేందర్‌రెడ్డి, నక్కల రవీందర్‌రెడ్డి, గోలి శ్రీనివాస్, రాజిరెడ్డి, ముస్కు నారాయణరెడ్డి, సురేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
జగిత్యాల: బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఎవరైన ఆవులు, లేగదూడలను వధిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మంగళవారం సమీక్షించారు. స్లాటర్ హౌస్‌ల వద్ద పరిశుభ్రత ఉండేలా చూడాలని కమిషనర్లను ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.కార్మిక చట్టాలు అమలు చేయాలిజగిత్యాలటౌన్: పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుతారి రాములు, ఎండీ.ముక్రం డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకొచ్చాక 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తోందన్నారు. కార్మికుల చట్టాలు అమలు చేయాలని ఈనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూలై 9కు వాయిదా వేశామన్నారు. కార్యక్రమంలో ఇరుగురాళ్ల భూమేశ్వర్, వెన్న మహేష్, రామిల్ల రాంబాబు, మునుగూరి హన్మంతు ఉన్నారు.బాలామృతం పక్కదారిపై ఇన్చార్జి పీడీ విచారణమెట్పల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని కొందరు గేదెల పోషకులకు విక్రయిస్తున్న వైనంపై ‘సాక్షి’ ‘ఐసీడీఎస్‌లో ఆగని అక్రమాలు’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ శాఖ జిల్లా ఇన్చార్జి పీడీ నరేష్ మెట్‌పల్లికి వచ్చి స్థానిక ఏడో వార్డులో ఉన్న ఓ గేదెల కొట్టంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ గేదెలకు పెడుతున్న దాణాను పరిశీలించారు. అనంతరం పీడీ ‘సాక్షి’తో మాట్లాడారు. తమకు ఉన్న సమాచారంతో ఓ కొట్టంలో తనిఖీలు చేశామని, అందులో బాలామృతం ప్యాకెట్లు లభించలేదన్నారు. చిన్నారులకు ఈ ప్యాకెట్లను అందించే సమయంలో ఫొటోలు తీయాలనే నిబంధన ఉందని, దీనివల్ల అవి పక్కదారి పట్టే అవకాశమే ఉండదన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోషకాహారాన్ని అమ్ముకోవద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.కేసీఆర్ ఆనవాళ్లు చెరగవుకథలాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచం గర్వించదగిన నిర్మాణాలు చేపట్టారని, ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరగవని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూం, యాదాద్రి ఆలయం మచ్చుతునకలు మాత్రమేనని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నోళ్లు ప్రస్తుతం ప్రపంచానికి చూపిస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల స్మారక జ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని మిస్ వరల్డ్ పోటీదారులకు చూపిస్తే రాష్ట్ర గొప్పతనం మరింత వ్యాపిస్తుందన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన వాటిని అందాల భామలకు చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్కయిందన్నారు. -
పెద్ద జయంతికి ధర్మపురిలో ఏర్పాట్లు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని జయంతి వేడుకలకు ముస్తాబు చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు స్వామివారి జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయం లోపల, వెలుపల ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించారు. లడ్డూ, ప్రసాదాలను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కుట్రతోనే కేసీఆర్‌కు నోటీసులుజగిత్యాల: తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావ రి జలాలను తరలించడానికి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్పదని, రాజకీయ కుట్రతోనే కేసీఆర్‌కు కమిషనర్ నోటీసులు ఇచ్చారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రం దేశానికే అన్నం పెడుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు. త్వరలోనే కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. -
రైతులకు గుర్తింపు కార్డులు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన భూధార్‌కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వానాకాలం సీజన్ ప్రారంభం వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లి రైతుల బయోడేటా, భూ వివరాలు సేకరిస్తున్నారు. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య రైతులకు 11 అంకెలతో ఉద్యోగుల మాదిరిగానే రైతులకూ ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయం, రైతుల ప్రతి సమాచారం కోసం కేంద్రం రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో కేంద్రమే దేశవ్యాప్తంగా రైతులు, వారి భూ వివరాలు సేకరించాలని నిర్ణయించింది. రానున్న సీజన్ నుంచే పీఎం కిసాన్ నిధిని విశిష్ట సంఖ్య(భూధార్) ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మండల వ్యవసాయాధికారులు, ఏఈఓలతో సమావేశాలు నిర్వహించి, నమోదు ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. ప్రతి రైతు వివరాలు సేకరణ గ్రామస్థాయిలో ఏఈఓలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వారి బయోడేటా సేకరిస్తారు. రైతు పేరిట ఉన్న భూమి వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరించి.. రైతుల ఆధార్ సంఖ్య, సెల్ నంబర్‌తో ఏఈఓలు తమ వద్ద ఉన్న ట్యాబ్ ద్వారా ప్రత్యేక యాప్‌లలో అనుసంధానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో రైతుల కోసం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో ఈ రైతు గుర్తింపు సంఖ్య కీలకం కానుంది. ఇతర రాష్ట్రాలలో మీసేవ కేంద్రాల ద్వారా ఈ నమోదు కొనసాగుతుండగా.. ఇక్కడ ఏఈఓలే రైతుల వద్దకు వచ్చి నమోదు ప్రక్రియను చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన సెల్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ రిజిస్ట్రేషన్ సమయంలో రైతుల సెల్ నంబర్‌కు మూడు సార్లు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఏఈఓ వద్ద ఉన్న యాప్‌లలో నమోదు చేయగానే సదరు రైతుకు విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య వస్తుంది. గుర్తింపు సంఖ్యను గుర్తుంచుకోవాలి విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి ఇచ్చే సబ్సిడీలు, విత్తన పంపిణీ, రుణసాయం వంటి పథకాలన్నింటికీ ఇదే నంబర్ కీలకం కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్, సాయిల్ హెల్త్‌కార్డుల జారీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన, జాతీయ ఆహార భద్రత, పీఎం సమ్మాన్ నిధి, నాబార్డు రుణ సహాయం, జాతీయ ఉపాధి పథకం, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు గుర్తింపు సంఖ్యనే ప్రమాణీకం కానుంది. సెల్ నెంబర్ అధార్‌తో లింక్ అయి ఉంటేనే నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. లేదంటే రిజిస్ట్రేషన్ నిలిపివేయబడుతుంది. రైతులకు అవగాహన వ్యవసాయ సిబ్బంది చేసే నమోదు ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు వ్యవసాయ శాఖ అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి తోడు, గ్రామాల్లో మైకుల ద్వారా చాటింపు చేస్తున్నారు. గ్రామానికి ఏ రోజు ఏఈఓలు వస్తారో ముందుగానే ఆ గ్రామ రైతులకు సమాచారం ఇస్తున్నారు. అనర్హుల తొలగింపు, పథకాల అమలు తీరు తెన్నులను తెలుసుకోవడంలో ఈ సంఖ్య కీలకం కానుంది. ఆధార్ తరహాలో భూధార్ కార్డులు జిల్లాలో ప్రారంభమైన నమోదు ప్రక్రియ -
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
రామగుండం(కరీంనగర్): పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీవేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎనీ్టపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలు అందజేశారు.ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరో ఇద్దరికి గాయాలు సిరిసిల్లక్రైం/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలంలోని బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు తెలిపిన వివరాలు. తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరుకు చెందిన శనిగరపు దిలీప్(28) గజసింగవరంలోని తన బంధువుల వివాహ రిసెప్షన్‌కు ఆదివారం హాజరయ్యాడు. రాత్రి కావడంతో ఎల్లారెడ్డిపేటలోని బంధువుల ఇంట్లో నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున వేములవాడకు వెళ్తుండగా బైపాస్‌రోడ్డులోని మెడికల్ కాలేజీ వద్ద కల్వర్టులోకి బైక్ దూసుకెళ్లింది. దిలీప్ అక్కడికక్కడే మృతిచెందగా.. బైక్‌పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు దిలీప్ చనిపోవడంతో తల్లిదండ్రులు చంద్రయ్య, లక్ష్మి రోదనలు మిన్నంటాయి. దిలీప్ ఓ ప్రైవేట్ మైక్రోఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తుండేవాడని తెలిసింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకోరుట్ల రూరల్: మండలంలోని మోహన్‌రావుపేటలో ఆదివారం రాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇల్లలో దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన సింగు సురేశ్ రెండురోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు సురేశ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరిన సురేష్ బీరువాలో దాచిపెట్టిన నాలుగు తులాల బంగారం, 15 తులాల వెండి పట్టగొలుసులు, రూ.8వేల నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
2డే క్రికెట్ లీగ్ టోర్నీకి వేళాయే..
● 21 నుంచి జూన్ 5 వరకు లీగ్ మ్యాచ్‌లు ● వేములవాడ, కరీంనగర్ కేంద్రంగా పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో 2డే క్రికెట్ లీగ్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) రాష్ట్రస్థాయి టోర్నీల కోసం ముందస్తుగా ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్– 25 విభాగంలో 2డే క్రికెట్ టోర్నీ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలోని 9 నియోజకవర్గాల నుంటి 6 జట్లను ఎంపిక చేయగా, ఈ నెల 21 నుంచి జూన్ 6 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌ల వివరాలను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్ రావు, ఉపాధ్యక్షుడు కె.మహేందర్‌గౌడ్ వెల్లడించారు. ఈ పోటీల్లో రాణించినవారిని అండర్– 25 ఉమ్మడి కరీంనగర్ జట్టుకు ఎంపిక చేయనున్నారు. జూన్‌లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ టోర్నమెంట్లో కరీంనగర్ అండర్– 25 జట్టు పాల్గొననుంది. 6 జట్లు..16 మ్యాచ్‌లు.. ఉమ్మడి కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాల నుంచి 6 జట్లను ఎంపిక చేశారు. 3 వేదికల్లో 16 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ, సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల, వేములవాడలోని డాక్టర్ నర్సింగరావు మైదానాల్లో పోటీలు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌లు జూన్ 5, 6 తేదీల్లో శాతవాహనలో జరుగనున్నాయి. మ్యాచ్‌లు ఇవే.. ● 21, 22న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం – శాతవాహన యూనివర్సిటీ. ● 21, 22న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – సెయింట్ అల్ఫోన్స్ స్కూల్. ● 21, 22న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ. ● 24, 25న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ. ● 24, 25న కరీంనగర్‌టౌన్ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం– సెయింట్ అల్ఫోన్స్. ● 24, 25న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ. ● 27, 28న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ. ● 27, 28న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్. ● 27, 28న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ. ● 30, 31న కరీంనగర్ రూరల్, చొప్పదండిి వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ. ● 30, 31న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ కరీంనగర్‌టౌన్ – శాతవాహన యూనివర్సిటీ. ● 30, 31న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్– సెయింట్ అల్ఫోన్స్. ● జూన్ 2, 3న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – వేములవాడ. ● 2, 3న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్. ● 2, 3న కరీంనగర్ టౌన్ వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – శాతవాహన యూనివర్సిటీ. ● 5, 6న ఫైనల్.. లీగ్‌లో ఎక్కువ స్కోర్ చేసిన రెండు జట్లు – శాతవాహన యూనివర్సిటీ. -
పచ్చిరొట్ట ధరలు రెట్టింపు
● రేటు భారీగా పెంచడంతో రైతుల్లో అయోమయం ● సబ్సిడీ కూడా 60శాతం నుంచి 50 శాతానికి తగ్గింపు ● జిల్లా రైతులపై రూ.5.52 కోట్ల అదనపు భారంజగిత్యాలఅగ్రికల్చర్: పచ్చిరొట్ట విత్తనాల ధరలను ప్రభుత్వం అమాంతం పెంచింది. గతేడాదితో పోల్చితే ధర రెట్టింపు పెరగగా.. సబ్సిడీ కూడా పది శాతం తగ్గించింది. దీంతో రైతులు అయోమయంలో పడుతున్నారు. భూములకు పుష్టి ఇచ్చేందుకు తొలకరికి ముందుగానే జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట సాగు చేస్తారు రైతులు. ఈ విత్తనాలపై గతేడాది 60 శాతం సబ్సిడీ ఇవ్వగా.. ఈ ఏడాది 50 శాతానికి కుదించారు. విత్తనాల ధరలు కూడా రెట్టింపు చేశారు. ఈ లెక్కన జిల్లా రైతులుపై సుమారు రూ.5.52 కోట్ల భారం పడనుంది. ఇటు సబ్సిడీ తగ్గింపు, అటు విత్తనాలు రేట్లు పెరగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 23 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు జిల్లా రైతుల కోసం 23వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇటీవల 15వేల క్వింటాళ్ల జనుము, 1600 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను మాత్రమే అలాట్ చేశారు. ఇప్పటివరకు 9వేల క్వింటాళ్ల జీలుగ, 300 క్వింటాళ్ల జనుము మాత్రమే జిల్లాకు చేరింది. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగిల్‌విండోలు, డీసీఎంఎస్ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో సోమవారం నుంచి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ ఏడాది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలకు విత్తనాలను సరఫరా చేయడం లేదు. పెరిగిన విత్తనాల ధరలు విత్తనాల ధరలు రెట్టింపయ్యాయి. 30 కిలోల జనుము, 40 కిలోల జీలుగ బస్తాలను పంపిణీ చేస్తారు. గతేడాది జీలుగ కిలో ధర రూ.93 ఉండగా.. అందులో రూ.55.80 సబ్సిడీ ఇచ్చేవారు. రైతు కిలోకు రూ.37.20 చెల్లించేవారు. జనుము కిలోకు రూ.90.50 కాగా.. రూ.54.30 సబ్సిడీ పోను రైతు కేవలం రూ.36.20 చెల్లించేది. ప్రస్తుతం జీలుగ కిలో ధర రూ.142.50కు పెంచారు. ఇందులో సబ్సిడీ రూ.71.25 పోను రైతు రూ.71.25 చెల్లించాలి. జనుము కిలో రూ.125.50 ఉండగా.. సబ్సిడీ రూ.62.75 ఇస్తున్నారు. రైతులు రూ.62.75 చెల్లించాల్సి వస్తుంది. గతేడాదితో పోల్చితే జీలుగ కిలోకు రూ.34 పెరిగింది. జనుము కిలోకు రూ.26.55 పెరిగింది. 30 కిలోల జీలుగ బస్తాకు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా రూ.1020 చెల్లించాల్సి వస్తోంది. 40 కిలోల జనుము బస్తా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.1062 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా రైతులు 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2,137, జనుము బస్తాకు రూ.2,510 చెల్లించాల్సి ఉంది. 50 శాతానికి సబ్సిడీ తగ్గింపు విత్తనాల సబ్సిడీని గతేడాదితో పోల్చితే 10 శాతం తగ్గించారు. గతేడాది సబ్సిడీ 60శాతం ఇస్తే.. ఈ ఏడాది 50 శాతానికి కుదించారు. ఈ లెక్కన జీలుగ బస్తాపై రూ.102అధిక భారం పడుతుంది. జనుము బస్తాకు రూ.106.20 అదనపు భారం పడుతుంది. దివంగత వైఎస్ హయాంలో పచ్చిరొట్ట విత్తనాలపై 75శాతం సబ్సిడీ ఇచ్చారు. -
మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
● భార్యను గొంతు నులిమి చంపిన భర్త కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్‌కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్‌కుమార్‌కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య రామగిరి(మంథని): కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల లింగయ్య(90) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం .. లింగయ్య భార్య పద్మ కొంతకాలం క్రితం మరణించడంతో లింగయ్య ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి తన ఐదో కుమారుడు ఇంట్లో భోజనం చేయాలని అడుగగా తినకుండా వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి తలుపుతీయగా రేకులషెడ్డు కర్రకు ఉరి వేసుకుని ఉన్నాడు. తమ తండ్రి ఒంటరిగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి పెద్ద కుమారుడు వేముల కుమార్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. భర్తను చితకబాదిన భార్యఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బిడ్డను తీసుకెళ్తున్నాడని ఆగ్రహించిన భార్య.. భర్తపై దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పరిధిలోని కిష్టునాయక్‌తండాకు చెందిన ధరావత్ స్వప్న(మమత), విజయవాడకు చెందిన సిద్ది నాగార్జునరెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు అలేఖ్య జన్మించింది. నాగార్జునరెడ్డి మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలలుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలోనే నాగార్జునరెడ్డి మండల కేంద్రంలో ఉంటున్న తన భార్య వద్దకు వెళ్లి కూతురు అలేఖ్యను తనకు ఇవ్వమని గొడవకు దిగాడు. కూతురును లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్వప్న తన భర్తపై రాయితో దాడి చేసింది. నాగార్జునరెడ్డి తన కూతురును తనకు ఇవ్వాలని రోడ్డుపై కూర్చున్నాడు. గ్రామస్తులు జోక్యం చేసుకుని మంగళవారం మాట్లాడడానికి నిర్ణయించారు. -
రోడ్డు బ్లాక్ చేశారు
రైతు బజార్లో విక్రయించాల్సిన కూరగాయలను విద్యానగర్ రోడ్డుపై అమ్ముతుండడంతో రోడ్డు బ్లాక్ అవుతోంది. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే అమ్ముతుండడంతో రోడ్డు రద్దీగా ఉంటోంది. ఈ రోడ్డు వెంటే ఆస్పత్రులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు, అంబులెన్స్‌లు వెళ్లలేని పరిస్థితి ఉంది. విక్రయదారులను రైతుబజార్‌కు తరలించాలి. – విద్యానగర్వాసులు, జగిత్యాల కొండ చెరువును కాపాడండి రాయికల్ మండలంలోని ద్యావనపెల్లిలో కొండచెరువు కబ్జాకు గురవుతోంది. పశువులకు నీటి సౌలభ్యం కరువై రైతులు ఇబ్బంది పడుతున్నాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొండ చెరువుకు హద్దులు నిర్ణయించి కబ్జాదారుల నుంచి కాపాడాలి. – దావన్‌పల్లి, రాయికల్ వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడు వడ్డీతో సహా అ ప్పు చెల్లించినా వ్యాపారి లక్ష్మి ప తి వేధిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం బతుకు దెరువు కోసం దు బాయ్ వెళ్లాను. కథలాపూర్ మండలం పోతారా నికి చెందిన వడ్డీ వ్యాపారి పాలెపు లక్ష్మిపతి పరి చయం అయ్యాడు. ఆయన నుంచి రూ.2.20లక్షలు అప్పుగా తీసుకున్న. ఇప్పటివరకు రూ.5లక్షల దాకా చెల్లించాను. ఇటీవల స్వగ్రామానికి వచ్చాను. నాకంటే ముందే ఇక్కడకు వచ్చిన లక్ష్మీపతి అప్పు చెల్లించాలంటూ ఇంటికొచ్చి వేధిస్తున్నాడు. ఆ యన నుంచి నా కుటుంబానికి రక్షణ కల్పించండి. – దేశవేని నవీన్, ఽదరూర్ -
వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కరీంనగర్‌స్పోర్ట్స్: వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేస్తామని జిల్లా పేటా టీఎస్ అధ్యక్షుడు బాబు శ్రీనివాస్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన జిల్లా పెటా టీఎస్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఎల్లవేళలా సంఘం పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. పెటా టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యుల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం పెట టీఎస్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పెటా టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా దత్తాత్రి, హరికిషన్, వి.రూపారాణి, పి.శ్రీనివాస్, ఎన్.శ్యామలాదేవి, కె.రమాదేవి, పి.శ్రీనివాస్ జి.నిర్మల ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.రమేశ్‌కుమార్, వి.శ్రీలత, ఎం.చంద్రశేఖర్, వి.సూర్యప్రకాశ్, యజాజ్ అహ్మద్, బిట్ర శ్రీనివాస్, ఎం.రమేశ్, కె.వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. సంఘం కోశాధికారిగా డి.వీర్పాల్, సంయుక్త కార్యదర్శులుగా రామానందతీర్థ, బి.సత్యనారాయణ, స్నేహలత, ప్రవీణ, రాజ్‌కుమార్, సత్యానంద్, ప్రతిమ ఎన్నికయ్యారు. -
ఆరోపణలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం
ధర్మపురి: పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలిగానీ.. ఎల్వోసీలు ఇచ్చి ఒకరినొకరు అవమానపర్చుకోవద్దని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి అన్నా రు. మూడు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విష యం తెల్సిందే. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌కు మా జీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఎల్ఓసీ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీనిని ఖండిస్తూ సోమవారం శ్రీకాంత్‌రె డ్డి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌కు గతంలో ఆస్పత్రి ఖర్చుల కింద అప్ప టి ప్రభుత్వం ఎల్వోసీ ఇచ్చిందని, ఎల్వోసీలు, సీఎం రిలీఫ్ఫండ్లు ప్రభుత్వ నిధులని, కాంగ్రెస్వో.. మరో పార్టీవో కావన్నారు. కాంగ్రెస్ పుణ్య మా అని ఎల్వోసీ ఇచ్చామని కిందిస్థాయి నాయకులు అనడంలో అర్థం లేదని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 32 వేల మందికి రూ.87 కోట్ల వి లువైన ఎల్వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అప్పటి మంత్రి ఈశ్వర్ పంపిణీ చేశారని పేర్కొన్నారు. అప్పుడు పార్టీలకతీతంగా ఇచ్చామని పే ర్కొన్నారు. కొప్పుల ఈశర్ చేసిన అభివృద్ధి ధర్మపురిలో ఎక్కడ చూసినా కనిపిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం బురద జల్లడం మానుకోవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మె ల్యే కార్యాలయానికి ప్రతిఒక్కరూ వస్తారని, బీఆర్ఎస్ నాయకులు రావద్దని రూల్స్ ఉంటే కాంగ్రెస్ కా ర్యాలయమని బోర్డు పెట్టుకోవాలని సూచించారు. సంగి సత్తమ్మ మాట్లాడుతూ .. ఎల్వోసీ కాంగ్రెస్ పుణ్యమని అనడం బాధగా ఉందన్నారు. నాయకులు సంగి శేఖర్, మాజీ ఎంపీపీ చిట్టిబాబు, అయ్యో రి వేణు, యూనుస్, శేఖర్, అనంతుల లక్ష్మణ్ తదితరలున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
పెగడపల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగల కింద ఉన్న చెట్లను తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని నంచర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, రైతులతో కలిసి ఎడ్ల రాజేందర్‌రెడ్డి (43) చెట్లను తొలగించే పనులు చేపడుతున్నాడు. అప్పటికే ట్రాన్స్ఫార్మర్కు కరెంటు సరఫరా నిలిపివేశారు. అయితే ట్రాన్స్ఫార్మర్ పైభాగాన ఉన్న చెట్టు తీగను తొలగించేందుకు రాజేందర్‌రెడ్డి పైకి ఎక్కాడు. ఈ క్రమంలో 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటి వద్ద ఉన్న తన భర్తను గ్రామానికి చెందిన కోల రాములు అనే వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లాడని, విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపి వేయకుండానే పనులు చేయడంతో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుడి భార్య విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్సై రవీందర్‌కుమార్ తెలిపారు. ట్రాన్స్‌కో ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈ మధు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఏడీఈ తెలిపారు. -
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. ఆలయ ప్రధాన ద్వారం, వైజంక్షన్ వద్దగల స్వాగత తోరణం, ఆలయ పరిసరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వామివారి ఉత్సవమూర్తిని దీక్ష విరమణ మంటపానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల శుద్ధి పుణ్యహవచనం, అంకురార్పణ, అఖండ ద్వీపస్థాపన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్‌కుమార్, హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న హల్దీ వేడుకలు
పెళ్లి కూతురుకు దుస్తులు అందిస్తున్న ఐసీడీఎస్ బృందం రామగుండం: పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీవేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎన్టీపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలు అందజేశారు. ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభమైన మానస వివాహ వేడుకలు రేపు సుభముహూర్తం -
సబ్సిడీ పెంచి.. ధర తగ్గించాలి
రైతులు ఒక్కటి, రెండు పచ్చిరొట్ట విత్తనాల బస్తాలు వాడుతారు. పెరిగిన ధరలు గతేడాదితో పోల్చితే ప్రతి రైతుకు దాదాపు రూ.2 వేల వరకు అదనపు ఖర్చు వస్తోంది. మేం పండించే పంటకు మాత్రం విత్తనాల మాదిరిగా రేట్లు పెరగడం లేదు. ప్రభుత్వం ఆలోచించి సబ్సిడీ పెంచి, రేటు తగ్గించి రైతును ఆదుకోవాలి. – వేముల విక్రంరెడ్డి, ధర్మపురి విత్తనాలు తెప్పిస్తున్నాం జిల్లాకు అవసరమైన మేర పచ్చిరొట్ట విత్తనాలను తెప్పిస్తున్నాం. వరి ఎక్కువగా సాగు చేస్తుండటంతో, ఇతర జిల్లాలతో పోల్చితే పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సింగిల్ విండో కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని చిన్నలింగాపూర్‌లో పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య–లలిత దంపతులుకు ఇద్దరు కూతుళ్లు స్నేహాన్షి(4), శ్రీజ(2). తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో బంధువు సంవత్సరీకం ఉండగా, మరో బంధువు సోమవారం మృతిచెందారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లలిత తన ఇద్దరు పిల్లలతో చిన్నలింగాపూర్లోని తలి గారింటికి వచ్చింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కూతురు స్నేహాన్షి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లగా పాముకరిచింది. పాపను గమనించే సరికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిమానకొండూర్: మండలంలోని పచ్చునూర్ గ్రామ శివారులో సోమవారం అనుమానాస్పదంగా కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆంజనేయులు(50) అనే వ్యక్తి కొద్ది నెలల నుంచి గ్రామానికి చెందిన బత్తుల అజయ్ మేసీ్త్ర వద్ద కూలీ పనిచేస్తున్నాడు. సోమవారం గ్రామ శివారులోని ఓ వ్యక్తికి చెందిన పొలం సమీపంలో మృతదేహం కుళ్లి పోయిందని గ్రామ కారోబార్కు తెలుపగా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని సీఐ సంజీవ్ పరిశీలించారు. మృతుకి గల కారణాలు తెలియనందున అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 18 మంది అర్జీలు సమర్పించారు. ఎస్పీ వారితో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సులకు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరికోరుట్ల: ప్రైవేటు స్కూల్ బస్సులకు అన్ని రకాల ధ్రువీకరణపత్రాలు తప్పనిసరి అని జిల్లా రవాణా అధికారి భద్రు నాయక్ అన్నారు. పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం ప్రైవేట్ స్కూల్ యజమానులతో సమావేశమయ్యారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పర్మిట్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్, డ్రైవర్ లైసెన్స్, డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరిగా పేర్కొన్నారు. కోరుట్ల మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రైవేట్ స్కూల్ యజమానులు పాల్గొన్నారు. గ్రామీణులకు మెరుగైన వైద్యంజగిత్యాలరూరల్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నిరుపేదలకు వైద్యం అందించేందుకు ముక్త్ భారత్ అభియాన్ దోహదపడుతుందన్నారు. జబ్బులు గుర్తించి చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. కల్లెడ మెడికల్ ఆఫీసర్ సౌజన్య, పంచాయతీ కార్యదర్శి కిరీటి, కారోబార్ రాజిరెడ్డి, సబ్‌సెంటర్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల డీఎస్పీ బదిలీజగిత్యాలక్రైం: జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ హైదరాబాద్ ఇంటెలిజెన్సీ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న వెంకటస్వామిని నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండిజగిత్యాల: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 28 వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. సీసీ కెమెరాల నిఘా నేతృత్వంలో పరీక్షలు జరుగుతాయని, విద్యుత్, వైద్యశాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి నారాయణ, పోలీసు, విద్యుత్, వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయండి
మల్యాల: కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం 300 ఎకరాలు సేకరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాలని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కొండగట్టు అంజన్నను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముత్యంపేట శివారు వరదకాలువ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిందన్నారు. కేటాయించిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిందని, తక్షణమే ఆ నిధులు కేటాయించేలా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ చూపాలన్నారు. తాను కొండగట్టు అభివృద్ధి అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రస్తుత ఎంపీ నిధులు తీసుకురావాలని సూచించారు. రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధి చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారని తెలిపారు. అంజన్న సన్నిధిలో కొత్త కోనేరు నిర్మించి, వసతులు కల్పించామన్నారు. మాజీ జెడ్పీటీసీలు కొండపల్కల రాంమోహన్‌రావు, ప్రశాంతి కృష్ణారావు, మాజీ ఎంపీపీ ఎడిపెల్లి అశోక్, పాక్స్ చైర్మన్ బోయినపల్లి మధుసూదన్‌రావు, అయిల్నేని సాగర్ రావు పాల్గొన్నారు. ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ -
ఐసీడీఎస్‌లో ఆగని అక్రమాలు
మెట్పల్లి: మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కొందరు నిర్వాహకులు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కడుపు కొడుతున్నారు. కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని వారికి అందించకుండా బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సీడీపీఓ, సూపర్వైజర్ల పర్యవేక్షణ కొరవడడంతో చాలా కాలంగా పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పడుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు మండలాలు..312 కేంద్రాలు ● మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ మండలాలు ఉన్నాయి. ● ఈ మండలాల్లో 312 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతినెలా ప్రభుత్వం పోషకాహార వస్తువులను సరఫరా చేస్తుంది. ● వీటిని కేంద్రాల నిర్వాహకులు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా పాలు, బాలమృతం ప్యాకెట్లు ● మొత్తం సరఫరా చేస్తున్న వస్తువుల్లో ప్రధానంగా పాలు, బాలమృతం ప్యాకెట్లను నిర్వాహకులు అమ్ముకుంటున్నారు. ● అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతినెలా 2.50కిలోల బాలమృతాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ● చిన్నారులు బలంగా ఎదగడానికి ఇది దోహాదం చేస్తుంది. అయితే కొందరు ఈ ప్యాకెట్లను డెయిరీ నిర్వాహకులకు అమ్ముకుంటున్నారు. వారు వీటిని గేదెలకు దాణాగా వినియోగిస్తున్నారు. ● పట్టణంలో ఉన్న పలువురు గేదెలపెంపకందారులు వీటిని బహిరంగంగానే వినియోగిస్తున్నారు. ● అలాగే గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేకంగా అందించే హోమోజినైజ్డ్ టోన్డ్ పాలను పూజ స్టోర్లకు అమ్ముతున్నారు. తనిఖీలు.. చర్యలు శూన్యం ● కేంద్రాలను తరచూ సీడీపీఓ, సూపర్వైజర్లు తనిఖీలు చేసి పోషకాహారం సక్రమంగా పంపిణీ జరుగుతోందా..? లేదా..? అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. ● మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ.. చేతులు దులుపుకుంటున్నారు. ● ఈ కారణంగానే మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలో చాలాకాలంగా పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● పాలు, బాలామృతం ప్యాకెట్లను కొందరు అమ్ముకుంటున్న వైనంపై గతంలోనూ పలు కథనాలు వచ్చాయి. ● అయినా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● దీనివల్ల కొందరు నిర్వాహకులు ఇంకా సరుకులు పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. ● ఉన్నతాధికారులు స్పందించి మెట్పల్లి ఐసీడీఎస్ పరిధిలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్ మణెమ్మను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. పాలు, బాలామృతం పక్కదారి ఏళ్ల తరబడిగా సాగుతున్న అక్రమాలు చిన్నారులకు అందని పౌష్టికాహారంపట్టణ శివారులోని ఓ డెయిరీ ఫాం వద్ద ఇలా కనిపిస్తున్నవి బాలామృతం ప్యాకెట్లు. ఇక్కడ కూడా ఈ పోషకాహారాన్ని గేడెలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి చాలా రోజులుగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో ప్యాకెట్లను తరలిస్తున్నట్లు తెలిసింది. ‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది బాలామృతం ప్యాకెట్. మెట్‌పల్లిలోని ఓ డెయిరీ ఫాంలో ఇలా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించాల్సిన ఈ ప్యాకెట్లను డెయిరీ ఫాంలోని గేదెలకు దాణాగా వాడుతున్నారు. కొందరు టీచర్లు తమ స్వలాభం కోసం ప్యాకెట్లను ఇలా విక్రయిస్తున్నారు. -
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి
గ్రామంలోని సర్వే నంబర్ 22లో గల 6గుంటల ప్రభుత్వ స్థలంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పిల్లర్ల దశ వరకు నిర్మాణం పూర్తయింది. దానికి 3–96నంబర్ కేటాయించారు. అయితే అదే గ్రామానికి చెందిన భోగ సత్తన్న ఆ భవనాన్ని కూల్చివేసి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి, డీపీవోతో ఫిర్యాదు చేశాం. 24గంటల్లో కూల్చివేయాలని నోటీసు జారీచేసినా.. సదరు వ్యక్తి స్పందించడం లేదు. విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి. – నర్సింహులపల్లె, బీర్పూర్అక్రమ భూమార్పిడిని రద్దు చేయండి మా తాత కోల గంగారాం పేరిట రాయికల్ మండలం అల్లీపూర్ రెవెన్యూ పరిధిలో 1120(అ)గల సర్వే నంబర్లోని 1.3 ఎకరాల భూమిని దుగ్గిల్ల కొమురయ్య పేరిట అక్రమంగా మార్పిడి చేయించుకున్నాడు. ఆ భూమిపై 2016 నుంచి ఏటా పంట రుణం పొందుతున్నాం. 2023లో రుణమాఫీ కూడా పొందాం. సాక్షి సంతకం పెట్టాలంటూ మా తాత గంగారాంను తీసుకెళ్లిన రొడ్డ బక్కయ్య 2020లోనే దుగ్గిల్ల కొమురయ్య పేరిట భూమిని మార్పిడి చేయించినట్లు ఇటీవలే తెలిసింది. రికార్డులు, మోకాపై విచారణ జరిపి ఆ భూ మార్పిడిని రద్దు చేసి న్యాయం చేయండి. – కోల వంశీకుమార్, అయోధ్య, రాయికల్ -
అను‘మతి’లేని ట్రావెల్స్
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావె ల్స్, గల్ఫ్ ఏజెంట్ల పేరుతో గల్ఫ్ పంపిస్తామని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు రెండేళ్లుగా భారీగా పెరిగాయి. జిల్లాలో సుమా రు 180 ట్రావెల్స్ అనధికారికంగా నడుస్తున్నట్లు తె లుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు విదేశీల్లో ఉపాధి కల్పిస్తామంటూ గల్ఫ్ ఏ జెంట్లు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ట్రావెల్స్‌కు విమాన టికెట్లు బుకింగ్ చేసేందుకే అనుమతి ఉంటుంది. కానీ కొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి వారి పా స్పోర్టులు తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూలకు పిలి పించి వీసా వచ్చిందని నమ్మిస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్‌లో అనుమతి లేకుండా మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 18 మందికే లైసెన్స్‌లు జిల్లాలో గల్ఫ్ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం సుమారు 18 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్ ఉంది. మిగిలిన వారు అనుమతి లేకుండా ట్రావెల్స్, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగుల నుంచి వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. లైసెన్స్ లేకున్నా ఇంటర్వ్యూలు గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు లైసెన్స్ ఉన్నప్పటికీ ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులకు సమాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ కొందరు ఎలాంటి సమాచారం లేకుండానే హోటళ్లు, ఫంక్షన్‌హాల్స్, గెస్ట్‌హౌస్‌ల్లో నిర్వహిస్తున్నారు. పాస్‌పోర్టులు తీసుకుని ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. యూరప్‌లో ఉద్యోగాలు ఉన్నాయంటూ రూ.3 నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న గల్ఫ్ మోసాలు ఏజెంట్ల చేతికి చిక్కుతున్న నిరుద్యోగులు అందినకాడికి దండుకుంటున్న నిర్వాహకులు ‘రాయికల్ మండలకేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు జగిత్యాలకు చెందిన లైసెన్స్ లేని ఓ ట్రావెల్స్ నిర్వాహకులు యూరప్ దేశం పంపిస్తామని ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.5 లక్షలు వసూలు చేశారు. వారిని పంపించకుండా మూడు నెలలుగా నేడు.. రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు..’ ‘జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు గల్ఫ్ వెళ్లేందుకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.2లక్షలు ఇచ్చాడు. ఆర్నెళ్లు గడుస్తున్నా సదరు యువకుడిని పంపించడం లేదు. ఏజెంట్ ఇంటికి వెళ్లి డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు..’ ఇటీవల జగిత్యాల జంబిగద్దె ప్రాంతంలో ఓ వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా ట్రావెల్స్ పెట్టి యువతులను రిసెప్షనిస్ట్‌గా నియమించి నిరుద్యోగులకు ఫోన్‌కాల్స్ చేయిస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వారిని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ వెళ్తారా..? అని అడుగగా సదరు ఎమ్మెల్యే ఎవరికి ఫోన్ చేశావని అడగడంతో కంగుతిన్న రిసెప్షనిస్ట్ ఫోన్ పెట్టేసింది. ఆ ఎమ్మెల్యే విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ నకిలీ ట్రావెల్స్ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
గోడు వినండి.. పరిష్కారం చూపండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 43 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జివాకర్, శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. రశీదు కోసం ఎదురుచూపులు ప్రజావాణికి వచ్చిన వారికి రశీదు ఇచ్చేందుకు అధికారులు గంటల తరబడి గడువు పెడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండడం ఇబ్బందిగా మారిందని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఆలస్యంగా రశీదు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. -
యూనిఫాం.. ఉపాధి
● మహిళా సంఘాల చేతికి కుట్టు పని ● జిల్లాలో 667 స్కూళ్లు.. 47,963 మంది విద్యార్థులు ● ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు ● 1,144 మంది మహిళా సభ్యులకు లబ్ధి జగిత్యాలరూరల్: మహిళా సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వారికి నిత్యం పని ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా అందిచే యూనిఫాంల కుట్టు పనిని మహిళ సంఘాలకు అప్పగించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను ఇప్పటికే సేకరించారు. వారి సంఖ్యకు అనుగుణంగా ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టి ఇచ్చే బాధ్యతను తీసుకున్నారు. 667 పాఠశాలలు.. 47,963 మంది విద్యార్థులు జిల్లాలో 667 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 47,963 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రెండు జతల దుస్తుల చొప్పున మహిళా సంఘం సభ్యులు కుడుతున్నారు. గతంలో కొలతలు లేకుండా కుట్టడంతో విద్యార్థులకు సరిపోయేవి కావు. కానీ ప్రస్తుతం విద్యార్థుల కొలతలు తీసుకుని ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు కుడుతున్నారు. రెండు జతల దుస్తులు కుడితే మహిళలకు రూ.75 చొప్పున చెల్లించనున్నారు. అంగన్వాడీ పిల్లలకు రూ.80, వసతి గృహ విద్యార్థులకు రూ.80 నుంచి రూ.100 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1144 మంది మహిళలకు ఉపాధి జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1144 మంది మహిళలు దుస్తులు కుట్టేలా శిక్షణ పొందారు. వారు ప్రస్తుతం పాఠశాలల వారీగా విద్యార్థులకు దుస్తులు కుట్టడంలో నిమగ్నమయ్యారు. వీరు ప్రతిరోజు సుమారు 4,121 డ్రెస్‌లు కుట్టే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రారంభం నాటికి ప్రతి వి ద్యా ర్థికి యూనిఫాం అందేలా చర్యలు చేపడుతున్నారు. జూన్ వరకు దుస్తులు జిల్లాలో మహిళా సంఘాల సభ్యులతో విద్యార్థులకు యూ నిఫాంలు కుట్టిస్తున్నాం. ప్రతి విద్యార్థికి రెండు జతల యూని ఫాంలను కుట్టిచ్చి.. జూన్ మొ దటి వారంలో అందించేలా ని ర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం మహిళాసంఘ సభ్యులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. – రఘువరణ్, డీఆర్డీఏ పీడీ జిల్లాలో మండల సమైక్యలు 18 గ్రామ సమైక్యలు 565 స్వశక్తి సంఘాలు 14,957 మహిళా సంఘాల్లో సభ్యులు 1,72,801 -
‘అందాలభామలకు తులాలకొద్దీ బంగారమా..’
● ఇక్కడి ఆడబిడ్డలకు ఎందుకివ్వడం లేదు.. ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాలటౌన్: తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చేందుకు తులం బంగారం లేదుగానీ.. సుందరీమణులకు మాత్రం 30 తులాల చొప్పున ఇస్తానని సీఎం ప్రకటించడమేంటని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. మహిళలతో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ఆడబిడ్డలపై లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లి కానుక కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చి చేతులెత్తేశారని విమర్శించారు. రాష్ట్రం అప్పుల పాలయిందంటూనే అందాల పోటీలకు మాత్రం రూ.200కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి ఎవరి మెప్పు కోసం అందాల భామలకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తున్నారని నిలదీశారు. సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదాకోరుట్ల: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20న నిర్వహించాల్సిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేసినట్టు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూసీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, చింతా భూమేశ్వర్, ఎండీ.చౌదరి తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని సీ.ప్రభాకర్ భవన్లో ఆదివారంకార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. పహల్గాంలో 26 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపిన తర్వాత దేశ రాజకీయ పరిణామాలు, సైనికుల పోరాట చర్యల కారణంగా సమ్మె వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మిక సంఘాల నేతలు రామిల్ల రాంబాబు, దేశవేణి నర్సయ్య, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం కథలాపూర్: మండల కేంద్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం వేంకటేశ్వర స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం
మేం అన్నాచెల్లెళ్లం. బీటెక్, ఎంసీఏ పూర్తి చేశాం. వ్యవసాయంపై ఇష్టంతో రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నాం. మంచి దిగుబడులు సాధిస్తున్నాం. రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు పండించి వాటిని ఆహారంగా వాడుకుంటున్నాం. – గుర్రాల శశికుమార్, సాహితీ ఖర్చు లేని పద్ధతులతో లాభం ఖర్చు లేని సాగు పద్ధతులను ఇప్పటికే ఆచరిస్తున్నాం. మరిన్ని పద్ధతులను తెలుసుకునేందుకు శిక్షణకు వచ్చాను. ఘనామృతం, జీవామృతం తయారీ, ఉపయోగించే విధానం వివరించారు. ఆవు మూత్రం, పేడతో తయారు చేసే పద్ధతులు తెలిపారు. – బద్దం రాహుల్, ఇబ్రహీంపట్నం శిక్షణ ఉపయోగంగా ఉంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఇచ్చిన శిక్షణ ఉపయోగకరంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది రైతులు హాజరయ్యారు. ఇటీవలి కాలంలో సాగు ఖర్చులు పెరుగుతున్నందున ఎలా తగ్గించుకోవాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. – పాత రమేశ్, తుంగూర్, సారంగాపూర్(మం) -
రసాయనాలతో సాగు భూములు నిర్జీవం
● పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ● హాజరైన వివిధ ప్రాంతాల రైతులు జగిత్యాలఅగ్రికల్చర్: హరిత విప్లవం ద్వారా పంట ఉత్పత్తి లక్ష్యాలు సాధించినప్పటికీ.. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు మందులతో సాగు భూములు నిర్జీవం అవుతున్నాయని దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ శిక్షణ నిపుణులు బసంపల్లి నాగరాజు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి సురభి గోశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆదివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనాలతో భూములు తమ సహజత్వాన్ని కోల్పోయి పంటల దిగుబడి తగ్గిపోతోందని తెలిపారు. పురుగుమందుల పిచికారీతో వాతావరణ కాలుష్యంతో మనిషి మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకర ఉత్పత్తులను సమాజానికి అందించేందుకే రైతులు గోఆధారిత, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. రసాయనాలతో రైతులు పండించిన పంట ఉత్పత్తులను తినేందుకు ప్రజలు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఆవుమూత్రం, పేడతో ఘనామృతం, జీవామృతం, నీమాస్త్రం తయారు చేసి పంటలకు పోషకాలు అందిస్తూనే.. మరోవైపు పురుగులు, తెగుళ్లను అరికట్టవచ్చని తెలిపారు. మురళీధర గోదాం వ్యవస్థాపకుడు చెన్నమనేని పద్మ మాట్లాడుతూ.. గోఆధారిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యంగా ఉండడంతోపాటు మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుందని వెల్లడించారు. గోఆధారిత ఉత్పత్తులు వాడేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గోఆధారిత ఉత్పత్తుల తయారీతో స్వయం ఉపాధి పొందవచ్చని, ఇందుకోసం శిక్షణ కూడా ఇస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ఉందన్నారు. ఆవుమూత్రం, పేడతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారు. గోశాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారి కమలాకర్‌రావు, గ్రామ భారతి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ శిబిరాలతో విద్యార్థులకు మేలు
● ముగిసిన శిబిరాలు ● ఇబ్రహీంపట్నంలో 120 మంది విద్యార్థులకు శిక్షణఇబ్రహీంపట్నం : వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో ఆటలు ఆడకుండా బావులు, చెరువుల, కాలువల వైపు వెళ్లకుండా ప్రభుత్వం 6 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాలను ఈ నెల 2 నుంచి 17 వరకు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నైపుణ్యం గల ఉపాధ్యాయులతో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు నోట్‌బుక్కులు, పెన్నులు అందించారు. శిక్షణలో యోగా, మెడిటేషన్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్, చేతి రాతలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, సులభంగా లెక్కలు చేసేందుకు షార్ట్‌కట్ మ్యాథ్స్‌ను నేర్పించారు. విద్యార్థులు శిక్షణ పొందడం వలన మేథాశక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడడం, మ్యాథ్స్‌లో షార్ట్‌కట్ పద్ధతులు, సైన్స్‌లో మెలకువలు, మెంటల్ ఎబిలిటీ నేర్చుకున్నట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు ఉపయోగకరంగా శిక్షణ నైపుణ్యం గల ఉపాధ్యాయులతో శిక్షణనిచ్చాం. విద్యార్థులలో మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ వేసవి కాలంలో కొత్తగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాలకు విద్యార్థుల తల్లిదండ్రులు శిక్షణకు పంపిస్తే వివిధ రకాల శిక్షణలు పొంది విద్యార్థుల్లో మంచి విద్యతో పాటు మేథాశక్తి కూడా పెరుగుతుంది. – మధు, ఎంఈవో, ఇబ్రహీంపట్నం -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాలవర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ కేంద్రంలోకి భారీ వరద చేరడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. సారంగాపూర్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా సారంగాపూర్: సారంగాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, ధాన్యంబస్తాలు తడిసిపోయాయి. మండల కేంద్రంతోపాటు, పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. శనివారం వేకువజాము మూడు గంటల ప్రాంతంలో విద్యుత్‌ను పునరుద్ధరించారు. -
జీవన విధానంలో మార్పు అవసరం
జగిత్యాల: సరైన ఆహార నియమాలు పాటిస్తూ.. జీవనశైలిలో మార్పు వస్తేనే రక్తపోటు అదుపులో ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఐఎంఏ హాల్లో ఐఎంఏ ఉచిత వైద్య పరీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తం ప్రతి అవయవ పనితీరుకు కీలకభూమిక పోషిస్తుందని, రక్తపోటు నియంత్రణతోనే అవయవాల పనితీరు మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం వాకింగ్, ఎక్సర్సైజ్లు చేపట్టాలని పేర్కొన్నారు. రక్తపోటు ఉన్నవారిలో చూపు మందగిస్తుందన్నారు. ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తుందన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలన్నారు. అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి అర్చన మాట్లాడుతూ.. మందులను నిర్దేశించిన సమయాల్లో ప్రతిరోజు వాడటం చాలా ముఖ్యమన్నారు. అనంతరం పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుదీర్‌కుమార్ పాల్గొన్నారు. -
22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం
వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా అంటూ ఉమ్మడి జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవం తేదీ ఖరారైంది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రెండు రైల్వేస్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రామగుండం, కరీంనగర్, పెద్దపల్లి రైల్వేస్టేషన్లకు అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ పథకం కింద రూ.73 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటిఫేజ్‌లో కరీంనగర్‌కు రూ.26.06 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు విడుదలయ్యాయి. రెండో ఫేజ్‌లో పెద్దపల్లి ఎంపికకాగా రూ.20 కోట్లు మంజూరయ్యాయి. కరీంనగర్ రైల్వేస్టేషన్లో ఏర్పాట్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పరిశీలించనున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తడిసిన సర్టిఫికెట్లుజగిత్యాలరూరల్: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో పలు సర్టిఫికెట్లు, దరఖాస్తులు తడిసిపోయాయి. ఇటీవల కాలంలో విద్యార్థులు కుల ధ్రువీకరణ, ఆదాయం, ఈబీసీ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కార్యాలయం ఉద్యోగులు తీసుకున్న దరఖాస్తులను నిర్లక్ష్యంగా కిటికీ వద్ద వదిలేయడంతో వర్షం కురిసి కిటికిలోంచి నీరు వెళ్లి దరఖాస్తు ఫారాలన్నీ తడిసిపోయాయి. శనివారం ఉదయం కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగులు వాటిని ఆరబెట్టారు. దరఖాస్తు చేసుకున్న వారంతా తడిసిపోయిన సర్టిఫికెట్లను చూసి ఆందోళనకు గురయ్యారు. సాఫ్ట్‌బాల్ పోటీలకు గోవిందారం విద్యార్థులుమేడిపల్లి: భీమారం మండలం గోవిందారం ఉన్నత పాఠశాలకు చెందిన పిట్టల నవదీప్, పొన్నం రిశ్వంత్, గంగానవేణి సంతోష్, కొప్పుల రామ్‌చరణ్, చెల్ల నగేష్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు. వీరు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయా మ ఉపాధ్యాయుడు ప్రశాంత్ తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం అస్ఫాక్ హుస్సేన్, ఉపాధ్యాయ బృందం అభినందించింది. బంగారు చైన్ అప్పగింత కథలాపూర్: కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన లోక స్వప్నకు ఓ బంగారు చైన్ దొరకగా.. పోగొట్టుకున్న వ్యక్తికి పోలీసుల సమక్షంలో అప్పగించి నిజాయితీ చాటుకుంది. ఈనెల 12న మండలంలోని దుంపేటలో శ్రీలక్ష్మినృసింహస్వామి జాతర ఉత్సవాలు జరిగాయి. కోరుట్లకు చెందిన మహిళ బంగారు చైన్ పోగొట్టుకుంది. ఆ చైన్ చింతకుంటకు చెందిన లోక స్వప్నకు దొరక గా వీడీసీ సభ్యులకు తెలిపింది. చైన్ పోగొ ట్టుకున్న వ్యక్తిది కోరుట్లగా గుర్తించి అతడికి సమాచారం అందించారు. శనివారం పోలీసుల సమక్షంలో చైన్‌ను అప్పగించారు. స్వప్నను వీడీసీ సభ్యులు సన్మానించారు. దరఖాస్తులు ఆహ్వానంజగిత్యాల: 2024–25 సంవత్సరానికి గాను బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ రెసిడెన్షియల్స్, నా న్ రెసిడెన్షియల్స్ పథకంలో భాగంగా ఉత్త మ పాఠశాలల ఎంపికకు జిల్లాలోని ప్రైవే టు, ఆంగ్ల మాధ్యమ స్కూళ్ల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, భోజన వసతి, రెండు జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ అందిస్తారని, ప్రతి విద్యార్థికి రూ.42వేల చొప్పున చెల్లిస్తామని తెలిపారు. దరఖాస్తులను పూర్తి చేసి 31లో పు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. -
ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలు
జగిత్యాల: జిల్లాలో బోరు బావుల తవ్వకాలు ఇష్టానుసారంగా పెరిగిపోతున్నాయి. అనుమతి లేకుండానే ఎవరికి వారు ఇష్టానుసారంగా తవ్వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. బోర్ల తవ్వకాలతో భూగర్భజలాలపై ప్రభావం చూపుతోంది. గృహ అవసరాలు, వ్యవసాయానికి ఇష్టానుసారంగా బోర్లు తవ్వుతున్నారు. వ్యవసాయానికి అయినా.. గృహాల కోసమైనా అనుమతి తప్పనిసరి. కాని కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 50కు పైగానే బోర్లు వేయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో అయితే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.● బోరుబావులు తవ్వాలంటే వాల్టా చట్టం ప్రకారం ముందస్తుగా రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.● పంటల సాగుకు అయితే అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అనుమతి జారీ చేస్తారు.● ఒక బోరు బావి వద్ద కనీసం 100 మీటర్ల దూరం ఉండాలన్న నిబంధన ఉంది.● ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎక్కడబడితే అక్కడ బోర్లు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.● గృహ అవసరాలకు వేసుకుంటే గతంలో కొన్ని నిబంధనలు ఉండేవి. వాటిలో నిబంధనలు సడలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.● ఆధారం● వాస్తవానికి జగిత్యాలలో నీటి వనరులు అధికం. ఎస్సారెస్పీ కాలువ ద్వారా పొలాలకు నీరు చేరుతుంది.● అయితే కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ బావులు తవ్వుతున్నారు.● మరికొందరు బోర్లు వేస్తున్నారు. బోర్ల తవ్వకం మొదలయ్యాక పంటల సాగు విస్తీర్ణం అధికం కావడం.. నీటి వినియోగం పెరుగుతోంది.పాటించని నీటి పొదుపుప్రతి ఒక్కరూ నీటి పొదుపునకు చర్యలు పాటించాల్సి ఉండగా ఎక్కడా మచ్చుకు కన్పించడం లేదు.● రైతులు ఎక్కువగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.● నీటి నిలువ ఉండటానికి కందకాలు, చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి.● ఇవి ఎక్కడా మచ్చుకై నా కన్పించడం లేదు.● వ్యవసాయ క్షేత్రాల వద్ద నీటి కుంటలను ఏర్పాటు చేస్తే వృథా కాకుండా ఉంటుంది.పరిశీలన ఎక్కడ? వాల్టా చట్టం ప్రకారం బోరు బావుల కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్న అనంతరం జియాలజిస్ట్‌లు నీటి లభ్యతను పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.ఆ తర్వాతే బోరు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడబడితే అక్కడ బోర్లు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.బోర్లు వేసేవారు కచ్చితంగా ఆర్టీఏ ఆఫీసుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.జిల్లాలో ప్రస్తుతం 17 వరకు వాహనాలకు అనుమతి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.ఒక వేళ అనుమతి లేకుంటే అధికారులు రూ.లక్ష జరిమానా వేసే అవకాశం ఉంది.అనుమతి తప్పనిసరిబోరుబావులు తవ్వుకునే వారు తప్పనిసరిగా అనుమతులు పొందాలి. అలాగే బోరు వాహనాల నిర్వాహకులకు రిజిస్ట్రేషన్ ఉండాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా బోర్లు వేస్తే ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం. బోరు బావి కోసం దరఖాస్తు చేసుకుంటే నీటి పరిస్థితిని పరిశీలించి అనుమతి ఇస్తాం.– జి.నాగరాజు, భూగర్భజల వనరుల శాఖ అధికారి -
బదిలీలు, పదోన్నతులు చేపట్టండి
జగిత్యాల: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నందున విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, రాజు, వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. మంత్రికి వినతిపత్రం అందింశారు. పెండింగ్ డీఏలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించేలా చూడాలన్నారు. కృష్ణారెడ్డి, విజయ్, యాకూబ్, అశోక్‌రావు పాల్గొన్నారు. ‘డబుల్’ ఇళ్లలో వసతులు కల్పించాలి నూకపల్లిలోగల డబుల్బెడ్రూం ఇళ్లలో వసతులు కల్పించాలని లబ్ధిదారులు మంత్రిని కలిసి విన్నవించారు. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం ఉందని, మిగిలిపోయిన కొన్ని పనులకు నిధులు కేటాయించాలని కోరారు. -
సాగుపై ప్రయోగాత్మకంగా పరిశీలన
జమ్మికుంట: నాబార్డు ఆర్థిక సాయంతో దుక్కి దున్నకుండా పంటల సాగుపై ప్రయోగాత్మకంగా పరిశీలన జరుగుతుందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ కరీంనగర్ డీడీఎం జయప్రకాశ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేవీకేలో నాబార్డు ఆర్థిక సహకారంతో దుక్కి దున్నకుండా పంటల సాగు, సుగుణ పునరుత్పాదక పద్ధతి ప్రాజెక్టును ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా 3 మండలాల్లోని 16 గ్రామాల్లో 25 మంది రైతులతో 25 ఎకరాల వ్యవసాయ కేత్రంలో దుక్కి దున్నకుండా పంటల సాగు జరుగుతుందన్నారు. నూతన సాంకేతిక పద్ధతులకు నాబార్డు ముందుండి ఆర్థిక సాయం చేసి ప్రోత్సహిస్తుందని అన్నారు. సుగుణ పునరుత్పాదక పద్ధతితో నేల రక్షణతోపాటు రసాయన ఎరువుల వాడకం తగ్గించొచ్చన్నారు. జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, జిల్లా లీడ్ మేనేజర్ ఆంజనేయులు, సుగుణ పునరుత్పాదక పద్ధతి రూపకర్త చంద్రశేఖర్, సీనియర్ కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అనుంబంధ రంగాల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
విచారణ ఏమైనట్టు..?
● వైద్య విధాన పరిషత్ కుంభకోణం నిధులు రికవరీ అయ్యేనా ● ఏడాదిగా ముందుకు సాగని విచారణ ● బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదంటున్న ఉద్యోగులుజగిత్యాల: జిల్లా వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలోని నిధులను ఆ శాఖ లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు మాయం చేయగా వారిని సస్పెండ్ చేశారు. ఉద్యోగులకు డీ ఏ, ఏరియర్స్, సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన నగ దు ప్రతి ఆరునెలలకోసారి లెక్క చూసి వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. కాగా, వై ద్య విధాన పరిషత్‌లో అకౌంట్స్ విభాగంలో పనిచేసే కొందరు ఉద్యోగులు జీపీఎఫ్ ఖాతాలో జమచేసే నిధులు పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ‘సాక్షి’లో గతేడాది జూన్ 16న ‘జీపీఎఫ్ నిధులు మాయం’ శీర్షికన కథనం ప్ర చురి తమైంది. దీంతో స్పందించిన అధికారులు దాదాపు రూ.5 కోట్ల వరకు కుంభకోణం జరిగినట్లు వెల్లడించారు. గతేడాది కుంభకోణం జరుగగా, ఇప్పటికీ విచారణ కొనసాగుతుందే తప్ప ముందుకు వెళ్లడం లేదు. రికవరీ పేరిట జాప్యం.. ● వైద్య విధాన పరిషత్‌లో కుంభకోణంపై బాధ్యులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని డబ్బులు పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● దాదాపు రూ.5 కోట్ల నిధులు గోల్మాల్ అయినట్లు గుర్తించగా, రూ.2 కోట్లు రికవరీ చేసినట్లు తెలిసింది. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● అవినీతిని కప్పిపుచ్చేందుకు రికవరీ పేరుతో కాలం వెళ్లదీస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ● ఉద్యోగులకు సంబంధించిన సీపీఎఫ్, జీపీఎఫ్ మాయం చేసినా పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ● ఈ కుంభకోణానికి పాల్పడ్డ అధికారులపై సస్పెండ్ వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడంతో ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ● విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. గతంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం ఓ వారం రోజులు హడావుడి చేశారే తప్ప మళ్లీ ఎక్కడికక్కడే నిమ్మకుండిపోయారు. ● ఇంత పెద్ద స్కాం జరిగినా ప్రధాన సూత్రధారి ఎవరనేది ఇంతవరకు తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, డీఏలకు సంబంధించి చెక్కులు, ఓచర్లు మాయం అయినా పూర్తిస్థాయిలో విచారణ ఎందుకు చేపట్టడం లేదో తెలియడం లేదు. విచారణ అధికారులెవరో? గతంలో బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్‌ను వైద్య విధాన పరిషత్‌లో జరిగిన కుంభకోణానికి సంబంధించి విచారణ అధికారిగా నియమించారు. కానీ, ఎవరు అధికారిగా ఉన్నారన్న విషయం తెలియకుండా ఉంది. గతంలో అతను వచ్చి జగిత్యాల మాతాశిశు సంక్షేమ కేంద్రంలోని డీసీహెచ్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఎంత కుంభకోణం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు గత నాలుగేళ్లకు సంబంధించిన ఓచర్ల వెరిఫికేషన్, రికార్డులన్నింటినీ పరిశీలించారు.మూడు రోజుల్లో నివేదిక వైద్య విధాన పరిషత్ కుంభకోణానికి సంబంధించి కొంత మేర డబ్బు రికవరీ అయింది. ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. 2–3 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక వస్తుంది. ఎన్ని నిధులు రికవరీ అయ్యాయో తెలుస్తుంది. విచారణలో జాప్యం ఏమీ లేదు.– రామకృష్ణ, డీసీహెచ్ -
మట్టిలారీలను అడ్డుకున్న గ్రామస్తులు
● నలుగురిపై కేసు నమోదు ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ అప్పమాయ చెరువు నుంచి నల్లమట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. కొలనూర్ గ్రామానికి చెందిన జక్కుల మధు, రేగుల తిరుపతి, సాత్తూరి అనిల్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో లారీలకు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ అనుమతి ఇచ్చినా.. నిబంధనలు అతిక్రమించి 25 టైర్ల లారీల్లో నల్లమట్టి తరలిస్తున్నారని వారు ఆరోపించారు. సుమారు ఐదు గంటలపాటు లారీలను ఆపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఓదెల తహసీల్దార్ సునీత సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత మట్టితరలింపు యథావిధిగా కొనసాగింది. కాగా, కలెక్టర్ అనుమతితో మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకొన్న జక్కుల మధు, మద్దెల శ్రీనివాస్, సాత్తూరి అనిల్, రేగుల తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. -
మంజూరు చేస్తారో.. లేదో..!
మల్లాపూర్/పెగడపల్లి: పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందని ద్రాక్షలా మారనుంది. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశావహులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే జాబితాల్లో చాలా చోట్ల అర్హుల పేర్లు లేవని ఆందోళన మొదలైంది. అలాగే కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకుంటుండడంతో తమకు ఇళ్లు మంజూరు చేస్తారో లేదోనని ఆవేదన చెందుతున్నారు. పార్టీలకతీతంగా ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పెరిగిన నాయకుల జోక్యం..? ● ఇళ్ల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న కాంగ్రెస్ నాయకులు కలిసి జాబితా తయారు చేసి అధికారులకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇళ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకుల జోక్యం పెరిగిపోయిందని, దీంతో నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేస్తారా? లేదా కాంగ్రెస్ నాయకులకే కేటాయిస్తారా? అనే అనుమానం ప్రజల్లో నాటుకుపోయింది. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు మంజూరవుతాయని, అర్హులు ఆందోళన చెందవద్దని పేర్కొంటున్నారు. ● ధర్మపురి నియోజవర్గంలోని ప్రతి మండలానికి 400–500 ఇళ్లు మంజూరు కానున్నాయి. మండలవ్యాప్తంగా స్థలం ఉండి ఇళు్ల్ కావాలని 4,486 మంది, స్థలంతో పాటు ఇళ్లు అవసరమున్నవారు 1642 మంది దరఖాస్తు చేసుకున్నారు. మండలంలోని ల్యాగలమర్రిని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి 87 ఇళ్లు మంజూరు చేశారు. ● మల్లాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలకు మొత్తం 725 మంది జాబితా విడుదల చేసి సర్వే చేశారు. మండల వ్యాప్తంగా 11,649 దరఖాస్తులు వచ్చాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద కొత్తదాంరాజుపల్లి గ్రామాన్ని ఎంపిక చేయగా, ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 427 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 45 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో ఇప్పటి వరకు 15 మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. వేలల్లో దరఖాస్తులు.. వందల్లో సర్వే ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై అర్జీదారుల్లో ఆందోళన ‘ఈ ఫొటోలోని వృద్ధ దంపతులు బట్టు భూమక్క–శంకర్. ఊరు మల్లాపూర్ మండలం రాఘవపేట. గ్రామంలో చిన్న గుడిసెలో నివాసముంటారు. అది వర్షానికి, ఈదురుగాలులకు ఎప్పుడూ కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్వే జాబితాలో వీరి పేరు లేకపోవడంతో తమకు ఇల్లు మంజూరు చేస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. తమ గోడు చూసైనా.. సర్కార్ గూడు కల్పించాలని వేడుకుంటున్నారు’. -
పాఠశాలల ప్రారంభం నాటికి దుస్తులు అందించాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థికి మహిళా సంఘ సభ్యులు నాణ్యమైన ఏకరూప దుస్తులు కొలతల ప్రకారం కుట్టాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకుడు దుర్గప్రసాద్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లోని మదర్‌థెరిస్సా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులు కుడుతున్న ఏకరూప దుస్తుల యూనిట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు, దుస్తులు తయారీ గురించి తెలుసుకున్నారు. సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు దుస్తులు అందించాలన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ, జిల్లాలో 667 పాఠశాలల్లో 47,963 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు కుట్టించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ మహేశ్, ఏపీఎం గంగాధర్, సీసీ విద్యాసాగర్, వీవోఏ బాలె విజయ, మండల సమైక్య అధ్యక్షురాలు గంగభవాని, యూనిట్ సభ్యులు పులి సంగీత, సుద్దాల జ్యోతి, నవ్య పాల్గొన్నారు. -
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అవగాహన సదస్సును శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నిర్వహించారు. ఈసందర్భంగా సదస్సుకు హాజరైన రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రణాళికతో మెరుగైన బోధన అందించాలి ● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో శుక్రవారం జెడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖలో ఒకేరోజు మార్పు సాధ్యం కాదని, నిర్వీరామంగా ప్రయత్నం చేస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు నిరుపేద రైతులు, కూలీలు, బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు చెందిన పిల్ల లు వస్తారని, వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్య, నైపుణ్యం అందించగలిగితే సూపర్‌పవర్‌గా ఎదుగుతామన్నారు. కార్యక్రమంలో డీఈవో రాము, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. డెంగీ నియంత్రణపై అవగాహన కల్పించాలిమల్యాల(చొప్పదండి): డెంగీ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డెంగీ నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా మట్టి తరలిస్తే చర్యలు జగిత్యాలరూరల్: అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల నుంచి మట్టి తరలిస్తే చర్యలు తప్పవని జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 437లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తీస్తున్న ప్రొక్లెయిన్‌ను శుక్రవారం సీజ్ చేసి జగిత్యాల ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా మట్టి తీస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని గుర్తించలేదు
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. మా గ్రామంలో వందలాది దరఖాస్తులు వచ్చాయి. కేవలం 35మందిని ఎంపిక చేిసి సర్వే కూడా పూర్తి చేశారు. మాకు సొంతిల్లు లేదు. అయినా మమ్మల్ని గుర్తించలేదు. – శ్రీరాముల శ్రీవాణి, దరఖాస్తుదారు, రాఘవపేట పారదర్శకంగా ఎంపిక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా మండలానికి 725 ఇళ్లు కేటాయించారు. వీటిని అన్నిగ్రామాలకు సర్దుబాటు చేసి పారదర్శకంగా సర్వే చేసి ఇళ్లు కేటాయించాం. ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కొత్తదాంరాజుపల్లిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. – శశికుమార్‌రెడ్డి, ఎంపీడీవో, మల్లాపూర్ అనర్హులను ఎంపిక చేయొద్దు ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అనర్హులను ఎంపిక చేయొద్ద్దనిఅధికారులను ఆదేశించాం. ఎక్కడైనా అర్హత ఉండి ఇల్లు మంజూరు కాకుంటే నా దృష్టికి తేవాలి. పార్టీలకతీతంగా పేదలకు ఇళ్లు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యం. – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రభుత్వ విప్ -
అప్పుల బాధతో ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): అప్పులు తీర్చే మార్గం లేక జీవి తంపై విరక్తితో ము గ్గురు పిల్లల తండ్రి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. జవారిపేటకు చెందిన మెరుగు సంతోష్‌గౌడ్(38) తనకున్న మినీవ్యాన్తో పత్తి వ్యా పారం, ఇతరత్ర పనులు చేస్తుండేవాడు. ఇటీవల కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటి నిర్మాణా నికి తీసుకున్న రుణం, ఇతరత్ర అప్పులు కలిసి రూ.30లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చేమార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో శుక్రవారం తని మినీ వ్యాన్‌లో గాలి పల్లి శివారులోని పెద్దమ్మ ఆలయ సమీపం వర కు వెళ్లి క్రిమిసంహారకమందు తాగాడు. అపస్మారక స్థితికి వెళ్లిన సంతోష్‌గౌడ్‌ను గమనించిన స్థా నికులు 108కి సమాచారం ఇవ్వగా.. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వివాహిత ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు తాళలే క ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కడారి బాలమణి(42) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలమణి దంపతులు కుటుంబ పోషణకు అప్పులు చేశారు. అప్పులు తీరే మార్గం లేక మనస్తాపానికి గురైన బాలమణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఒకరిపై ఒకరు ఉపాధ్యాయుల దాడి
● నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఎంఈవోకు గాయం ధర్మపురి: విద్యార్థులకు వి ద్యాబుద్ధులు నేర్పించాల్సి న ఉపాధ్యాయుడు విద్యార్థులందరూ చూస్తుండగా మరో ఉపాధ్యాయుడిపై దాడి చేయగా ఇద్దరికి నచ్చ జెప్పడానికి వచ్చిన మండ ల విద్యాధికారి చేతికి గాయమైన ఘటన దోనూ ర్ ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపింది. పోలీ సులు, బాధిత ఉపాధ్యాయుడు తెలిపిన వివరాలు.. దోనూర్లో జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలున్నాయి. జెడ్పీహెచ్ఎస్లో శుక్రవా రం నిర్వహించిన పీటీఏ సమావేశానికి మండల విద్యాధికారి సీతామహాలక్ష్మి ముఖ్య అథితిగా, రెండు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు. స మావేశంలో రానున్న రోజుల్లో పాఠశాలల బలో పేతం, నాణ్యమైన విద్యాబోధన కోసం తీసుకో వాల్సిన జాగ్రత్తలు వివరించారు. సమావేశం అ నంతరం పాఠశాల ఆవరణలో కొందరు ఉపాధ్యాయులు మాట్లాడుకుంటుండగా, జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు గాడిపెల్లి మహే శ్ ఎంపీపీఎస్‌కు చెందిన కాశెట్టి రమేశ్‌పై దాడి చేశాడు. అక్కడే ఎంఈవో సీతామహాలక్ష్మి ఇరువురికి నచ్చజెప్పడానికి ప్రయత్నించగా ఆమెను మహేశ్ నెట్టేయడంతో చేతికి గాయమైంది. అంతే కాకండా అసభ్య పదజాలంతో దూషించాడు. కాగా, మహేశ్‌పై గతంలో అనేక ఆరోపణలున్నాయని, అతడి తీరుపై జిల్లా విద్యాశాఖకు తెలిపినట్లు ఎంఈవో పేర్కొన్నారు. పాత కక్షలను మ నసులో పెట్టుకొని రమేశ్‌పై మహేశ్ దాడికి పా ల్పడినట్లు పేర్కొన్నారు. ఎంఈవో, బాధిత ఉపాధ్యాయుడి ఫిర్యాదు మహేశ్‌పై కేసు నమోదు చేశారు అలాగే మహేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాము ఉత్తర్వులు జారీ చేశారు. -
ముఖ్యమంత్రిపై అసత్య ప్రచారం మానుకోవాలి
● విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురి: కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హితవు పలికారు. శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అగౌరవపరిచిందని, మళ్లికార్జున ఖర్గే పేరుకే అధ్యక్షుడని, ఆయనకు అధికారం లేదని కాంగ్రెస్‌పై కొప్పుల తన అక్కసు వెల్లబోస్తూ మాట్లాడడం సరికాదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి చేవేళ్ల వరకు వెళ్లే భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెడితే ఆ పేరును తొలగించి మేడిగడ్డ అని పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. శ్రీమీడియా సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నీ చేయి పట్టుకొని పక్కకు నెట్టేసినప్పటికీ దానిపై స్పందించకపోవడం సిగ్గుచేటని, ఇన్ని అవమానాలతో బతుకుతున్న నీకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదుశ్రీ అని అన్నారు. పదేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని, 15 నెలల కాలంలో తాను చేపడుతున్న అభివృద్ధిపై ప్రజల ముందుకు వెళ్దామని సవాల్ విసిరారు. సమావేశంలో నాయకులు ఎస్.దినేశ్, వేములు రాజు, చిలుముల లక్ష్మణ్, సీపతి సత్యనారాయణ, సుముఖ్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
● బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● వేములవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వేములవాడ: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు. రుద్రంగిలో శుక్రవారం జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వేములవాడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రవాణా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలన్నారు. ఏఎంసీ వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
హాయ్.. అయాం పూజ అంటూ..
కొత్తపల్లి(కరీంనగర్): ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డా రు. మహిళల పేరిట యువకులతో చాటింగ్ చేస్తూ కోరికలు తీరుస్తామంటూ ఎరవేస్తున్నారు. ఈ ఓ వ్యక్తిని మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కరీంనగర్ కొత్తపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ ముఠాలోని ఇద్దరు యువకులను శుక్రవారం పోలీ సులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంట శాంతినగర్‌కు చెందిన సరళ సందీప్ (19), మల్కాపూర్ లక్ష్మిపూర్‌కు చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్(18), ఎండీ రెహాన్ జల్సాలకు అలవాటు పడి, దోపిడీలకు కొత్తరకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కోరిక తీరుస్తామంటూ వాట్సాప్‌లో యువకులకు మెసేజ్ చేస్తారు. ఆకర్షితులైన యువకులను చాటింగ్‌తో మభ్యపెడతారు. సరళ సందీప్ ఈనెల 6న తన ఫోన్ ద్వా రా మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వాట్సా ప్ లో హాయ్ అయాం పూజ అంటూ మెసేజ్ చేశాడు. దీంతో యు వకుడు చాటింగ్ ప్రారంభించాడు. కోరిక తీరుస్తానంటూ ఆశ చూపడంతో అదినమ్మి ఈనెల 11న కరీంనగర్ వచ్చాడు. పథకం ప్రకారం దోపిడీ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు.. కొత్తపల్లికి రప్పించారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఆ యువకుడిని వెలిచాలలోని ఒక కంటైనర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అ ప్పటికే అక్కడికి చేరుకున్న రెహాన్‌తో కలిసి చిత్రహింసలకు గురి చేశారు. రూ.50వేలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామ ని బెదిరించారు. భయపడిన ఆ యువకుడు తన వద్ద ఉన్న రూ.10 వేలు ఇచ్చి, బంధువులు, స్నేహితులతో మరో రూ.12వేలు ఫోన్‌పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం సరళ సందీప్, పొన్నాల ప్రణయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. మహిళల పేరిట చాటింగ్ కోరిక తీరుస్తామంటూ ఎర తీరా వచ్చాక నిలువు దోపిడీ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు -
కొలువుల వేట
చదువుల మూట.. సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. నేటికాలంలో ప్రభుత్వ ఉద్యోగాల మాట దేవుడెరుగు. ప్రైవేటు రంగంలోకి వెళ్తామన్నా పోటీ నెలకొందని పలువురు అంటున్నారు. చదువుకు తగిన ఉద్యోగం, ఉద్యోగానికి తగిన వేతనం దొరక్క నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల జిల్లాల్లోని ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రైవేటు కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నా.. వేలల్లో నిరుద్యోగులు ప్రయివేటు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆందోళన కలిగిస్తోన్న నిరుద్యోగ రేటు ఉమ్మడి జిల్లాలో ఏటా వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారి కన్నా.. నిరుద్యోగులుగా నమోదవుతున్న వారే అధికంగా ఉంటున్నారు. జాతీయ కార్మిక బలగం వార్షిక (2023–24)నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 16.06శాతం ఉన్నట్లు చెబుతోంది. డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివినా జీవనోపాధి లభించకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణమని తెలిపింది. డిమాండ్ ఉన్న కోర్సులు ప్రస్తుతకాలంలో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పిన విధంగా కోర్సులు ఎన్నుకుంటున్నారు. వారికి నచ్చిన నచ్చకపోయినా కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఆ కోర్సులకు మార్కెట్లో డిమాండ్ ఉందా? లేదా అనే అంశాన్ని మర్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వైద్యసేవలందించే సంస్థలు పెరిగిపోతుండటంతో నర్సింగ్, ఫార్మసీ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని, ఐటీఐ, ట్రేడ్‌ల్లో కోర్సులు అభ్యసించినవారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సుమారు 5వేల మంది నమోదు ఉమ్మడి జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఏడాదికి సుమారు 5వేల మంది యువత నిరుద్యోగులుగా నమోదు చేసుకుంటున్నారని అధికారులు చెబతున్నారు. ప్రతీనెలా సుమారుగా రెండు ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. హాజరైన వారిలో 50శాతం మంది ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారని అధికారులు చెబుతున్నారు. చాలామందిలో సరైన ఉద్యోగ సామర్థ్యాలు లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది కోర్సు పూర్తిచేస్తున్నారే తప్పా... ఉపాధి మార్గాల వైపు దృష్టి సారించలేకపోతున్నారని వివరిస్తున్నారు. వేతనం తక్కువగా ఉందనుకోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడకపోవటం ప్రధాన కారణాలు అంటున్నారు. ఎంపికవుతున్నా.. నిరుద్యోగ యువతకు ఉపాధి కార్యాలయాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నా సరిగా సద్విని యోగం చేసుకోవడం లేదు. కొందరు ఎంపికై నా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సెలింగ్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, పోటీపరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – టి.తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి, కరీంనగర్ హైదరాబాద్‌లో ఉద్యోగం మాది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామం. నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. ఏప్రిల్‌లో ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన జాబ్‌మేళాలో పాల్గొన్న. హైదరాబాద్‌లోని ఓ ట్రస్ట్‌లో ఉద్యోగం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. నిరుద్యోగులుగా ఖాళీగా ఉండే బదులు ఏదైన ఒక కంపెనీ వెతుక్కుని ప్రతీ ఒక్కరు ఉపాధి పొందాలి. – ఎం మానస, శ్రీరాములపల్లి -
అతివేగం.. అజాగ్రత్త.. రెండు ప్రాణాలు
● పాదచారిని ఢీకొట్టిన ద్విచక్రవాహదారుడు ● ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరి మృతి ● చికిత్స పొందుతున్న మరొకరు గంగాధర: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపై గంగాధర మండలం ఇస్లాంపూర్ బస్టాండు సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం.. అజాగ్రత్త ఇద్దరి ప్రాణం బలిగొంది. నడుచుకుంటూ వెళ్తున్న హనుమాన్ దీక్షాపరున్ని ద్విచక్రవాహనదారుడు వెనకనుంచి వేగంగా ఢీకొట్టాడు. పాదచారితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. బైక్ వెనక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రైనీ ఎస్సై స్వాతి వివరాల ప్రకారం.. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన కొండి శ్రీనివాస్(33) హనుమాన్ దీక్ష స్వీకరించాడు. మాల విరమణ కోసం గురువారం రాత్రి కాలి నడకన కొండగట్టుకు తోటిస్వాములతో కలిసి బయల్దేరారు. గంగాధర మండలం ఇస్లాంపూర్ బస్టాండు సమీపంలో సుమారు 11 గంటలకు కొడిమ్యాల మండలం గౌరాపూర్ గ్రామానికి చెందిన కాసాని గణేశ్(30), కాసాని రాజు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ శ్రీనివాస్‌ను ఢీకొట్టారు. శ్రీనివాస్‌తో పాటు, గణేశ్ తీవ్ర గాయాల పాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాసాని రాజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అల్పచేసి అనంతలోకాలకు గర్శకుర్తి గ్రామానికి చెందిన కొండి శ్రీనివాస్ అల్ప చేసిన ఐదు నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. కొండి శ్రీనివాస్ జీవనోపాధి కోసం సింగపూర్ వెళ్లాడు. రెండేళ్లక్రితం తిరిగివచ్చి వివాహం చేసుకున్నాడు. ఏడాదిలోపు వయసున్న కూతురు ఉంది. స్వగ్రామంలో వెల్డింగ్‌షాపు నిర్వహిస్తున్నాడు. గ్రామంలోని మిత్రులతో కలిసి హనుమాన్ దీక్ష తీసుకున్నాడు. గ్రామానికి చెందిన దాదాపు 12మందితో కలిసి గురువారం ఏడుగంటల ప్రాంతంలో పాదయాత్రగా కొండగట్టుకు బయల్దేరారు. ఇస్లాంపూర్ సమీపంలో ఆగి అల్పాహారం తీసుకున్నారు. అరగంటసేపు విశ్రాంతి తీసుకుని పాదయాత్రగా బయల్దేరగా ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందాడు. -
డెంగీపై జాగ్రత్తగా ఉండాలి
జగిత్యాల: డెంగీపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి ఐఎంఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది జిల్లాలో 292 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందరూ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారని వివరించారు. ఈ ఏడాది డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు సైతం అవగాహన కల్పించాలన్నారు. దోమల నిర్మూలనే లక్ష్యంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్.శ్రీనివాస్, మలేరియా అధికారి సత్యనారాయణ, ఐఎంఏ సెక్రెటరీ శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రీధర్, రాజేశం, మురళీ, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సేవలతో నమ్మకం కలిగించాలిపెగడపల్లి(ధర్మపురి): ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సూచించారు. శుక్రవారం పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, వివిధ రకాల రిజిష్టర్లు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతిలు జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రి ద్వారా అందించే సేవలపై సూపర్వైజర్స్ వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్‌వో మహేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
వెయ్యి కంపెనీలు.. 3వేల ఉద్యోగాలు
● యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యం ● రేపు సింగరేణి మెగా జాబ్‌మేళా ● వేదిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ● పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగులకు అవకాశం గోదావరిఖని: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 18న మెగా జాబ్ మేళా నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో సుమారు వెయ్యికిపైగా కంపెనీలు పాలుపంచుకుంటాయి. తమకు అవసరమైన మూడువేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించాయి. సింగరేణి సంస్థ, నోబల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. యువత వద్దకే కంపెనీలు.. ఉద్యోగాల సాధన కోసం యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కంపెనీల వద్దకు వెళ్లకుండానే.. ఆయా కంపెనీలే యువత వద్దకు వస్తోంది. ఈమేరకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంది. గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 18న ఉదయం 8గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రామగుండం రీజియన్‌లోని మూడు ఏరియాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ జాబ్‌మేళాలో పాల్గొనే అవకాశం కల్పించారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి.. మెగా జాబ్‌మేళాకు హాజరైయ్యే యువతకు సింగరేణి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు చేస్తోంది. నిరుద్యోగులు తమ బయోడేటా, అర్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. మరింత సమాచారం కోసం హెల్త్‌లైన్ నంబర్లు 94911 44252, 99483 77353 నంబర్లలో సంప్రదించాలి. ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి.. మండుతున్న ఎండల ధాటికి యువత ఇబ్బందులు పడకుండా పెద్ద కూలర్లు ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఎండదెబ్బ తాకకుండా షామియానాలు వేస్తోంది. తాగునీరు, హెల్ప్‌డెస్క్ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇంటర్వ్యూల కోసం ప్రత్యేక స్టేజీ, అభ్యర్థుల ఎంట్రీ, ఎగ్జిట్ దారులను ఏర్పాటు చేస్తున్నారు. డీమార్ట్‌లో 200 ఉద్యోగాలు పారిశ్రామిక ప్రాంతంలో త్వరలోనే డీమార్ట్ మెగా షా పింగ్మాల్ ప్రారంభిస్తారు. అందులో పనిచేసేందుకు సుమారు 200మంది సిబ్బంది అవసరం. ఇలాంటి అనేక కంపెనీలు మెగా జాబ్‌మేళాలో పాల్గొంటాయి. అపోలో ఫార్మసీ, నాన్సీహెల్త్ కేర్, లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీస్, మెడిప్లస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పేటీఎం, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్, హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ తదితర సంస్థలకు చెందిన హెచ్ఆర్లు ఈ ఇంటర్వ్యూలో పాల్గొని తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారు. ఉద్యోగాలు ఇవే.. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఆస్పత్రులు, ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్, ఆఫీస్ అడ్మిస్ట్రేటివ్, నర్సింగ్ అర్హతలు – ఏడో తరగతి నుంచి పీజీ వరకు – డిప్లొమా – బీఫార్మా, ఎంఫార్మా – హోటల్ మేనేజ్మెంట్, డ్రైవింగ్ – బీఈ, బీటెక్, ఎంటెక్ – బీఏ, బీఎస్సీ, బీకాం – ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ సద్వినియోగం చేసుకోవాలి యువత సౌకర్యం కోసం సింగరేణి మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. సుమారు వెయ్యి కంపెనీల ప్రతినిధులను ఒకేవేదిక వద్దకు చేర్చుతోంది. వారికి అవసరమైన నిపుణులను గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువత హాజరు కావాలి. ఎక్కడో, ఎప్పుడో నిర్వహించే ఇంటర్వ్యూల కోసం రోజుల తరబడి ఎదుదుచూసే దానికన్నా మన చెంతకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. – లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1 -
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
● ఒకరి పరిస్థితి విషమం జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న యువకుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం లింగంపేట శివారులో చోటు చేసుకుంది. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంకు చెందిన ఏళ్ల అరవింద్ తన జన్మదిన వేడుకల కోసం అంతర్గాం, లింగంపేట శివారులోని గంగమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. అరవింద్ అతని స్నేహితులు తోపారపు గంగాధర్, ఉయ్యాల వంశీలు ఉండగా ఉండగా అదే గ్రామానికి చెందిన మహేశ్, రాకేశ్, చందు, దినేశ్‌తో పాటు మరికొంతమంది కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గంగాధర్‌కు 23 చోట్ల గాయాలు కాగా, అరవింద్, వంశీలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై గీత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేశ్, రాకేశ్, దినేశ్, చందులతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
ప్రాణం తీసిన ఈతసరదా
● ఈతకు వెళ్లి యువకుడి మృతి ఎలిగేడు(పెద్దపల్లి): స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన యువకుడు ముష్కి రాజీవ్‌గాంధీ(36) ఈత కోసమని వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన ముప్పిరితోట గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని జైభీమ్‌నగర్‌కు చెందిన ముష్కి రాజీవ్‌గాంధీ ఈనెల 14న ముప్పిరితోట గ్రామంలో జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతరకు వచ్చాడు. సాయంత్రం వేళ సరదాగా స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని బావిలో దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. నీటి సంపులో పడి చిన్నారి మృతివేములవాడ అర్బన్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లో గురువారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. తిప్పాపూర్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి జిక్రా ఫాతిమా ప్రమాదవశాత్తు ఇంటి ముందు నీటిసంపులో పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. రైలు ఢీకొని యువకుడు..మల్యాల: కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన అనుముల శేఖర్ (37) కొండగట్టు సమీపంలో రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వార్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. బుధవారం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందా? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలుజగిత్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధించారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనర్సయ్య ఇటీవల అతిగా మద్యం సేవించి వాహనం నడుపగా రాయికల్ ఎస్సై సుదీర్‌రావు పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్టేట్ సెకెండ్ క్లాస్ న్యాయమూర్తి కరుణాకర్ ముందు హాజరు పర్చగా ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గొర్రె, మేకల దొంగల అరెస్టుమల్యాల: గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు మల్యాల సీఐ నీలరం రవి, ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన ముద్దవేని అనిల్, మహ్మద్ మోసిన్, వెంకటేశ్‌లు రాత్రివేళ గ్రామాల్లో మోటారు సైకిల్, ఆటోల్లో తిరుగుతూ షెడ్లలోని గొర్రెలు, మేకలను దొంగిలించి కొన్నింటిని అమ్ముకోగా, మరికొన్నింటిని కోసి మాంసం విక్రయించే వారన్నారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మల్యాల ప్రాథమిక సహకార కేంద్రం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా బైక్, ఆటోలో రెండు మేకలు, రెండు గొర్రెలు తీసుకెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించినట్లు అంగీకరించారన్నారు. బైక్, ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
దేశరక్షణలో పల్లె యువత
● సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జిల్లా బిడ్డలు ● కశ్మీర్లో కాపలాగా ఉన్న యువకులు ● గర్వంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట(మానకొండూర్): దేశరక్షణలో జిల్లా యువత ముందుంటున్నారు. ఉగ్రవాద ముష్కరులను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ దేశసరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా జిల్లాలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైన్యంలో పనిచేస్తున్న జిల్లాకు చెందిన యువతలో అత్యధికులు జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తూ రక్షణగా నిలుస్తున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి జవ్వాజి ప్రసాద్, బెదిరె వేణు, కోనరావుపేట నుంచి కస్తూరి ప్రశాంత్‌రెడ్డి, అజ్జు, ఎగ్లాస్పూర్ నుంచి తాళ్లపెల్లి శ్రీకాంత్, తాళ్లపెల్లి వినోద్, వేములవాడ మండలం చెక్కపల్లి నుంచి మెతుకు మధుకర్‌రెడ్డి, ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన అంతటి అనిల్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్, లడక్‌లో దేశభద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నారు. -
ఇల్లాలు.. కన్నీళ్లు
కరీంనగర్‌క్రైం: పెళ్లి చేసుకొని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది రకరకాల రూపాల్లో వేధింపులు ఎదురవుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు పెరుగుతున్నాయి. పోలీసుస్టేషన్లలో పెద్ద ఎత్తున పిటిషన్లు ఈ కారణాలతోనే వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల పరంగా వెనకబడడంతో మగవారు మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బానిసవుతున్నారు. దీంతో నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టడం, ఇల్లాలిని తిట్టడం, భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ● అనుమానం పెనుభూతంగా మారి ఇల్లాలిని హత్య చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వివిధ రకాల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ● ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం కారణంగానే హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భయపడి ముందుగానే తనువు చాలిస్తున్నారు. ● బతుకుబండిని మోయలేక వ్యసనాలకు అలవాటుపడి భర్తలు.. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి కనీస అవసరాలను సైతం వివాహితలు పుట్టింటివారికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉంటున్నాయి. ● అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఎక్కువ శాతం వివాహితలు ఉంటున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇంట్లో సమస్యలు భరించలేక, వేధింపులు తట్టుకోలేక ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. వేధింపులు ఆగడంలేదు సమాజంలో మహిళలపై వేఽ దింపులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వివిధ విషయాల వల్ల ఆడవారిపై భర్త, వారి కుటుంబ సభ్యుల గృహహింస కేసులు పెరుగుతుండడం కనిపిస్తుంది. చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఆడవారి భద్రతకు మరింత కఠిన చట్టాలు అవసరం. – కర్రె పావని, ఆదరణ సేవా సమితి, ఎన్జీవో నిర్వాహకురాలు కౌన్సెలింగ్ ఇస్తున్నాం గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి. మేము సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి జంటలను కలుపుతున్నాము. తీరుమార్చుకోకపోతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం. – శ్రీలత, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ -
ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..
నేను గత ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే ఉంటున్నాను. మా నాన్న అంజయ్య మద్దిమల్లలో పనులు చేసుకుంటాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. నేను ప్రస్తుతం పంజాబ్ సమీపంలోని పటిండ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బాంబు పడింది. – తాళ్లపల్లి వినోద్, ఎగ్లాస్పూర్ (కోనరావుపేట) దేశ సేవలో.. నా తల్లిదండ్రులు బెదిరె నాంపెల్లి–లక్ష్మి. అమ్మానాన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. నేను 2019లో ఆర్మీలో చేరాను. గత ఐదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని వేణు పేర్కొన్నాడు. – బెదిరె వేణు, మామిడిపల్లి (కోనరావుపేట) -
సరస్వతీ నమస్తుతే..
● విశేష పూజలతో పుష్కరాలు ప్రారంభం ● తొలిస్నానం ఆచరించిన శ్రీశ్రీ మాధవనంద సరస్వతిస్వామి ● మొదటిరోజు సుమారు 50 వేల మంది పుణ్యస్నానం కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి సరస్వతి ఘాట్‌లోని త్రివేణి సంగమం, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది. మొదటి రోజు భక్తుల తాకిడి.. తొలిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం కిక్కిరిసింది. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. హారతి గద్దెలకు ఏడు జీవనదుల పేర్లు సరస్వతి నది పుష్కరాల సందర్బంగా కాశీ పండితులచే నవరత్నమాల హారతి కార్యక్రమం నిర్వహించడానికి చతుర్వేదసరస్వతి ఘాట్ వద్ద ఏడు గద్దెలు నిర్మించారు. దేవాదాయశాఖ అధికారులు ఆ గద్దెలకు ఏడు జీవనధుల పేర్లను ప్రకటించారు. వాటిలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధూ, కావేరి పేర్లను శిలాఫలకం రూపంలో తయారు చేసి ప్రదర్శించారు. కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులను అభినందించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృత/్ఞతలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫుష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కరాలను భక్తులు ఆచరించాలని సూచించారు. -
ప్రతీ జిల్లాలో రైతువిజ్ఞాన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు లేని అన్నిజిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గురువారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించారు. జానయ్య ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 జిల్లాల్లో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీజిల్లాలో 50 ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రైతు కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులతో పంటలపై అనేకరకాల పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు. ఆర్ఎంపీల మాదిరిగా గ్రామాల్లో ఫార్మర్స్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ సీడ్ సంస్థ రూపొందించిన శ్రీమన సంస్థ– మన విత్తనంశ్రీ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సైదానాయక్, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులు భాస్కర్, శ్యాంప్రసాద్, రైతు నాయకులు రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య -
టికెట్ బుక్ చేసుకొని.. అక్కడే ఆగిపోయి
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ అంతటి అనిల్ జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 8 నెలలుగా జమ్మూసెక్టార్లోనే ఉంటున్నాడు. ఈనెల 7న ఇంటికొచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ 6వ తేదీ నుంచి యుద్ధ సన్నాహాలు మొదలుకావడంతో అక్కడే ఉండిపోయాడు. ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి 11 మంది యువకులు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటి అనిల్ -
మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు
మల్లాపూర్: మండలంలోని రాఘవపేటలో శ్రీమేడాలమ్మ కేతమ్మ సహిత శ్రీమల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలను శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. దేవతార్చన, అగ్నిప్రతిష్ట, హోమాలు, బలిహరణం, పూర్ణాహుతి, కుంబాభిషేకం, శాంతికల్యాణం పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బైరి రాకేశ్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తాలుక మల్లయ్య, కోశాధికారి బైరి రవికుమార్‌యాదవ్, సంఘం సభ్యులు పెద్దులు బక్కన్న, రాజేశం, రాజేందర్, దేవన్న, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. పదోన్నతి బాధ్యతలను పెంచుతుంది జగిత్యాలక్రైం: పోలీసు శాఖలో పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆర్మ్డ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందిన జాదవ్ గోఖుల్కు పదోన్నతి చిహ్నాన్ని అందజేశారు. పదోన్నతి పొందిన ఉద్యోగి బాధ్యతతో పాటు క్రమశిక్షణగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపట్ల నమ్మకం, గౌవవాన్ని పెంచేలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావ్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు. తిరంగా ర్యాలీజగిత్యాలటౌన్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలో భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతపట్టుకొని పట్టణంలోని తహసీల్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్, రాంబజార్, టవర్‌సర్కిల్ మీదుగా ర్యాలీ సాగింది. అనంతరం భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయానికి సూచికగా భారత ప్రజలంతా తిరంగా ర్యాలీలు నిర్వహించడం దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గాజుల నగేశ్, నాయకులు పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్, బోయిన పద్మాకర్, అక్కినపెల్లి కాశీనాథం, మ్యాన సుధాకర్, నరేందుల శ్రీనివాస్, చంద సుగుణాకర్‌రావు, బండి సత్యనారాయణ, రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు. రక్త నిల్వలు పెంచుకోవాలి జగిత్యాల: జిల్లాలో రక్త నిల్వలు పెంచుకోవాలని, రక్తదాతల సహకారం ఉండాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ఎంతో గొప్పదని, అత్యవసర పరిస్థితుల్లో మన ప్రాంతంలో అందుబాటులో గల రక్తనిల్వలను గురించి తెలుసుకోవడానికి రక్త కోశ్ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారా మన ప్రాంతంలో గల బ్లడ్ బ్యాంక్ వివరాలు, ప్రతీ గ్రూప్ రక్తనిల్వల సంఖ్య తెలుసుకోవచ్చని తెలిపారు. ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ ప్రతీనెల రక్తశిబిరాలు నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంత యువకులు ముందుకు వచ్చి 26 మంది రక్తదానం చేశారన్నారు. అనంతరం వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుదీర్‌కుమార్, మోహన్‌రెడ్డి, సతీశ్‌కుమార్, గురువారెడ్డి పాల్గొన్నారు. -
మనదీ ఘన చరిత్రే
● చారిత్రక కట్టడాలకు నిలయం ● పర్యాటకంలో ఉమ్మడి కరీంనగర్ ● ప్రపంచ సుందరీమణులకు చూపించని వైనం ● అధికారులకు కనపించని ఉమ్మడి జిల్లా ఘన సంస్కృతివిద్యానగర్(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ చారిత్రక భాండాగారం. ప్రాచీన సంస్కృతి, కళారూపాలు, చారిత్రక వారసత్వ సంపద కలిగిన గొప్ప జిల్లా. గత చరిత్రకు ఆలవాలమైన చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వినోదం కలిగించే సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. విశ్వసుందరి పోటీలు మన రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న వేళ కరీంనగర్ చారిత్రాత్మక కళా వైభవాన్ని మన అధికారులు విస్మరించడంపై ఉమ్మడి జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.– 8లోu -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
● అదనపు లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి–మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభాగాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ..దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడటం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుగాపై నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరి కొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈ సారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లైప్లైన్ల ఏర్పా టు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మె యిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది. కొత్తపల్లి–మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరాబా ద్ (151 కిమీ) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కిమీ) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మధ్య లైన్‌పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు సవా లుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ సర్వేలకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్‌పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది. మెయిన్‌లైన్‌కు ● నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు ● పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కిమీ) ను బల్లార్షా కాజీపేట మెయిన్ లైన్‌కోసం రూ.36.99 కోట్లు స్టేషన్ల కోసం.. ● నూకపల్లి– మల్యాల నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్‌ను బ్లాక్ స్టేషన్‌గా మార్చేందుకు రూ.15.85 కోట్లు ● కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు ● నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు ● మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్లాట్‌ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు ● పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు ● పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు ● సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్‌గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు ● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్‌కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు. రైలు వంతెనల కోసం.. ● కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీ కోసం రూ.29.33 కోట్లు ● పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు ● కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు -
కార్మికుల వేతనాలు పెంచాలి
● డ్రైవర్ల ఆందోళన.. ఎమ్మెల్యేకు వినతి ● జీవో ప్రకారం చెల్లింపు అంటున్న మున్సిపల్ అధికారులుజగిత్యాల: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అన్న చందంగా మారింది జగిత్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి. 72 మంది డ్రైవర్లు పనిచేస్తుండగా 52 మందికి రూ.20 వేల వరకు వేతనం వస్తుండేది. మిగతా వారు జీతాల్లో వ్యత్యాసం ఉందని, మాకు సైతం పెంచాలని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జీవోలో మంజూరు ఉన్న 34 మందికి డైరెక్టర్ ఆఫ్ కంట్రిప్లానింగ్ వారు జారీ చేసిన దానిలో డ్రైవర్లుగా సాంక్షన్ ఉంది. ప్రస్తుతం 34 మందికే రూ.20 వేల జీతం చెల్లిస్తున్నారు. మొన్నటి వరకు 57 మందికి చెల్లించారు.. స్పెషల్ ఆఫీసర్ అనుమతితో చెల్లించాల్సి ఉన్నా వారికి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి రాలేదని బల్దియా అధికారులు పేర్కొంటున్నారు. కానీ కార్మికులు మాకు మొన్నటి వరకు జీతాలు చెల్లించి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేకు వినతి గతంలో రూ.20 వేల జీతం చెల్లించగా ప్రస్తుతం తగ్గించి రూ.16 వేలు చెల్లించారని మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వద్దకు వెళ్లి వినతిపత్రం అందజేశారు. గతంలో మాకు జీతాలు రూ.20 వేల వరకు చెల్లించారని, తగ్గించడంతో మా కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి రూ.20 వేల జీతం చెల్లించాలని వారు కోరుతున్నారు. కార్మికులకు అండగా ఉంటా: సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే కార్మికులకు అండగా ఉంటానని, అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్తా. జీవో ప్రకారం ఇచ్చాం : స్పందన, మున్సిపల్ కమిషనర్ 34 మందికే ప్రభుత్వం గత ఫిబ్రవరిలో డ్రైవర్లుగా మంజూరు ఇచ్చింది. డ్రైవర్లతో సమావేశం నిర్వహించాకే నిర్ణయం తీసుకున్నాం. గతంలో సుమారు 57 మందికి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. -
నిర్వహణపై నిర్లక్ష్యం
● జిల్లాలో నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణాలు ● అందుబాటులో లేని ఆట వస్తువులు ● కొరవడిన వసతులు మెట్పల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడలపై ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. వాటిల్లో పూర్తిస్థాయి ఆట వస్తువులు అందుబాటులో ఉంచకపోవడం, సరైన వసతులు కల్పించక పోవడంతో జిల్లాలో అలంకార ప్రాయంగా మారాయి. వీటి నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిరుపయోగంగా మారి ప్రజాధనం వృథా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 26వార్డుల్లో రూ.30లక్షలు కేటాయింపు ● మెట్పల్లి మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. వీటిలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం రూ.30 లక్షలు మంజూరయ్యాయి. ● 20 వార్డుల్లో స్థలాలను ఎంపిక చేసి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయగా.. మిగతా ఆరు వార్డుల్లో స్థలాల సమస్యతో ఏర్పాటు చేయలేదు. ● ఒక్కో క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, ఖోఖో కోట్లు, రెండు ఎక్సర్సైజ్ బార్లు, లాంగ్ జంప్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. కానీ చాలా చోట్ల్ల కేవలం రెండు ఎక్సర్సైజ్ బార్లతోనే సరిపెట్టారు. జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి ● ఒక్క మెట్పల్లిలోనే కాకుండా దాదాపుగా జిల్లా అంతటా క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే ఉంది. ● ఎక్కడా కూడా వాలీబాల్, లాంగ్ జంప్, ఖోఖో కోట్లను ఏర్పాటు చేయకపోవడమే కాకుండా వాటికి సంబంధించిన సామగ్రిని అందుబాటులో ఉంచలేదు. ● మరోవైపు పంచాయతీలు, మున్సిపాలిటీలు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ● వాటిల్లో లైట్లు, నీటి వసతి వంటి కనీస వసతులు కల్పించలేదు. ● పరిశుభ్రత చర్యలను చేపట్టడం లేదు. అంతేగాకుండా కొన్ని చోట్ల గ్రామాలకు, కాలనీలకు దూరంగా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ● ఈ కారణాలతో అవి నిరుపయోగంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● వీటి ఏర్పాటుకు జిల్లా మొత్తం మీద రూ.కోట్లు వెచ్చించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడం గమనార్హం. తగిన చర్యలు తీసుకుంటాం చాలా చోట్ల క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. కాలనీలకు దూరంగా ఉన్న వాటిని మరో చోటుకు తరలిస్తాం. ప్రతీ ప్రాంగణంలో తగిన వసతులు ఏర్పాటు చేస్తాం. క్రీడాకారులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. – మోహన్, మున్సిపల్ కమిషనర్, మెట్పల్లి ఇది మెట్పల్లి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం. జనం వెళ్లని ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో అధ్వానంగా తయారైంది. ఇందులో రెండు ఎక్సర్సైజ్ బార్లు తప్ప మిగతా క్రీడా పరికరాలు ఏమీ లేవు. క్రీడాకారులెవరూ అటు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలా ఒక్క చోటనే కాదు జిల్లాలో చాలా చోట్ల క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే ఉంది. -
ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం
● నాసిరకం విత్తన కంపెనీలకు ఫుల్స్టాప్ ● యూరియా వాడాకాన్ని తగ్గించడమే లక్ష్యం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అల్దాస్ జానయ్యజగిత్యాలఅగ్రికల్చర్: ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించడమే వ్యవసాయ విశ్వవిద్యాలయ లక్ష్యమని ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అల్దాస్ జానయ్య అన్నారు. జగిత్యాలరూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి గురువారం వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. -
కలెక్టర్ ఆదేశించినా అమలు కావడం లేదు
జగిత్యాల: మామిడి మార్కెట్లో వేలం నిర్వహించి పంట కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించినా కిందిస్థాయి అధికారులు అమలు చేయక రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక రైతులు, కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సౌకర్యంగా ఉండాలని మామిడి మార్కెట్‌ను అభివృద్ధి చేశామన్నారు. మార్కెట్లో వేలం పాట నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్‌కు విన్నవించగా స్పందించి మార్కెట్‌ను సందర్శించి ఇక్కడే వేలం పాటలు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కామన్ప్లేస్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. మామిడి మార్కెట్లో జరుగుతున్న అవకతవకలకు జిల్లా మార్కెట్ శాఖ అధికారి, మార్కెట్ శాఖ కార్యదర్శిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు. 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జిల్లాలో ఇప్పటివరకు 2.60 లక్షల మెట్రిక్ ట న్నుల వరిధాన్యం సేకరించినట్లు జీవన్‌రెడ్డి తెలి పారు. సేకరించిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లో డబ్బులు జమవుతాయన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, నాయకులు దుర్గయ్య, నందయ్య, రాజేందర్, రమేశ్రా వు, షేక్చాంద్పాషా, ఽరమేశ్బాబు పాల్గొన్నారు. -
హద్దు సమస్యలకు చెక్
నిద్ర..‘కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిది ప్రైవేట్ జాబ్. రోజూ ఉదయమే విధులకు వెళ్లి పొద్దంతా పని చేసి సాయంత్రానికి అలసిపోయి ఇంటికి చేరేవాడు. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రలోకి జారుకోగానే గురకపెట్టేది. అతడికి తెలియకుండానే గురకతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడేది. శ్వాసలో ఇబ్బంది గురించి కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెట్టాడు. గురకే కదా అని నిర్లక్ష్యం చేశాడు. కొద్దిరోజులకు సమస్య తీవ్రరూపం దాల్చినా పట్టించుకోలేదు. ఓ రోజు వేకువజామున నిద్రలోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు’.గురక..ఉమ్మడి జిల్లా జనాభాగుండెపోటు!● లీకేజీలు అరికడతాం ● ఇప్పటికై తే సమస్య లేదు ● ధర్మసముద్రంలో సరిపడా నీరు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనర్ స్పందన● భయపెడుతున్న గుర్‌గుర్ ● జనాభాలో 10 శాతం మంది బాధితులు ● హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమంటున్న డాక్టర్లు ● ప్రారంభంలో చికిత్స చేస్తే ఫలితమంటున్న నిపుణులుకరీంనగర్: 10,05,711జగిత్యాల: 13,57,796పెద్దపల్లి: 7,95,332సిరిసిల్ల: 5,52,037 జగిత్యాల: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని బుగ్గారం మండలం ఎంపికై ంది. పూర్తి స్థాయి సమగ్ర సర్వే చేసేందుకు సర్వేయర్లు తక్కువగా ఉండటంతో నూతనంగా లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. అర్హత గల ప్రైవేటు సర్వేయర్లతో పాటు కొత్త వారిని తీసుకొని ప్రత్యేక శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. 50 మందికి అవకాశం జిల్లాలో 20 మండలాలు ఉండగా 8 మంది మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. వీరు సరిపోవడం లేదు. మరో 50 మందిని ఎంపిక చేసి జూలై 26వ తేదీ నుంచి మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరికి లైసెన్స్ ఇచ్చి భూ భారతి చట్టం అమలులో సర్వే పనుల కోసం వీరిని వినియోగించుకుంటారు. రైతులకు కొంతమేర ఉపశమనం జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎవరైన రైతులు భూ సమస్యల కోసం దరఖాస్తులు చేసుకుంటే కొన్నేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వీరికి సంబంధం లేనప్పటికీ నూతనంగా వచ్చే లైసెన్స్ సర్వేయర్లు ముందుగా రైతులకు సంబంధించిన నక్ష తీసుకొని అనంతరం రెగ్యులర్ సర్వేయర్ల ద్వారా వాటిని అఫ్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ హైవే భూ సేకరణ కోసం అనేక మంది అధికారులు ఫీల్డ్‌పై వెళ్తుండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. వీరు వస్తే రైతులకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది. భూ కొలతల సమస్యలు తీరుతాయి. ఉపాధి సైతం.. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. భూభారతి చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఐఐటీ, డిప్లొమా, బీటెక్, సివిల్ చదువుతున్న వారికి ఇది ఎంతో అవకాశం. లైసెన్స్డ్ సర్వేయర్‌గా చేరిన అంనతరం మున్ముందు సర్వేయర్‌గా కొనసాగే అవకాశం ఉంది. సమగ్ర సర్వేకు లైసెన్స్డ్ సర్వేయర్లు జిల్లాలో 50 మందికి అవకాశం 26 నుంచి శిక్షణ భూభారతి నూతన చట్టంలో పాల్గొనేలా అవకాశం -
జగిత్యాల: జగిత్యాల.. జిల్లాకేంద్రం. ఆపై గ్రేడ్–1 మున్సిపాలిటీ. పెరుగుతున్న పట్టణ జనాభా. వీరికి తాగునీరు అందించేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నా.. అక్కడక్కడ లీకేజీ సమస్యలు వేధిస్తున్నాయి. ఎండలు మండిపోతుండడంతో ఇప్పుడిప్పుడే తాగునీటికి కటకట ఏర్పడు
సాక్షి: ఎండలు ముదురుతున్నాయి. బల్దియాలో నీటి ఎద్దడి ఉందా..? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?కమిషనర్: ఇప్పటికై నా తాగునీటి సమస్య లేదు. జిల్లాకేంద్రానికి తాగునీరు అందించే ధర్మసముద్రంలో రెండు నెలలకు సరిపడా నీరు ఉంది. ప్రస్తుతానికి మిషన్ భగీరథ నుంచి వచ్చే నీటినే సరఫరా చేస్తున్నాం. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: లీకేజీ సమస్య ఎక్కువగా ఉంది? పాత పెపులైన్లను ఎలా సరిచేస్తున్నారు?కమిషనర్: జిల్లా కేంద్రంలో పాత పైప్లైన్లు ఉన్నాయి. వాటిద్వారా కొన్నిచోట్ల లీకేజీ సమస్యలున్నాయి. వాటన్నింటినీ గుర్తించాం. ఇప్పటికే చాలావరకు మరమ్మతు చేయించాం. మిగిలిన చోట్ల కూడా చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: రంగుమారిన నీరు సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి?కమిషనర్: అలాంటిదేమీ లేదు. ఏదైనా వర్క్స్ జరిగినప్పుడు మున్సిపల్ నీరు మిక్స్ అయితే వచ్చే అవకాశాలుంటాయి. వాటిని కూడా గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు చేపడతాం. సాక్షి: రోజుకు ఎన్ని లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిపోతున్నాయా?కమిషనర్: జిల్లాకేంద్రంలోని జనాభాకు ప్రతిరోజూ 18.1 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్డే) అవసరం. ప్రస్తుతం కోటి 80 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రజలకు సరిపోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు. సాక్షి: కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తున్నారా? ఇప్పుడెన్ని ఉన్నాయి?కమిషనర్: అమృత్ పథకం కింద కొత్త కనెక్షన్లు ఇస్తున్నాం. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి రూపాయికే కనెక్షన్ ఇస్తున్నాం. మిగతా వారికి రూ.200కు కనెక్షన్ ఇస్తున్నాం. దరఖాస్తు చేసుకున్నవారికి ఇస్తాం.సాక్షి: శివారు ప్రాంతాలకు నీరు రావడం లేదని ఆరోపణలున్నాయికమిషనర్: జిల్లాలో ఇటీవల విలీనమైన 48వార్డులో కొంత సమస్య ఉంది. అయినప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని పంపించేలా చూస్తున్నాం. ఎంత కష్టమైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. సాక్షి: ట్యాంకర్లు ఉన్నాయా..? అత్యవసర పరిస్థితుల్లో సరఫరా చేస్తారా..?కమిషనర్: మున్సిపాలిటీలో 4 ట్యాంకర్లు ఉన్నాయి. ఎవరికై నా అవసరం పడితే ఫోన్ చేస్తే పంపిస్తున్నాం. వేసవిలో ఎవరికై నా నీటి సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. సాక్షి: కొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు వస్తోందని అంటున్నారు..?కమిషనర్: కొన్నిచోట్ల ఇటీవల కొత్త లైన్లు వేశాం. సాయినగర్ కాలనీలో రోజువిడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నాం. కొత్త పైప్‌లైన్‌తో కొంత ఇబ్బంది ఉంది. వారికి కూడా ఇబ్బ ంది కలగకుండా పంపిణీ చేస్తాం. సాక్షి: నిజామాబాద్ రోడ్లో పైప్‌లు పగిలి నీరంతా వృథా అవుతోంది..?కమిషనర్: ప్రధాన రహదారుల్లో కొంతమేర లీకేజీలు అవుతున్నాయి. అక్కడ మరమ్మతు చేయించాలన్నా.. ఇబ్బందికరంగా ఉండేది. కొన్నిచోట్ల చేశాం. కొత్త పైప్‌లైన్ వేసవి చర్యలు తీసుకుంటాం. సాక్షి: ధర్మసముద్రంలో నీటి మట్టం తగ్గుతోంది?కమిషనర్: ప్రస్తుతం బల్దియా ప్రజలకు మిషన్ భగీరథ నీటినే సరఫరా చేస్తున్నాం. మిషన్ భగీరథ నీరు రాని పక్షంలోనే ధర్మసముద్రం నుంచి నీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తాం. అందులోని నీరు సుమారు 15 రోజులకు సరిపడా ఉంది. ఇప్పటికిప్పుడైతే బల్దియాకు నీటి కొరత లేదు. -
అంజన్న సన్నిధిలో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ పూజలు
మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కలెక్టర్ బి.సత్యప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎస్పీ అశోక్‌కుమార్ బుధవారం ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు. సకాలంలో టీకా వేయించాలి వెల్గటూర్: పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు, వ్యాధుల బారిన పడకుండా సకాలంలో టీకాలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో నీలారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం వెల్గటూర్ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న టీకాలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆరోగ్య కేంద్రంలో రోజువారీ ఓపీ, డెలివరీలు, మందుల నిల్వలను తనిఖీ చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న టీబీపై అవగాహన కార్యక్రమ వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట హెల్త్ అసిస్టెంట్ జగన్నాథం, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే పంటల్లో దిగుబడి జగిత్యాలఅగ్రికల్చర్: భూమి ఆరోగ్యాన్ని కాపాడితేనే పంటల్లో దిగుబడులు సాధ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు జి. వేణుగోపాల్, శ్రీనివాస్ నాయక్ అన్నారు. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా బుధవారం జగిత్యాల రూరల్ మండలంలోని హైదర్‌పల్లిలో రైతులతో సమావేశమయ్యారు. నేలను సారవంతం చేసేందుకు కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా పంటలకు సంబంధించిన బ్రోచర్‌ను రైతులకు అందించారు. సమ్మెను జయప్రదం చేయాలికోరుట్ల: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. బుధవారం పట్టణంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, నర్సయ్య, ఇస్తారు, రాజు, హమాలీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యపై చిన్నచూపు
● పాఠశాలల్లో స్వీపర్లు, స్కావెంజర్ల కొరత ● కంపుకొడుతున్న మూత్రశాలలు, మరుగుదొడ్లు ● విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయుల ఆరాటం ● సౌకర్యాలు లేక వెనుకాడుతున్న తల్లిదండ్రులుసహాయకులను నియమించాలి పాఠశాల విద్య మార్పుల్లో భాగంగా ప్రభుత్వం స్కావెంజర్‌ను నియమించడం హర్షణీయం. ఏక్‌భారత్ శ్రేష్ట భారత్, ఎకోక్లబ్ వంటి కార్యక్రమాల్లో కూడా స్కావెంజర్ అవసరం ఏర్పడుతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ (పూర్వ ప్రాథమిక విద్య) విద్యార్థులకు వారి కనీస అవసరాలకు అంగన్వాడీ పాఠశాల మాదిరిగా సహాయకులను నియమించడం ద్వారా విదార్థుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడుతుంది. – నీలం సంపత్‌కుమార్, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెల్గటూర్: ఓ వైపు మన ఊరు మన బడి.. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వం పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నా.. విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నా.. బడుల్లో స్వీపర్లు, స్కావెంజర్ల కొరతతో పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. స్వీపర్లు, స్కావెంజర్ల కొరతతో విద్యాలయాల్లో ఊడ్చే వారులేక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు పిచ్చిమొక్కలతో నిండిపోతున్నాయి. క్లాస్ రూములను శుభ్రం చేసేవారు లేక అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నా.. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అవుతుండడంతో విద్యార్థుల సంఖ్యను పెంచడం ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధ్యాయుల కసరత్తు జిల్లాలో మొత్తం 757 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 471 ప్రాథమిక, 69 ప్రాథమికోన్నత, 218 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 55,500 మంది విద్య అభ్యసిస్తున్నారు. రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులు బడిబాట ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే పాఠశాలల్లో స్వీపర్లు స్కావెంజర్ల పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో పిల్లలను బడికి పంపించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. విద్యార్థులు నిత్యం వినియోగించే తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రతీరోజు శుభ్రం చేయకపోవడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది, పట్టణాల్లో మున్సిపాలిటీ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించాలని ప్రభుత్వం సూచించినా పని ఒత్తిడి కారణంగా వారు ముందుకు రావడం లేదు. పాఠశాల కమిటీలే తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకుని పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నాయి. అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు 2024–25 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడం.. చెట్లకు నీరు పట్టడం వంటి పనులకు ఒకరిని నియమించుకోవాలని, వారికి విద్యార్థుల సంఖ్య ప్రకా రం జీతభత్యాలు అందించాలని రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ప్రొసీడింగ్ ఇచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా అమలు కాకపోవడం.. ఒక్కో జిల్లాలో విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా ఎంతమంది విద్యార్థులు ఉన్నా.. ఒకేలా జీతం ఇవ్వడం.. అదికూడా సమయానికి రాకపోవడం వంటి కారణాలతో పని చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం వరకై నా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జీతభత్యాలు సక్రమంగా అందిస్తే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి బలో పేతం అవుతాయని మేధావులు సూచిస్తున్నారు. -
అధికారులు సమన్వయంతో పని చేయాలి
● భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి ● కలెక్టర్ సత్యప్రసాద్మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. బుధవారం మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. చలివేంద్రాల ఏర్పాటు, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా వైద్యశిబిరాలతో పాటు 108 వాహనం సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, ఆర్డీవో మధుసూదన్, ఈవో శ్రీకాంత్‌రావు, డీఎస్పీ రఘుచందర్, ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ మునీందర్, సీఐ రవి, వివిధ విభాగాల అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి జగిత్యాలరూరల్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాలరూరల్ మండలంలోని చల్గల్ ఏఎంసీ, మోరపల్లి, బాలెపల్లి గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని, తేమ శాతం వచ్చిన ధాన్యంను వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలిస్తున్నామని అన్నారు. వడగళ్ల వర్షం పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న టార్పాలిన్లను రైతులకు అందజేయాలని సూచించారు. ప్రతీరోజు మిల్లులకు రవాణా నిమిత్తం లారీల కోరత లేదన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్‌కుమార్‌ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్‌కుమార్‌కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్‌కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది. -
కొండగట్టులో డిప్యూటీ సీఎం సతీమణి పూజలు
మల్యాల:కొండగట్టు అంజన్నను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కుమారునితో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు. ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని హనుమాన్‌వాడలో ద్విచక్రవాహనంపై వస్తున్న పాదం మల్లేశం, వితన్విల మృతికి కారణమైన నస్పూరి మణిదీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మల్లేశం, ఆయన సోదరుడి కూతురు వితన్వి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా మణిదీప్ అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మల్లేశం, వితన్వి మృతిచెందారు. మల్లేశం సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు మణిదీప్‌పై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, ఏఎస్ఐ మోహన్, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు. వడదెబ్బతో ఒకరి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జగదేవుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య (46) రెండురోజులు ఎండలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నర్సయ్యకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యకోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడకు చెందిన టేకి సాయిలు (35) మంగళవా రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ని జామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగా పూర్‌కు చెందిన సాయిలు కొంతకాలంగా ఇక్క డ హమాలీగా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం సాయిలు తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. నాలుగురోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి నిజామాబాద్‌లోని తల్లిగారింటికి వె ళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చు ట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హుజూరాబాద్ ఆలోచనల్లో మార్పు రావాలి అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. – ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్ మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్ -
రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం అందిస్తున్నాం
● రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వర్రావు ● జాబితాపూర్‌లో గోదాము నిర్మాణానికి శంకుస్థాపనజగిత్యాలరూరల్: రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వర్రావు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో రూ.13.38 కోట్లతో నిర్మించనున్న 20వేల టన్నుల గోదాముల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమని, రైతులకు గోదాముల నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రేషన్‌కార్డుపై పేద, మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా లేదన్నారు. 5 నుంచి 10 లక్షల టన్నుల గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఇప్పటివరకు 2.5 లక్షల టన్నుల గోదాములకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గోదాముల నిర్మాణంతో కూలీలకు ఉపాధి, రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పదేళ్లలో 20 వేల టన్నుల గోదాములు నిర్మిస్తే.. ఈ ఏడాదిలోనే 20 వేల టన్నుల గోదాములు నిర్మించబోతున్నామన్నారు. గోదాంకు వచ్చే బైపాస్‌రోడ్ విస్తరణ చేపడతామన్నారు. లక్ష్మీపూర్‌లో సీడ్ ప్రాసెస్ యూనిట్ నిర్మాణం పూర్తయిందని, కొంత సామగ్రి కొరత ఉందని, దానిని పూర్తి చేయాలని సూచించారు. గిడ్డంగుల డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, నాయకులు రవీందర్‌రెడ్డి, సదాశివరావు, మహేశ్, సతీశ్, శంకర్, నారాయణగౌడ్, రాజ్‌కుమార్, సత్తిరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శేఖర్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
ధర్మపురి: ప్రమాదవశా త్తు లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివనాగరాజు, క్లీనర్ దుర్గారావు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసి 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దుబాయి నుంచి వచ్చిన వారానికే..● బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి ధర్మపురి: దుబాయి నుంచి వచ్చి వారం రోజులకే బైక్ అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దోనూర్లో వెలుగుచూసింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన నారకట్ల చంద్రయ్య (43) కూతురుకు పెళ్లి చేద్దామని వారంక్రితం దుబాయి నుంచి వచ్చాడు. మంగళవారం దోనూర్లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. చంద్రయ్య తల రాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య ధనలక్ష్మి, కూతురు శ్రీజ, కుమారుడు తేజ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మధుకర్‌ను స్వదేశానికి రప్పించండి
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇతరులకు బ్యాంక్ ఖాతా ఇచ్చి ట్రావెల్ బ్యాన్ అయిన మల్లాపూర్ మధుకర్‌ను స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌కు చెందిన మల్లారపు మధుకర్ (27) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తన బ్యాంక్ ఖాతా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపారు. దీంతో అజ్మాన్‌లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. విషయం తెలుసుకున్న మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్య ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సీఎంవో ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇన్చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
‘పారమిత’ విద్యార్థుల ప్రతిభ
ఎన్టీపీసీ కేవీలో వందశాతం ఉత్తీర్ణత ‘సీబీఎస్ఈ’ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం‘మానేరు’ విజయకేతనం జ్యోతినగర్(రామగుండం): సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(సీబీఎస్ఈ)లో ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. పదో తరగతిలో 67 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓం సాహూ(484/500), 12వ తరగతిలో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. సైన్స్ విభాగంలో పెండ్యాల ఆగస్త్యశర్మ (398/500), కుడితేటి ప్రద్యుమ్నరావు (396/ 500), కామర్స్ విభాగంలో హ్రిశికేశ్ (44 1/500) మార్కులు సాధించారు. దీంతో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, నామిని చైర్మన్ బిజయ్‌కుమార్ సిగ్దర్, ప్రిన్సిపాల్ ఓరుగంటి శోభన్‌బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. చొప్పదండి నవోదయ ప్రభంజనం చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయం 2024–25 పదోతరగతి, పన్నెండో తరగతి సీబీ ఎస్ఈ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. పన్నెండో తరగతిలో 500మార్కులకు 483మార్కులు సాధించి పి.రుత్విక్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. పదోతరగతిలో వి.వశిష్ట యాదవ్ 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మంగతాయారు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్‌లోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. పదో తరగతిలో 500మార్కులకు గాను మహమ్మద్ షాజ్నీన్ తబాసుమ్ జాతీయస్థాయిలో 99.4శాతంతో 497మార్కులతో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఎం.సుచీత్రెడ్డి 493 మార్కులు, జె.సుప్రభ 492, ఆర్.వేదిక, టి.హర్షిణి 491, డి.హర్షిత్489, బి.ఆకృతి, సీహెచ్.అనీశ్‌కుమార్, రయానుద్దీన్ 488, ఏ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్రరెడ్డి 486మార్కులు సాధించారని పేర్కొన్నారు. 12వ తరగతిలో 500 మార్కులకు గాను వి.సంజీతరెడ్డి 482మార్కులు, ఎన్.అనిరుద్ సాయి 482, వి.శశాంక్‌రెడ్డి 478, జె.వమీకా 473 మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతిలో అత్యధికసంఖ్యలో విద్యార్థులు 90శాతం మార్కులు సాధించారని, 12వ తరగతిలో 13మంది 90శాతం మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో పారమిత హెరిటే జ్, వరల్డ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీకర్, పి.గోపికృష్ణ తెలిపారు. 500మార్కులకు గాను ఆకుల శ్రీరామచంద్ర 488 మార్కులు, రూపనిగమ, మనోజ్ఞలు 487, స్ఫూర్తి 481, బి.వర్షిణి480మార్కులు సాధించినట్లు తెలిపా రు. పాఠశాలకు చెందిన 62మంది 90శాతం పైన మార్కులు సాధించగా 80 నుంచి 100శా తం సాధించిన విద్యార్థులు 160మంది ఉన్నారని అన్నారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత ఈ.ప్రసాద్‌రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్‌రావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, వినోద్‌రావు, వీయూఎం.ప్రసాద్, టీఎస్వీ.రమణ, హన్మంతరావు, రవీంద్ర పాత్రో, నాగరాజు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాల నుంచి మొత్తం 98మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్‌లో 98మార్కులు, హిందీలో 97మార్కులు, సైన్స్, సోషల్‌లో 96మార్కులు, గణితంలో 95 మార్కులు సాధించారని అన్నారు. 500 మార్కులకు పాఠశాలకు చెందిన ఏ.ఆత్రేయ 471మార్కులు, మస్రా మహావీన్ 461, ఏ.అరవింద్‌రెడ్డి 458, ఏ.శరత్ చంద్ర 456మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డి అభినందించారు. పది, పన్నెండో తరగతి విద్యార్థుల సత్తా -
లగ్గం.. షరతుల పగ్గం!
హుజూరాబాద్: గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండుమూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. 30ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు.. వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. పట్టింపులతో సమస్య.. అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. తర్వాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. భిన్నమైన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే కట్నం ఎంతయినా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటినా సంబంధాలు దొరకడం లేదు. మానసిక సమస్యలు పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. -
కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
ఇబ్రహీంపట్నం/మల్లాపూర్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు చేయడం లేదా..? నిల్వలు ఎందుకున్నాయి..? అని ప్రశ్నించారు. ధాన్యం నిల్వ ఉంచకుండా లారీల్లో ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మల్లాపూర్ మండలం సాతారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూ చించారు. కేంద్రాల్లో నీటి సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో జితేందర్‌రెడ్డి, డీఎం జితేందర్, తహసీల్దార్లు వీర్‌సింగ్, ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్లు శ్రీనివాస్, ప్రసాద్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వెంకట్ పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలిమెట్పల్లి: పట్టణంలోని ఆరపేటలో కేందాన్ని సందర్శించారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
ఎంసీహెచ్‌లో విచారణ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం బాబు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ ‘నిర్లక్ష్యం వీడని వైద్యులు’ శీర్షికన కథనం ప్రచురించింది. కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ను ఆదేశించారు. ఆయన మంగళవారం మాతాశిశు కేంద్రానికి వెళ్లి వైద్యులను విచారించారు. బాబు ఎలా మృతిచెందాడు..? ఆస్పత్రిలో ఏం జరుగుతోంది..? అనే నివేదికను కలెక్టర్ కు అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వెంట ఆర్ఎంవో సుమన్‌రావు ఉన్నారు. -
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది.
ఆయిల్‌పాం సాగుతో లాభాలుమెట్పల్లిరూరల్: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. మెట్పల్లి మండలం బండలింగాపూర్లోని రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చిరొట్ట ఎరువుల యాజమాన్యం, సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించారు. ఆయిల్‌పాం సాగుకు పెట్టుబడి తక్కున్నారు. చీడపీడలు సోకే ఆస్కారం ఉండదన్నారు. సంప్రదాయ పంటలకు బదులు లాభాలు అందించే ఆయిల్ పాం సాగు చేయాలని సూచించారు. అనంతరం పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏడీఏ రమేశ్, ఏవో దీపిక, రైతులు పాల్గొన్నారు. -
ఇంధనం కరువు
● జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ ● పోలీసు వాహనాలకు డీజిల్ కరువు ● కరీంనగర్ కమిషనరేట్‌లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్‌కు సంబంధించి అర్బన్, రూరల్ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్‌హెచ్‌వోలు వాపోతున్నారు. గరిష్టంగా కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్జిల్లాలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రతీ నెలా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్‌లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిరిసిల్లలోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్‌కు తిప్పలే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్, రూరల్ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ వాహనాలు కరీంనగర్ 380 రామగుండం 168 జగిత్యాల 242 సిరిసిల్ల 211 (నోట్: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు) -
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
● ఇంటి నంబర్ ఇస్తలేరు గ్రామంలో మా తండ్రి తోట తిరుపతి పేరున ఉన్న ఇంటిని కూల్చివేసి గ్రామపంచాయతీ నుంచి ఆస్తి మార్పిడి, ఇంటి నిర్మాణ అనుమతులు పొంది ఇల్లు నిర్మించుకున్నాను. ఆ ఇంటికి ఆన్లైన్లో అనుమతి ఇచ్చినా ఇంటి నంబర్ కేటాయించడం లేదు. పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే మీకు అనుమతి ఇచ్చిన పాత కార్యదర్శిని అడగండంటూ తప్పించుకుంటున్నాడు. గతంలో ఇచ్చిన ఆన్లైన్ అనుమతుల మేరకు మా కొత్త ఇంటికి నంబర్ ఇప్పించండి. – తోట శ్రీరాములు, ఇబ్రహీంనగర్, గొల్లపల్లి మండలం జగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి కలెక్టర్ బి.సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 30ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం సత్వరమే పరిష్కరించాలని అదికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, జివాకర్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. రశీదుల కోసం తిప్పలు ప్రజావాణిలో అర్జీ సమర్పిస్తే వెంటనే రశీదు ఇవ్వడం లేదు. తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని ఓ వికలాంగుడు దరఖాస్తు చేసుకుని రశీదు ఇచ్చే కౌంటర్ వద్దకు వెళ్లాడు. సాయంత్రం వచ్చి తీసుకోవాలని సంబంధిత అధికారి చెప్పడంతో కంగుతిన్నాడు. వికలాంగుడినైన తాను ఆటో కిరాయికి మాట్లాడుకుని వచ్చానని, మరోసారి రావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా అధికారులు ఆయన మాట వినిపించుకోలేదు. -
● ఉద్యోగం నుంచి తొలగించారు
డీఎస్సీ 2004లో స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్/ప్రత్యేక అవసరాలు) గా ఎంపికై అక్టోబర్ నుంచి జెడ్పీహెచ్ఎస్ కొడిమ్యాలలో విధులు నిర్వర్తించాను. ఏడు నెలల వేతనం కూడా పొందాను. బాలం దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పేరిట వచ్చిన తప్పుడు ఫిర్యాదుతో విద్యాశాఖ అధికారులు నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి నా ఉద్యోగం నాకు ఇప్పించి న్యాయం చేయండి. – ఎం.లక్ష్మినారాయణ, ఉపాధ్యాయుడు, కొడిమ్యాల -
● ఆదేశాలు పట్టడం లేదు.
మా గ్రామ శివారులోని సర్వే నంబర్ 438/ఆ/4లోని రెండెకరాల సొంత భూమిని అప్పటి తహసీల్దార్ చిందం శ్రీనివాస్ తప్పుడు పత్రాలను సృష్టించి ఎల్మల కొమురయ్య తండ్రి ఒక్కపొద్దు పేరిట మార్పిడి చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై అప్పటి కలెక్టర్, హైకోర్టు, సీఎం కార్యాలయాన్ని ఆశ్రయించాను. హైకోర్టు, సీఎం కార్యాలయం అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులను సంప్రదిస్తే తమ వద్ద పత్రాలు లేవంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సారంగాపూర్ తహసీల్దార్ కార్యాలయం అధికారులపై చర్యలు తీసుకోండి. – బాస మహేశ్, రేచపల్లి, సారంగాపూర్ -
ఆర్థిక సాధికారత దిశగా అడుగులు
● మహిళా సంఘాలకు లబ్ధి చేకూరేలా కార్యక్రమాలు ● ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌తో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ● ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల విక్రయం మల్యాల: జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. పంటలు ఉత్పత్తి చేసే రైతులతోపాటు మహిళా సంఘాలకు లబ్ధి చేకూరేలా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేసుకుని ముందుకు కదులుతున్నారు. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి.. వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను వినియోగం చేసుకుంటూ రికవరీలోనూ ముందుంటున్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులతో ఎఫ్‌పీవో గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎరువులు, విత్తనాల విక్రయాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు 92 గ్రూపులు ఏర్పాటు చేశారు. మొక్కజొన్న, నువ్వులు, మామిడి, పప్పుల దినుసుల కొనుగోలు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.1.10 కోట్ల మార్కెటింగ్ జిల్లాలో 2018 నుంచి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు విక్రయించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద మెట్పల్లి, మల్యాలలో ఇన్పుట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. మామిడి, మొక్కజొన్న, బాస్మతి ధాన్యం, స్వీట్లెమన్ మార్కెటింగ్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.1.10కోట్ల విలువైన మార్కెటింగ్ చేశారు. చిన్న, సన్నకారు రైతులకు లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. -
కొండగట్టులో గిరిప్రదక్షిణ
ఘనంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం పెగడపల్లి: మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి జయంతి, కల్యాణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు గుండి వినయ్‌శర్మ కల్యాణ తంతును శాస్త్రోపేతంగా జరిపించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేవారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామచంద్రం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మల్యాల: పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చిలుకూరి బాలాజీ అర్చకులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఉదయం 6గంటల నుంచి దిగువ కొండగట్టు రోడ్డు, ఘాట్‌రోడ్డు వెంట ప్రదక్షిణ చేశారు. సుమారు ఆరు కిలోమీటర్లు ఉన్న వందలాదిమంది భక్తులు జై శ్రీరాం, జైహనుమాన్ అంటూ నామస్మరణ చేశారు. -
ఉపాధ్యాయులకు శిక్షణ
● నేటినుంచి జిల్లాస్థాయి తరగతులు ప్రారంభం ● ఈనెల 17 వరకు కొనసాగింపు ● ఐదు అంశాలపై అవగాహన ● 20నుంచి24 వరకు రెండో స్పెల్ ● 27 నుంచి 31 వరకు మూడో స్పెల్ జగిత్యాల: జిల్లాలోని ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి స్పెల్ ఈనెల 17 వరకు నిర్వహించనున్నారు. రెండో దశ ఈనెల 20 నుంచి24 వరకు.. మూడో దశ 27 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఐదు రోజుల చొప్పున నిర్వహించే ఈ శిక్షణ శిబిరాలు మూడు విడతలు.. మూడువారాలపాటు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. తరగతుల ప్రారంభానికి ముందు సంసిద్ధత సమావేశం నిర్వహించారు. ఎస్ఏ ఇంగ్లిష్, గణితం, సోషల్ సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్స్, ఉర్దూమీడియం, ప్రైమరీ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పాల్గొననున్నారు. మూడు కేంద్రాలో ఏర్పాటు మొదటి విడత శిబిరంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల కు జిల్లాకేంద్రంలోని మానస హైస్కూల్, మండల రిసోర్స్ పర్సన్లకు జీహెచ్ఎస్ పురాణిపేటలో, మ్యా థ్స్ టీచర్లకు జెడ్పీహెచ్ఎస్ ధరూర్ క్యాంప్‌లో మూ డు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి ఒ క్క ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంది. ఒక్కరికి కూ డా మినహాయింపు లేదని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంతో మేలు శిక్షణ శిబిరంలో ఉపాధ్యాయులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా అ ర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ, లెర్నింగ్స్ అవుట్స్ లాంటి అంశాలలో శిబిరం నిర్వహిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు ఎంతో మేలు కలగనుంది. ప్రతి రోజు ఉద యం 9 గంటలలోపు శిబిరం ప్రారంభం కానుంది. ఉపాధ్యాయులందరూ హాజరు కావాలి శిబిరాల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాల్గొనాల్సిందే. ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు. కేంద్రానికి చేరుకుని కోర్సు డైరెక్టర్లకు రిపోర్ట్ చేయాలి. ఈ శిబిరంలో ఆయా కోర్సులపై అంశాలను బోధించనున్నారు. – రాము, డీఈవో శిక్షణలో అంశాలివే.. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణ శిబిరంలో పలు అంశాలను బోధించనున్నారు. ఇందులో కంటెంట్ ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, అర్టిఫిషియల్ ఇంటిలీజెన్సీ, లెర్నింగ్ అవుట్ కామ్స్ నేర్పించనున్నారు. -
పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం
రాయికల్: పల్లె దవాఖానతో నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని అయోద్య, అల్లీపూర్లో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. అయోధ్యలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన రూ.10 లక్షలతో సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. నియోజకవర్గానికి 14 పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మ, సింగిల్ విండో చైర్మన్లు దీటి రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం పాల్గొన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. 13 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ‘పాలిసెట్’కు ఏర్పాట్లు పూర్తిజగిత్యాల: జిల్లాలో మంగళవారం జరిగే పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్, కో–ఆర్డినేటర్ అశోక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3,520 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, జిల్లాకేంద్రంలో ఆరు, కోరుట్లలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి లేదని వివరించారు. ఘనంగా నర్సుల దినోత్సవం జగిత్యాల: నర్సులు సేవలకు ఆదర్శమని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగ్ సిబ్బంది వేతనాలు కొత్త పీఆర్సీలో 50 శాతం ఫిట్మెంట్తో స్థిరీకరణ చేయాలని, వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. సామాజిక సేవకుడు రాజగోపాలాచారి, విశ్వనాథం, ఆస్పత్రి సూపరింటెండెంట్ సుమన్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ కళాశతి, విజయమ్మ, అనిత, సుభాషిణి పాల్గొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలి జగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు. ఈనెల 14న కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్లో నిర్వహించనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదో మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరించారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని లేఖల ద్వారా పేర్కొంటున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు పుల్ల సుచరిత, నార వినోద్ పాల్గొన్నారు. బకాయిలు విడుదల చేయాలిజగిత్యాల: విద్యార్థుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ లతకు వినతిపత్రం అందించా రు. బకాయిలు విడుదల చేయక శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభు త్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ జెడ్పీటీసీ మహేశ్, గంగాధర్, మల్లేశం, శ్రీధర్, చింత గంగాధర్ పాల్గొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం రానీయొద్ద జగిత్యాల: గాంధీనగర్ వద్ద మంచినీళ్ల బావి వద్ద రూ.18 కోట్లతో బ్లాక్‌స్పాట్ రోడ్డు మంజూరైంద ని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. పాత వంతెన తొలగించి డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. అడువాల లక్ష్మణ్, కౌన్సిలర్లు బాలె శంకర్, రాము, ఎన్‌హెచ్ ఈఈ మల్లారెడ్డి, డీఈ గులాబ్‌సింగ్ పాల్గొన్నారు. -
బల్దియాలో కీలక పోస్టులు ఖాళీ
● కుంటుపడుతున్న అభివృద్ధి ● కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రజలు జగిత్యాల: జిల్లా కేంద్రం.. లక్షకు పైగా జనాభా.. 48 వార్డులు.. గ్రేడ్–1 మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. మున్సిపాలిటీలో అతిముఖ్యమైన విభాగం టౌన్‌ప్లానింగ్. ఇందులో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీపీవోగా ఉన్న శ్రీనివాస్ జగిత్యాలతోపాటు ధర్మపురికి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈయనకు డీటీసీపీవో ఇన్చార్జి సైతం ఇచ్చారు. ఈ విభాగంలో టీపీఎస్‌లు ఇద్దరు ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లేరు. టీపీవోలు ముగ్గురు లేరు. చైన్మెన్లు ఆరుగురు ఉండాల్సి ఉండగా.. నలుగురే ఉన్నారు. ఈ విభాగంలో చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో రోడ్లు ఆక్రమించుకున్నా, ఎంక్రోచ్మెంట్లు చేసుకున్నా.. సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించినా వీరే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో టీపీవోపై అధిక భారం ఉండటంతో ఫిర్యాదులు ఇచ్చినా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో అనేకంగా రోడ్లపై ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయి. సెట్‌బ్యాక్ లేకుండా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయి. అలాగే ఇంజినీరింగ్ విభాగంలోనూ ముఖ్యమైన పోస్టు డీఈ లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. మెట్పల్లి డీఈని జగిత్యాల మున్సిపాలిటీ ఇన్చార్జిగా నియమించారు. ఇద్దరు ఏఈలు ఉన్నప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్రా పనులను వీరే పరిశీలించాల్సి ఉంటుంది. నాణ్యత ఉందా..? లేదా..? సీసీరోడ్లు ఏ విధంగా వేస్తున్నారు..? వంటివాటితోపాటు తాగునీటి సరఫరా కూడా వీరే చూడాల్సి ఉంటుంది. అతి ముఖ్యమైన డీఈ పోస్టు లేకపోవడం ఆ శాఖలో ఇబ్బందిగా మారింది. శానిటేషన్ విభాగంలోనూ ఒక్క శానిటరి ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే కొత్త శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చారు. వీరిద్దరూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారే. జవాన్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పారిశుధ్యం చేపట్టడంలో శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తం మున్సిపాలిటీలో నాలుగు జోన్లు ఉండగా.. కొన్ని జోన్లలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. రెవెన్యూ విభాగంలో మ్యూటేషన్లు, అసెస్మెంట్ కాపీలు, పహాణిలు అవసరమై ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. గతంలో ఆర్వోగా పనిచేసిన ఆయన కేసులో ఇరుక్కుని వెళ్లిపోవడంతో ఇన్చార్జిగా మరొకరిని నియమించారు. కానీ ఈ సెక్షన్లో పూర్తిస్థాయి అధికారులు లేరు. ఫలితంగా మ్యూటేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అసెస్మెంట్ల, ఇంటి నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు లేకపోవడంతో సకాలంలో అందడం లేదన్న ఆరోపణలున్నాయి. బల్దియాలో 48 వార్డులు ఉన్నప్పటికీ 33 మంది వార్డు ఆఫీసర్లను మాత్రమే ఇచ్చారు. ఇంకా 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన మేనేజర్ పోస్టు ఉండాల్సి ఉండగా.. ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో అది కూడా ఖాళీగానే ఉంది. బిల్కలెక్టర్లు 9 మందికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. అభివృద్ధికి ఆటంకం బల్దియాలో అతికీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. ఇంతకు పూర్వం ఇన్చార్జి కమిషనర్లు ఉన్నప్పటికీ ఇటీవలే నూతన కమిషనర్‌గా స్పందన బదిలీపై వచ్చారు. కానీ కిందిస్థాయిలో కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఉన్నతాధికారులపై భారం పడటంతోపాటు అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కీలకమైన పోస్టులు భర్తీ చేసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. భర్తీ చేసేలా చర్యలు మున్సిపాలిటీలో కీలకపోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. త్వరలో భర్తీ అయ్యే అవకాశాలుంటాయి. ముఖ్యంగా కొన్ని విభాగాల్లో రెగ్యులర్ వారు లేకపోవడం ఇబ్బందిగా ఉంది. త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్ -
వైద్యులూ.. నిర్లక్ష్యం వద్దు
● ఉత్తర తెలంగాణలో జగిత్యాల కీలకం ● వైద్యపరంగా జిల్లాను బలోపేతం చేస్తాం ● వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ● కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం జగిత్యాల: రోగులకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉత్తర తెలంగాణకు జగిత్యాల జిల్లా కీలకమని, జిల్లాను వైద్యపరంగా బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టరేట్లో ఆదివారం వైద్యశాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఆస్పత్రులకు అవసరమైన వైద్యపరికరాలు సమకూరుస్తామని, జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు ఉన్నాయని, వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వందశాతం ప్రసవాలు చేయాలన్నారు. సిజేరియన్లు చేయడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, సాధారణ ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జిల్లాకేంద్ర ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌కు మరమ్మతు చేయాలని, నూకపల్లి వద్ద రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలని కోరారు. మెడికల్ కళాశాల విద్యార్థులకు మూడు బస్సులు మంజూరు చేయాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఖాద్రి, ఆస్పత్రి సూపరిటెండెంట్ సుమన్‌రావు పాల్గొన్నారు. వాగ్దానాలు దశలవారీగా నెరవేరుస్తాం ధర్మపురి: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యకళాశాల్లో వసతులు కల్పిస్తామని మంత్రి రాజనర్సింహ అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి జయంత్యోత్సవాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రి, హెచ్ఆర్ సిబ్బంది మధ్య అవగాహన లేక నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో అన్ని శాఖల్లో 56వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. విమర్శలు రాకుండా ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో మొదటి విడత 24 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి మాట్లాడుతూ ధర్మపురిలోని మాతాశిశు సంక్షేమ ఆస్పత్రికి రూ.1.50 కోట్లు కేటాయించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరు చేసిన గత ప్రభుత్వం.. సిబ్బందిని నియమించలేదని, వైద్య పరికరాలు అందించలేకపోయిందన్నారు. ట్రామా సెంటర్ కోసం పాశిగామ వద్ద 200 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామన్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఎస్.దినేష్, వేముల రాజు తదితరులున్నారు. ఆస్పత్రుల్లో అసంపూర్తి పనులు పూర్తి చేయించండి కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కోరుట్లలో వంద పడకల ఏరియా ఆసుపత్రి పూర్తయి నెలలు గడుస్తోందని, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, పరికరాలు, సిబ్బందిని సమకూర్చాలని, మెట్పల్లిలో భవనం త్వరితగతిన పూర్తి చేయించాలని కోరారు. కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల విన్నవించారు. రాయికల్ ఆస్పత్రి సమస్యలపై వినతి రాయికల్: పట్టణంలోని ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్ పరిధిలోకి చేర్చినా.. సదుపాయాలు లేవని మంత్రికి పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సరిపడా వైద్యులు లేరని, పరికరాలు సమకూర్చి వసతులు కల్పించాలని కోరారు. పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేశ్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుకు ఊతం
కథలాపూర్(వేములవాడ): ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ మేరకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అమలు చేస్తున్నాయి. రైతులకు భారీగా రాయితీలు ఇచ్చి ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యానవనశాఖ ఆయా పంటల సాగుపై వార్షికి ప్రణాళిక ఖరారు చేసింది. జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయిల్‌పామ్: ఈ ఏడాది 3,750 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఎకరాకు ఏటా రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు సబ్సిడీ అందించనున్నారు. మైక్రో ఇరిగేషన్: ఉద్యానవన పంటలు సాగు చేయడానికి డ్రిప్, స్ప్రింక్లర్లు సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఆయిల్‌పాం సాగుకు 3,750 ఎకరాలు, పసుపు, మిరప, కూరగాయలు పంటల సాగుకు 987 ఎకరాలు, పండ్ల తోటలకు 248 ఎకరాలు లక్ష్యంగా కేటాయించారు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం: ఈ పథకం ద్వారా తీగజాతి కూరగాయలు సాగు చేసుకునే రైతులకు అర ఎకరంలో తక్కువ ఖర్చుతో రూ. లక్షతో శాశ్వత పందిరి నిర్మించుకుంటే ఉద్యానవనశాఖ ద్వారా రూ.50 వేలు సబ్సిడీ ఉంటుంది. జిల్లాకు ఇవి 50 యూనిట్లు కేటాయించారు. జాతీయ వెదురు పథకం: పంట చేనుల గట్ల వెంబడి వెదురు మొక్కలు నాటే రైతులకు రెండేళ్లవరకు నిర్వాహణ ఖర్చు చెల్లిస్తారు. మొదటి సంవత్సరం మొక్కకు రూ.90 చొప్పున, రెండో సంవత్సరం మొ క్కకు రూ.60 చొప్పున చెల్లిస్తారు. జిల్లాకు వెయ్యి మొక్కలు నాటించాలన్నది లక్ష్యం. ఇవే కాకుండా రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం ద్వారా డ్రాగన్ ప్రూట్, మామిడి, బొప్పాయి, నిమ్మ, జామ, దాని మ్మ, బత్తాయి, పసుపు, అల్లం తదితర పంటలు సాగుకు జిల్లాకు 500 యూనిట్లు కేటాయించారు. సబ్సిడీ అందించనున్న ప్రభుత్వం జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో సాగు లక్ష్యం చేరుతామంటున్న అధికారులుఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోండి ఆసక్తిగల రైతులు ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పట్టాదారు పాసుబుక్, ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే కోరుట్ల, జగిత్యాల డివిజన్ ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించాలి. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి -
హనుమాన్ పెద్ద జయంతి పోస్టర్ ఆవిష్కరణ
మల్యాల: కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల పోస్టర్‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈఓ శ్రీకాంత్‌రావు, సూపరింటెండెంట్లు సునీల్‌కుమార్, హరిహరనాథ్, స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవిస్వామి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందించారు. 38 మంది హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీజగిత్యాలక్రైం: జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న 38 మంది హెడ్‌కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారు వారికి కేటాయించిన పోలీస్స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అలాగే ఇతర జిల్లాలో పనిచేస్తున్న 9 మంది హెడ్‌కానిస్టేబుళ్లను జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పవర్ లిఫ్టింగ్‌లో బాలికల సత్తా ధర్మపురి: ఏషియన్ చాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ చాటారు. పేద కుటుంబంలో జన్మించిన వీరిలో ఒకరు బంగారు పతకం, మరొకరు వెండి పతకాలు సాధించి కళాశాల, జిల్లా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ధర్మపురికి చెందిన శ్యాంరావు ఐశ్వర్య, మండలంలోని కమలాపూర్‌కు చెందిన కుమ్మరి పూజిత ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు ఉత్తరఖండ్‌లోని డెహ్రా డూన్లో నిర్వహించే ఏషియన్ చాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఇందులో ఐశ్వర్య 52 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం, కుమ్మరి పూజిత 76 కిలోల బరు వు ఎత్తి సిల్వర్ పతకం సాధించింది. వీరిద్దరూ ప్ర స్తుతం కరీంనగర్లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. -
ఏఎన్ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు
సేవామూర్తులు అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో దేవదూతల్లా నర్సింగ్ ఆఫీసర్లు సకల సేవలందిస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆసుపత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. పైకి గంభీరంగా కనిపించినా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం. – కరీంనగర్‌టౌన్/కోల్‌సిటీ మదర్ థెరిసాను రోల్డ్ మోడల్‌గా తీసుకున్నా. వైద్య సేవలపై ఆసక్తితో ఏఎన్ఎం స్థాయి నుంచి నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సి పాల్ హోదా వరకు చేరుకున్నాను. ఇంటర్ చదివే వయసులోనే ఏఎన్ఎమ్గా ఉద్యోగం వచ్చింది. ఇదే స్ఫూర్తితో జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ తోపాటు సైకాలజీ, పీడియాట్రిక్, ఏంఎస్డబ్ల్యూ కోర్సులు చదివాను. పేషెంట్లకు ఎదురుపడిన నర్సింగ్ ఆఫీసర్లు చక్కని చిరునవ్వుతో పలకరించి వైద్యం అందించాలని దృక్పథం నాలో బలంగా నాటుకుంది. అందుకే 2013 నుంచి 2022 వరకు స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నకాలంలో డిప్యూటేషన్‌పై కరీంనగర్ నర్సింగ్ స్కూల్లో ట్యూటర్‌గా పాఠాలు బోధించాను. 2022లో పదోన్నతిపై సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశా. గతేడాది అక్టోబర్ 30న రామగుండం నర్సింగ్ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రోగులకు వైద్యం అందించడంలో నర్సింగ్ ఆఫీసర్ల సేవలు కీలకమైనవి. – సుశీల, వైస్ ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల, గోదావరిఖని 0000000 0000 000000 000000 000000 0000000000000 0000 000000 000000 000000 000000– వివరాలు 8లో -
తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..
ముస్తాబాద్(సిరిసిల్ల): తన జీవితం ఉన్నంత కాలం పేగు తెంచుకుని పుట్టిన సంతానం కోసం ఎంతటి త్యాగానికై న సిద్ధపడుతుంది అమ్మ. అందుకు నిలువెత్తు సాక్ష్యమే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన అరుట్ల భాగ్యమ్మ. అరుట్ల రాజిరెడ్డి– భాగ్యమ్మ దంపతుల కుమారుడు అరుట్ల మహేశ్‌రెడ్డి వంశపారపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో చేరగా రెండు కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణపాయం నుంచి బయటపడుతాడని వైద్యులు తెలిపారు. మరో ఆలోచన లేకుండా తల్లి భాగ్యమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు 15నెలల క్రితం సర్జరీ చేసి భాగ్యమ్మ ఒక కిడ్నీని మహేశ్‌రెడ్డి వేశారు. అప్పుడు భాగ్యమ్మ కొడుకును కాపాడుకునేందుకు చేసి న త్యాగంతో ఇప్పుడు మహేశ్‌రెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అమ్మ తనకు మరోసారి పునర్జన్మనిచ్చిందని, ఆమె త్యాగం వెలకట్టలేనిదని మహేశ్‌రెడ్డి అంటున్నారు. – మరిన్ని కథనాలు 10లోu తెలియదుఅవును12 48పేరెంట్స్‌ను పట్టించుకోకుంటే కఠిన చర్యలు అవసరమేనా?40వద్దు -
అమ్మే అన్నీ తానై..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన తల్లి నూర్జహాన్. ఐదుగురు కుమారుల్లో గౌష్ ఆలం చిన్నవాడు. ఆయన సోదరుల్లో ఇద్దరు మర్చంట్ నేవీలో, ఒకరు పరిశోధనా శాస్త్రవేత్తగా, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్‌గా స్థిరపడ్డారు. తండ్రి సయ్యద్ ఆలం భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేశారు. 1993లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణించినప్పుడు గౌస్ ఆలం ఏడాది పిల్లవాడు. ఆ సమయంలో వారి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సమాజం ఒంటరి మహిళ ఉద్యోగం చేయడాన్ని అంగీకరించని రోజుల్లో, ఐదుగురు పిల్లల బాధ్యతను తనపై వేసుకుని నూర్జహాన్ ధైర్యంగా ముందుకు సాగారు. భర్త మరణించిన మూడేళ్ల తర్వాత, ఆమె ఢిల్లీ ఆర్డినెన్స్ డిఫెన్స్‌లో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో గౌస్ ఆలం పాఠశాల విద్య సాగింది. తల్లి కోరిక మేరకు యూనిఫాం సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ కలను నిజం చేయడానికి నూర్జహాన్ ఎంతో కష్టపడ్డారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ తమ పిల్లలకు మంచి చదువు చెప్పించారు. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు తాము ఈస్థాయిలో ఉన్నామని గౌస్ ఆలం గర్వంగా చెబుతున్నారు. తల్లి సంపాదనతో పాటు, తండ్రి పెన్షన్, ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాలర్‌షిప్‌ల ద్వారా చదువుకోగలిగామని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి ఒక్కరే మోశారని ఆయన గుర్తుచేసుకున్నారు. తనతల్లి చూపిన ధైర్యానికి, చేసిన త్యాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమెకు హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మ.. రెండక్షరాలు కాదు.. సృష్టికి మూలం.. మానవ పుట్టుకకు సాక్ష్యం.. తన రక్తాన్ని పంచి బిడ్డకు ప్రాణం పోస్తుంది. ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అక్షరాలు నేర్పి లక్షణంగా పెంచుతుంది. బుడిబుడి అడుగులు వేయించి సమాజం వైపు నడిపిస్తుంది. పిల్లలకు చిన్న ప్రమాదం ఏర్పడినా.. తల్లడిల్లిపోతుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ.. జీవితానికి దారి చూపుతుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్ది గొప్పగా భావిస్తుంది. 50 ఏళ్లు వచ్చినా.. తన బిడ్డలు ఇంకా చిన్నారులే అంటూ.. ప్రేమను చాటుతుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మాతృమూర్తులు తమ బిడ్డలకోసం అష్టకష్టాలు పడి జీవితంలో స్థిరపడేలా చేశారు. భర్త దూరమైనా అధైర్య పడకుండా బిడ్డలను జీవితంలో నిలబెట్టిన వారు కొందరైతే.. ఆపదలో ఉన్న పిల్లలకు అవయవాలు దానం చేసినవారు మరికొందరు ఉన్నారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ మాతృమూర్తులపై ప్రత్యేక కథనం!! -
భారత్ ఆర్మీకి సంపూర్ణ మద్దతు
జగిత్యాల: భారత్ ఆర్మీకి కాంగ్రెస్ పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారని పేర్కొన్నారు. మెడికల్, నర్సింగ్ కళాశాల సమస్యలపై సమీక్షిస్తారని, ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలిస్తారని వివరించారు. 30ఏళ్లుగా ఎస్సీల వర్గీకరణ లేక మాదిగలు, ఉప కులాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గయ్య పాల్గొన్నారు. పెగడపల్లిలో వడగండ్ల వాన● నేల రాలిన మామిడి పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలిదుమారంతోపాటు వడగండ్ల వర్షం కురిసింది. మామిడి రైతులకు నష్టాలు చవిచూపింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చి న వరిపైరు నేలకొరిగింది. నష్టపోయిన మామిడితోటలను పరిశీలించి పరిహారం అందేలా చూడాలని రైతులు అధికారులను కోరుతున్నారు. జర్నలిస్టుల సంఘీభావ ర్యాలీజగిత్యాలటౌన్: భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా శనివారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు పాక్ అనేక కుట్రలు చేసిందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియీ జర్నలిస్టులు పాల్గొన్నారు. -
మంత్రిగారూ.. ఓ లుక్కెయరూ..!
● సమస్యల వలయంలో ప్రభుత్వ ఆస్పత్రి ● రోగులకు సరిపడా లేని బెడ్లు ● శిథిలావస్థకు చేరిన భవనం ● పనిచేయని ఆక్సిజన్ ప్లాంటు ● శానిటేషన్ అంతంతే.. ● నేడు జిల్లాకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జగిత్యాల: జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. కోరుట్ల, మెట్‌పల్లితోపాటు పొరుగు జిల్లాలైన మంచిర్యాల, లక్సెట్టిపేట నుంచి వస్తారు. జిల్లాగా ఆవిర్భవించనప్పుడు 100 పడకల ఆస్పత్రిగా కొనసాగేది. జిల్లా అయ్యాక మెడికల్ కళాశాల మంజూరై.. జనరల్ ఆస్పత్రిగా మారింది. 330 బెడ్లతో అప్‌గ్రేడ్ అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సరైన వసతులు లేకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ వెయ్యికి పైగా ఓపీ, 500కు పైగానే ఇన్‌పేషెంట్లు ఉంటారు. వంద పడకలకే సరిపడా నిర్మించిన ఈ భవనంలో స్థలం లేక వరండాలోనే రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ వార్డులో కూడా వసతులు సక్రమంగా లేవు. బాత్రూములు దుర్వాసన వెదజల్లుతున్నాయి. పైప్‌లైన్ తరచూ లీక్ కావడంతో జనరల్ వార్డులోకి నీరు చేరుతోంది. నేడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాకు రానుండడంతో ఈ సమస్యలపై ఓ లుక్కు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ఉన్న లేనట్లే.. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించేందుకు అప్పటి ప్రభుత్వం రూ.80 లక్షలతో ప్లాంట్ ఏర్పాటు చేసింది. 500ఎల్పీఎం సామర్థ్యం గల ఈ ప్లాంట్ సెంట్రలైజేషన్ ద్వారా నేరుగా రోగికి ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. అయితే ఇది తరచూ చెడిపోతుండడం.. టెక్నీషియన్ లేక కొద్దిరోజులు నడవడం.. మరికొన్ని రోజులు నిరుపయోగంగా ఉంటోంది. వైద్యులున్నా లేనట్లే.. ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో గైనకాలజిస్ట్లు, ఆప్తమాలజీ, సీనియర్ రెసిడెన్సీలు చాలామంది వచ్చారు. మౌలిక వసతులు లేక రోగులకు ఆశించిన మేర వైద్యం అందడం లేదు. రాత్రి సమయంలో ప్రమాదాల బారిన పడిన వస్తే స్ట్రెచర్‌పై బంధువులే తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వార్డుబాయ్లే ప్రథమ చికిత్స చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. డ్యూటీలో ఉన్న కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బర్న్ వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేయక అగ్నిప్రమాదాల్లో గాయపడిన వారు వస్తే ఇబ్బందిగా మారింది. దొంగల భయం ఆస్పత్రిలో దొంగల బెడద కూడా ఎక్కువైంది. సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో లేకపోవడం, సెక్యురిటీ లేకపోవడంతో రోగులను చూసేందుకు వచ్చిన బంధువుల సెల్ఫోన్లు, బంగారు గొలుసులు, విలువైన వస్తువులు అపహరణకు గురవుతున్నాయి. పోలీసు అవుట్ పోస్ట్‌లో హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉండాలి. ఇక్కడ మచ్చుకై నా కన్పించడం లేదు. కొత్త భవనం నిర్మాణం ఎప్పుడో... ఆస్పత్రి సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో శిథిలావస్థకు చేరింది. పైప్లైన్లు తరచూ లీక్ అవుతున్నాయి. శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. వర్షకాలంలో జనరల్ వార్డుల్లో పెచ్చులూడి రోగులపై పడుతున్నాయి. ఇటీవల మరమ్మతుల కోసం కలెక్టర్ రూ.29 లక్షల నిధులు మంజూరు చేశారు. వీటిని వినియోగించి ప్రస్తుతం రంగులు వేయడంతోపాటు, డ్రైనేజీ, రెనోవేషన్, ప్యాచ్‌వర్క్‌లు, నూతన బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే నూతన భవనమే నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇరుకు గదుల్లో డయాలసిస్ కేంద్రం ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 45 మంది చికిత్స చేయించుకుంటారు. మూడు షిప్ట్‌ల్లో చేస్తున్నా.. గదులు ఇరుకుగా ఉండడంతో డయాలసిస్ చేయడం కష్టంగా మారింది. అమాత్య ఆలకించు.. జనరల్ ఆస్పత్రిని మంత్రి రాజనర్సింహ ఆదివారం పరిశీలించనున్నారు. ఆస్పత్రికి భవన నిర్మాణం, డ్రైనేజీ సిస్టం, నూతన పరికరాలు ఏర్పాటు చేయాలని రోగులు, బంధువులు కోరుతున్నారు. డయాలసిస్ గదులు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందిగా మారిందని, సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి పర్యటన ఇలా.. మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం రాత్రి ధర్మపురికి చేరుకున్నారు. ఇక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు రోడ్డుమార్గంలో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని పరిశీలించనున్నారు. 12.30 గంటలకు కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు. ధర్మపురి చేరిన మంత్రిధర్మపురి: మంత్రి దామోదర రాజనర్సింహ ధర్మపురి చేరుకున్నారు. స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారలను దర్శించుకుంటారు. మంత్రికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ స్వాగతం పలికారు. నాయకులు ఎస్ దినేష్, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్ ఉన్నారు. -
అమ్మ ప్రేమకు జై..
సాక్షి, పెద్దపల్లి: మన జీవితంలో అన్నిదశల్లో వెంటుండే అమ్మను ప్రేమించేందుకు ఒక్కరోజు తప్పనిసరని యువత భావిస్తోంది. మదర్స్ డే రోజు అమ్మకు గ్రీటింగ్ కార్డు, కేకులు, పూలు కానుకలుగా ఇస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతిక్షణాన్ని అమ్మకు అంకితం చేసినా తక్కువేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అంశాలపై 100 మందిని ప్రశ్నించగా.. చెప్పిన సమాధానాలు ఇవీ.. అవసరం లేదు05తల్లుల పాత్రను గౌరవించడానికి మదర్స్‌డే ముఖ్యమా?5837 -
సైనికులకు అండగా ఉందాం
జగిత్యాల: భారత సైనికులకు ప్రతిఒక్కరూ అండగా ఉందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్‌దే విజయమన్నారు. ఆయన టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న సమయంలో కోదండ రామాలయానికి రూ.10 లక్షలు మంజూరు చేయించిన నిధులతో నిర్మించిన భజన మందిరాన్ని పరిశీలించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ.. రక్షణ సాయుధ బలగాలకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, ఆపరేషన్ సిందూర్‌తో పహెల్గాం మృతులకు నివాళి అర్పించామని పేర్కొన్నారు. నాయకులు ఆనందరావు వొల్లం మల్లేశం, గంగాధర్, దేవేందర్‌నాయక్, శీలం ప్రియాంక, గంగాధర్ పాల్గొన్నారు. -
● అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు.. ● ఐదుగురితో కమిటీ ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జగిత్యాల/పెగడపల్లి: ఉపాధిహామీ పథకంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఊరూర నిఘా కమిటీ వేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉపాధి పథకాల్లో అనేక అక్రమాలు జరగడం, సామాజిక తనిఖీల్లో బయటపడడం సాధారణంగా మారింది. తనిఖీల్లో అవకతవకలు బయటపడుతున్నా రికవరీ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఐదుగురు సభ్యులతో.. ● కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు పారదర్శకంగా నిఘా కమిటీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు. ● సభ్యుల కాలపరిమితి ఆరునెలలు, అనంతరం వేరే కమిటీని ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టినప్పుడు, తీర్మానం చేసేటప్పుడు కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. కూలీలు హాజరవుతున్నారా, చెల్లింపులు తదితర వివరాలను గుర్తించి మండల అధికారులకు నివేదిక అందజేస్తారు. ● అనంతరం జిల్లా అధికారుల నుంచి నివేదిక కలెక్టర్‌కు వెళ్తుంది. ప్రతినెలా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించి గ్రామాల్లో ఏయే పనులు చేపట్టారు అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ● అలాగే సామాజిక తనిఖీల్లో బయటపడ్డ నిధులను రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలతో కొంత మేర అవకతవకలు జరగకుండా అడ్డుకట్ట పడే అవకాశాలుంటాయి. ● గ్రామపంచాయతీల్లో చేపట్టే తీర్మానాల్లో కమిటీ సభ్యులు ఉంటారు. అవకతవకలు జరిగినా, ఉపాధి కూలీలను మోసంచేసినా చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. ● కాగా జిల్లాలో ఉపాధి పథకం ప్రారంభం నుంచి రూ.కోట్లలో రికవరీ కావాల్సి ఉంది. కమిటీల ఏర్పాటుతో అవి వచ్చే అవకాశాలుంటాయి. ● అధికారులకు ఆర్వోఆర్ చట్టం (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) ఆస్తుల జప్తు అధికారాలు ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమిటీల ఏర్పాటుతో ఉపాధి పనులు పకడ్బందీగా జరిగే అవకాశాలున్నాయి. జాబ్ కార్డులకు బ్రేక్ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించడంతో గ్రామాల్లో ఉపాధి పథకం జాబ్ కార్డులకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం తాత్కాలికంగా ఆత్మీయ భరోసా కింద కొత్తకార్డులు జారీ చేయొద్దనే ఆదేశాలతో కొద్దిరోజులుగా కొత్త జాబ్ కార్డులతో పాటు సవరణ, తొలగింపులు నిలిపి వేశారు. కాగా, ఆత్మీయ భరోసా పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుండడంతో ప్రత్యేకంగా వేర్వేరు జాబ్‌కార్డులు జారీ చేయాలన్న డిమాండ్ గ్రామాల్లో పెరిగింది. ప్రస్తుతం సవరణకు అవకాశం లేకపోవడంతో అర్హుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం ఏడాదిలో 20 రోజులు పనిచేసిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొనడంతో గ్రామాల్లో పనులకు వెళ్లే కూలీల సంఖ్య పెరగనుంది.ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్) జాబ్‌కార్డులు : 1.67 లక్షలు మొత్తం కూలీలు : 2.70 లక్షలుజిల్లాలో.. -
అందరికీ చదవదం, రాయడం రావాలి
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): చదువు లేకుంటే వెనుకబడిపోతామని డీఆర్డీవో, మండల ప్రత్యేకాధికారి రఘువరన్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఐకేపీ భవనంలో మహిళ గ్రామైక్య సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అక్షార్యాస్యతలో మనం చాలా వెనుకబడి ఉన్నామని, చదవడం, రాయడం తప్పకుండా రావాలని సూచించారు. ఒక కుటుంబంలో ఒక మహిళ చదువుకోవడం వల్ల క్రమశిక్షణ ఉంటుందని, చదువు వల్ల అనేక లాభాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, సంఘాల సభ్యులు చిన్నచిన్న పరిశ్రమలు పెట్టాలని కోరారు. అనంతరం ఇబ్రహీంపట్నం మహిళా సంఘం ఆధ్వర్యంలో కందిపప్పు అమ్మకాలను ప్రారంభించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో మధు, ఎపీఎం శంకర్, మెట్పల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, మహిళ సమైక్య అధ్యక్షురాలు రాధిక పాల్గొన్నారు. -
భగీరథ.. కొరవడిన భద్రత
● పంపుహౌజ్ చుట్టూ ప్రహరీ ఏర్పాటులో నిర్లక్ష్యం ● పిచ్చిమొక్కలు, లీకేజీ నీటితో అధ్వానంగా పరిసరాలు ● వసతులు లేక సిబ్బందికి ఇబ్బందులుమెట్పల్లి(కోరుట్ల): పట్టణంలో మిషన్ భగీరథ నీటి విషయంలో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. రోజూ వేలాది ఇండ్లకు ఈ నీటిని సరఫరా చేస్తున్న పంపుహౌజ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, దీనిని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో భగీరథ నీటి వినియోగంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం 90లక్షల లీటర్ల నీటి సరఫరా ● పట్టణంలోని మండల పరిషత్‌కు చెందిన స్థలంలో మిషన్ భగీరథ పంపుహౌజ్ నిర్మించారు. ఇందులో భాగంగా అక్కడ ఒక సంపు, రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ● డబ్బా రిజర్వాయర్ నుంచి నేరుగా ఇక్కడి సంప్‌లోకి నీటిని పంపించి, అక్కడి నుంచి ట్యాంకులకు, ఆ తర్వాత వాటి ద్వారా ఇండ్లలోని నల్లాలకు సరఫరా చేస్తున్నారు. ● స్థానికంగా 26వార్డులు ఉండగా, వీటిలో పది వేలకు పైగా నల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం రోజూ 90లక్షల లీటర్ల నీటిని నల్లాల ద్వారా అందిస్తున్నారు. ● అయితే ఇంత పెద్ద మొత్తంలో నీటిని సరఫరా చేసే పంపుహౌజ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నో సమస్యలు.. ● పంపుహౌజ్ రక్షణ దృష్ట్యా ఇతరులు లోపలికి చొరబడకుండా ఉండడానికి చుట్టూ ప్రహరీ నిర్మించాలి. కానీ ఇది లేకపోవడం వల్ల పలువురు బస్‌స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి దీని మీదుగానే నడుచుకుంటూ వెళ్తున్నారు. ● అలాగే పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం వల్ల పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తతో నిండిపోయాయి. ఓవర్ హెడ్ ట్యాంకుల కింద పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో లీకేజీ నీటితో పాటు వరద నీరు ట్యాంకుల కిందకు వచ్చి చేరుతోంది. ● వీటివల్ల దోమలు వ్యాప్తి చెందడమే కాకుండా పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ● నీటి సరఫరాను పర్యవేక్షించడానికి అక్కడ పంపు ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారికి గదితో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల తీరుపై విమర్శలు ● తరుచూ పంపుహౌజ్ పరిశీలనకు వచ్చే ఇంజినీరింగ్ విభాగం అధికారులు అక్కడ వెంటనే పరిష్కరించే అవకాశమున్న సమస్యలపై దష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాలను మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయించవచ్చు. కానీ, అలా చేయడం లేదు. ఒక ఓవర్ హెడ్ ట్యాంకుకు చాలా రోజుల క్రితం లీకేజీలు ఏర్పడి భారీగా నీరు వృథాగా పోతుంది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం చూపుతున్నారు.రూ.50 లక్షలు కేటాయించాం పంపుహౌజ్ వద్ద పలు పనులు చేపట్టడం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50లక్షలు కేటాయించాం. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అనుమతి రాగానే ప్రక్రియను మొదలుపెడుతాం. ట్యాంకు లీకేజీలకు మరమ్మతు చేపట్టాలంటే రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వేసవి తర్వాత ఆ పనులు చేయాలని నిర్ణయించాం. – నాగేశ్వర్రావు, మున్సిపల్ డీఈఈ -
ఆత్మస్థైర్యం కోలు‘పోతున్నారు’
జగిత్యాలక్రైం: కొంతకాలంగా జిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. కారణమేదైనా క్షణికావేశంలో పాణం తీసుకుంటున్నారు. జిల్లాలో 2024లో 217 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 106 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక స్థితి సరిగా లేక, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, గృహహింస, చదువులో విఫలమవడం, ప్రేమ వైఫల్యం, సెల్‌ఫోన్ కొనివ్వలేదని, డబ్బులివ్వడం లేదని తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు నెలల్లో 106 మంది.. ● జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 106 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ● బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణం కడుపునొప్పి, అనారోగ్య సమస్యలు అని మాత్రమే పోలీసు రికార్డులకెక్కుతున్నాయి. ● ఆయువు తీసుకుంటున్న వారిలో ఎక్కువగా 15–40 ఏళ్ల వయస్సులోపు వారే ఉంటున్నారు. ఆత్మహత్యలను మానవీయ కోణంలో చూసి ప్రజల్లో స్థైర్యాన్ని నింపాల్సిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ● గతంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలుండటంతో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మానసిక వేదనకు గురైతే కుటుంబ పెద్దలు వారిని సముదాయించి పరిష్కారం చూపేవారు. ● ప్రస్తుతం ఒంటరి కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే, తమ స్థితికి మించిన కోరికలు ఎక్కువ అవడం, వాటిని తీర్చుకోలే మనోవేదనకు గురువుతున్నారు. ● తమ సామర్థ్యాన్ని మించి అప్పు చేయడం కూడా ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కనబడుతోంది. ఒక్క క్షణం మీ కోసం ఆత్మహత్య చేసుకోవాలనే వారు ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచించాలి. సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని అన్వేశిస్తూ ముందుకెళ్లాలి. ఒకసారి ఎందులోనైనా ఓడిన తర్వాత ఎప్పుడు ఓడిపోతామనే నిరాశావాదాన్ని వదిలిపెట్టి, ఆశావాదంతో ముందుకు కదలాలి. సమస్యలు ఎప్పుడు రావు కదా, అవి వచ్చినప్పుడు కుంగిపోవద్దు. వాటి నుంచి బయట పడేలా చూసుకోవాలి. వివిధ కారణాలతో పెరుగుతున్న ఆత్మహత్యలు జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 106 మంది బలవన్మరణం ‘ఏప్రిల్ 29న మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రవీందర్‌రెడ్డి (40) పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు’. ‘బీటెక్ ఫస్టియర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని జగిత్యాల పట్టణం హౌసింగ్‌బోర్డు ప్రాంతానికి చెందిన కన్నవేని సంజనరెడ్డి (20) మే 8న ఉరేసుకుంది’. ‘జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్నలక్ష్మి (26) అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఏప్రిల్ 24న ఉరేసుకుంది’. ‘జగిత్యాల రూరల్ మండలం చల్గల్కు చెందిన జంగ పూజ (20) నీట్లో ర్యాంక్ రాదని ఈ నెల 5న ఉరేసుకుంది.’ జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లికి చెందిన పొరండ్ల సంతోష్‌రెడ్డి (25) ‘ఏప్రిల్ 28న అప్పుల బాధతో పురుగుల మందుతాగి చనిపోయాడు’. ‘మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ సాంబర్ జగదీశ్ (44) మూడేళ్లుగా తీవ్రమైన మెడనోప్పితో బాధపడుతూ ఏప్రిల్ 25న ఆత్మహత్యకు పాల్పడ్డాడు’. -
ఆపరేషన్ సిందూర్‌కు సలాం
ధర్మపురి: పహల్గాంలో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యకు ఫలితంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం తీసుకున్న చర్యకు కాంగ్రెస్ అగ్ర నాయకులు సలాం కొట్టారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీకి జనం తరలివచ్చారు. స్థానిక నందీ కూడలి నుంచి గాంధీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా విప్ మాట్లాడుతూ, దేశ రక్షణ విషయంలో కేంద్రానికి పూర్తి మద్దతు ఉంటుందని, రానున్న రోజుల్లో మన దేశం వైపు పాకిస్థాన్ కన్నెత్తి చూడకుండా కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శోభారాణి, నాయకులు ఎస్.దినేశ్, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, గాజు భాస్కర్, నాయకులు తదితరులున్నారు. క్షయ బాధితులను గుర్తించాలిజగిత్యాల: క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, పొగ తాగేవారు, ఆల్కాహాల్ తాగడం, పొగాకు తినడం, డయాబెటిస్ ఉన్నవారిని గుర్తించి వివరాలు అందించాలన్నారు. 100 రోజుల్లో వారందరినీ స్క్రీనింగ్ చేసి పరీక్షలకు పంపి వ్యాధిగ్రస్తులుగా తేలితే చికిత్స అందించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, అర్చన, రవీందర్, సత్యనారాయణ, భూమేశ్వర్ పాల్గొన్నారు. పాక్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాలిజగిత్యాలటౌన్: కశ్మీర్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలపై పాక్ విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడాన్ని ప్రపంచదేశాలు ఖండించాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడం అభినందనీయమన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేమని అంటూనే తన భూభాగంలో ఉగ్రల శిబిరాలను ప్రోత్సహిస్తూ మన దేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. భారత్‌పై దాడులను సహించేది లేదని, దేశ సార్వభౌమత్వం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఎటువంటి యుద్ధ చర్యలకై నా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. -
ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలి
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. వయస్సును బట్టి తరగతి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఏ తరగతిలో చేర్చాలన్న నిర్ణయాధికారం ప్రధానోపాధ్యాయునికి ఉండేలా అవకాశం కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహణ బాధ్యతలను ప్రధానోపాధ్యాయుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పర్చేలా చూడాలన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక లావాదేవీలను వెంటనే విడుదల చేయాలని, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్, మహిపాల్‌రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు
జగిత్యాల: నిజాన్ని నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’ దినపత్రికను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ ని జర్నలిస్టులు అన్నారు. శుక్రవారం జగిత్యాలలో ర్యాలీ నిర్వహించి తహసీల్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విజయవాడలోని ఎడిటర్ ధనంజ యరెడ్డి ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేయ డం సమంజసం కాదన్నారు. రాజకీయ కక్షతోనే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నా రు. పోలీసుల వేధింపులు ఆపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు కె.శశిధర్, చంద్రశేఖర్, కుమార్, మల్లారెడ్డి, సత్యనారాయణగౌడ్, శ్రీకర్, సుబ్బారెడ్డి, హైదర్, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, మోసిత్, శ్రీను, సత్యం, హరికృష్ణ, శేఖర్, బండ స్వామి, షఫీ, ఆనంద్, రంజిత్, ఆయా సంఘాల నాయకులు వొల్లం మల్లేశం, మహేశ్ పాల్గొన్నారు. -
మానసిక ఒత్తిడితోనే..
చాలా మంది యువకులు మానసిక ఒత్తిడి, వృద్ధులు వయోభారంతో, మరికొంత మంది కుటుంబ సమస్యలు, చెడు వ్యసనాలతో క్షణికావేశంలో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడే మానసిక ఒత్తిడికి గురవుతాం. సమస్యలను ఎదుర్కోవాలి. ఆత్మహత్య చేసుకోవడం సరికాదు. – డాక్టర్ సాయికృష్ణ, మానసిక వైద్య నిపుణుడు, జగిత్యాలఆత్మస్థైర్యం కోల్పోవద్దు చాలా మంది ఆత్మస్థైర్యం కోల్పోయి చిన్నచిన్న సమస్యలకు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఆత్మహత్యల నివారణ కోసం గ్రామాల్లో ప్రజలకు పోలీసు కళాబృందాలతో అవగాహన కల్పించాం. సామాజిక సేవకులు కూడా అవగాహన కల్పించాలి. – అశోక్‌కుమార్, ఎస్పీ -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలరూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ మండలం పొలాస, బాలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం రవాణాలో వాహనాల కొరత, హమాలీల సమ స్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల రూ రల్ తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు. -
ఆహ్లాదం ఎండమావే..
● పల్లె, బృహత్‌ప్రకృతి వనాలపై నిర్లక్ష్యం ● ప్రకృతి వనాల్లో ఎండిపోతున్న చెట్లు ● అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారిన వైనం ● లక్షల ప్రజాధనం వృథాపై విమర్శలుమెట్పల్లి మండలంలోని మరో గ్రామంలో ప్రకృతి వనానికి మొత్తానికే తాళం వేసి ఉంచుతున్నారు. నిర్వహణలేక ప్రకృతి వనంలోకి వెళ్లేందుకు కొందరు రెండు మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ప్రకృతి వనంలోకి ఎక్కువ మంది వస్తున్నారని, అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఇవేకాదు.. చాలా ప్రాంతాల్లో ప్రకృతి వనాల్లోనూ ఇదే పరిస్థితి.మెట్‌పల్లిరూరల్: ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పల్లె, బృహత్ ప్రకృతి వనాలు పలు చోట్ల ఎండిపోతున్నాయి. పంచాయతీల నిర్వహణ లోపం, నిర్లక్ష్యం వెరసి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. లక్షల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ప్రజలకు పెద్దగా ఉపయోగపడకపోగా.. కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వనాలు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయి. వీటిని గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయడం కూడా సమస్యగా మారింది. ఇక్కడి మండల స్థాయి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. చెట్లు ఎండిపోకుండా ఉండేలా చూసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి పదేపదే సూచించినప్పటికీ సిబ్బంది పెడచెవిన పెడుతున్నారని తెలిసింది. కొన్నింటిపై దృష్టి.. మరికొన్నింటిపై నిర్లక్ష్యం మెట్పల్లి మండలంలో 23 పల్లె ప్రకృతి వనాలు, నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటిలో నీడచిచ్చే పలు రకాల అటవీ జాతి మొక్కలు, పూల మొక్కలు, మరికొన్ని రకాల మొక్కలు నాటించారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదం పంచుతుండగా.. మిగతా చోట్ల నామమాత్రంగానే ఉండిపోయాయి. పలు గ్రామాల్లోని ప్రకృతి వనాల్లో చెట్లకు నిత్యం నీటిని పడుతున్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తీసివేయిస్తున్నారు. ఎండిపోయిన చెట్ల స్థానంలో కొత్త వాటిని నాటుతున్నారు. కానీ మరి కొన్ని వాటి విషయంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎండిన చెట్లు.. పరికరాలకు తుప్పు గ్రామాల్లోని కొన్ని ప్రకృతి వనాల్లో వాడిన మొక్కలు, ఎండిన చెట్లే దర్శనమిస్తున్నాయి. గడ్డి పెరిగిపోయింది. నడకదారి ఎండిన ఆకులతో నిండిపోయింది. చిన్నపిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట పరికరాలను ఏర్పాటు చేసినా అవి ఆడుకోవడానికి వీలు లేకుండా తుప్పుపట్టిపోతున్నాయి. వాటి మధ్య పిచ్చిమొక్కలు పెరిగాయి. కూర్చునేందుకు వేసిన బెంచీలు సైతం దుమ్ము,ధూళితో ఉన్నాయి. అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా.. కొన్ని ప్రాంతాల్లోని వనాలు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడే మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం, ఇతర కార్యకలాపాలు తరచూ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. గేట్లకు తాళాలు వేయ డం లేదని, వీటివైపు కన్నైత్తెనా చూడడం లేదని అంటున్నారు. లక్షలు వెచ్చించిన వాటిపై ఇంత నిర్లక్ష్యం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం బీఆర్ఎస్ హయాంలో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి, బృహత్వనాల విషయంలో కార్యదర్శులు నిర్లక్ష్యం చూపడంపై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన మండలస్థాయి సమీక్ష సమావేశంలో పల్లెప్రకృతి వనాలు అధ్వానంగా మారాయని, వాటిని ఎందుకు పట్టించుకోవడంలేదని కార్యదర్శులను ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు నీరు అందించాలని చెట్లు ఎండిపోకుండా చూడాలని సూచించారు. కొద్దిరోజుల తర్వాత గ్రామాల్లో పర్యటిస్తానని ఆ సమయంలో పల్లెప్రకృతి వనాలను పరిశీలిస్తానని హెచ్చరించారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది మెట్పల్లి మండలంలోని ఓ గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ఇది పూర్తిగా అధ్వానంగా మారింది. గ్రామానికి దూరంగా ఉండడంతో అసాంఘిక కార్యకలపాలకు నెలవుగా మారింది. నిర్వహణ పట్టించుకోకపోగా.. గేటుకు తాళం వేయడంలేదు. గేటు ఎప్పుడూ తెరిచే ఉండడంతో కొందరికీ పలు కార్యకలపాలకు అడ్డాగా మారిందని అక్కడి ప్రాంత ప్రజలు చెబుతున్నారు.ఎప్పటికప్పుడు నీరు పడుతున్నం ప్రకృతి వనాల్లో చెట్లు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది నీరు పడుతున్నారు. చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా అక్కడక్కడ చెట్లు ఎండిపోతున్నాయి. పల్లెప్రకృతి వనాల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని కార్యదర్శులకు సూచనలు చేశాం. – మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో, మెట్పల్లి -
మాతృమరణాలు తగ్గించాలి
● అడిషనల్ కలెక్టర్ లత జగిత్యాల: జిల్లాలో మాతృమరణాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. గురువారం వైద్యులతో సమావేశమయ్యారు. గర్భవతిగా నమోదు చేసినప్పటి నుంచి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలని, హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే గైనకాలజిస్ట్‌లకు చూపించాలని పేర్కొన్నారు. మాతాశిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ గర్భం దాల్చినప్పుటి నుంచే అన్నిరకాల పరీక్షలు, 2డీ ఈకో స్కానింగ్ చేయిస్తే వ్యాధులను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుమన్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎండీ.సమియోద్దీన్, డాక్టర్ శ్రీనివాస్, పిల్లల వైద్య నిపుణులు పూర్ణచందర్, వైద్యులు పద్మిని, సాయిసుధ, సుదీర్, సతీశ్, అంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఐదో స్థానం జగిత్యాల: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జిల్లాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కొనసాగిస్తున్నామని, ఆలస్యంగా ప్రారంభమైనా రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉన్నామని అదనపు కలెక్టర్ లత అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 428 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 26,557 మంది రైతుల నుంచి 19,17,940 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. 41 మంది రైతుల నుంచి సన్నరకం ధాన్యం 3,150 క్వింటాళ్లు కొన్నామన్నారు. రైతుల ఖాతాల్లో రూ.303.57కోట్లు జమ చేశామన్నారు. కేంద్రాలు, రైస్‌మిల్లుల్లో సరిపడా హమాలీలను సమకూర్చుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఐదు కేజీబీవీల్లో కొత్త కోర్సులు
● అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ● ఈ విద్యాసంవత్సరం నుంచి అమలుకథలాపూర్: జిల్లాలోని ఐదు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు కొన్ని విద్యాలయాల్లో ఇంటర్, మరికొన్నిటిలో పదోతరగతి వరకు మాత్రమే నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న భవనాలు, వసతులను బట్టి ఐదు విద్యాలయాలను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్ కోర్సులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో ఏడు కేజీబీవీల్లో ఇంటర్ కోర్సులు నిర్వహిస్తున్నారు. తాజాగా మరో ఐదింటికి అనుమతి రావడంతో 12 కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందనుంది. కథలాపూర్, ధర్మపురి, మల్యాల, మేడిపల్లి, మల్లాపూర్‌లోని కేజీబీవీల్లో ఇంటర్ కోర్సులకు అనుమతి వచ్చింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సు నిర్వహించనున్నారు. ఒక్కో కేజీబీవీలో 40 సీట్లకు మాత్రమే అనుమతి వచ్చినట్లు జీసీడీవో అనుపమ వివరించారు. -
కదం తొక్కిన ‘సాక్షి’ జర్నలిస్టులు
గోదావరిఖని బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై నిరసన తెలుపుతున్న పాత్రికేయులు గోదావరిఖని: సాక్షి ఎడిటర్ ధనంజయ్‌రెడ్డి నివాసంపై ఏపీ పోలీసుల దాడిని నిరసిస్తూ పాత్రికేయులు స్థానిక బస్టాండ్ వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ఉమ్మడి జిల్లా బ్యూరో భాషబోయిన అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందన్నారు. శ్రీసాక్షిశ్రీ యాజమాన్యంపై కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. రాస్తారోకోలో జర్నలిస్టులు గుడ్ల శ్రీనివాస్, కాల్వ చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కూరి శ్రీనివాస్, కీర్తి రమేశ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. -
భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు పెడితే చర్యలు
● ఎస్పీ అశోక్‌కుమార్ జగిత్యాలక్రైం: ప్రజలకు ఇబ్బంది కలిగించేలా.. కాలుష్యం వెదజల్లేలా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు వాడితే చర్యలు తప్పవని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా స్వాధీనం చేసుకున్న బుల్లెట్ వాహనాలకు అమర్చిన 130 సైలెన్సర్లను గురువారం రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. శబ్దం చేసే సైలెన్సర్లను వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ వేణుగోపాల్, ఐటీ కోర్ సీఐ రఫీక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు. నృసింహుని జయంతికి ఏర్పాట్లుసారంగాపూర్: బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 11న నిర్వహించే జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్, అర్చకులు చిన్న సంతోష్, మధుకుమార్ తెలిపారు. -
‘రెసిడెన్షియల్’కు శంకుస్థాపన
గొల్లపల్లి:తాను ఎమ్మెల్యే కాకముందు అద్డె భవనాల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు చూశానని, అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలకు నిధులు మంజూరు చేయించానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఇకనుంచి విద్యార్థుల కష్టాలు తీరినట్లేనని తెలిపారు. మండల కేంద్రంలో రూ.17కోట్లతో నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పక్కా భవనం తీసుకొచ్చానన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి మగ్గిడిలో ఉన్న స్కూల్‌ను తరలిస్తామని తెలిపారు. యువతకు క్రీడా ప్రాంగణం కోసం 735 సర్వేనంబర్‌లోగల స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరందన్, ఆర్ఐ మహిపాల్, పార్టీ మండల అధ్యక్షుడు నిషాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. కూలీ డబ్బుల పంపిణీధర్మపురి:శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాత్కాలిక లేబర్లకు చెల్లించాల్సిన రూ.4,92,800 విడుదలయ్యాయి. రెండేళ్లుగా లేబర్లకు మున్సిపల్ అధికారులు చెల్లించకపోవడంతో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు విడుదల చేయించారు. ఈ మేరకు గురువారం కమిషనర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. 2023లో జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాలకు మున్సిపల్ ఆధ్వర్యంలో ధర్మపురితోపాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి తాత్కాలిక లేబర్లను తీసుకొచ్చి 11రోజుల పాటు పనులు చేయించారు. విప్ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా.. 150 మందికి రూ.4,92,800 మంజూరు చేశారు. వాటిని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ భర్త జక్కు రవీందర్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. -
38.0/27.0
గరిష్టం/కనిష్టంఫీజు కడతరా..? కట్టరా..? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వ జాప్యం కారణంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు, శాతవాహన యూనివర్సిటీకి అంతరం పెరుగుతోంది.కొండగట్టులో భక్తుల సందడి కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 9వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం వేడిగాలులు కొనసాగుతాయి. –10లోu -
తలసేమియా వ్యాధి అరికట్టేందుకు చర్యలు
జగిత్యాల: తలసేమియా వ్యాధిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్త పరీక్షలు చేస్తున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీలోపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, పెళ్లికి ముందు సికెల్‌సెల్ ఎనిమియాకు సంబంధించిన వైద్య పరీక్షలు చేసుకుని వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ప్రతి 100 మందిలో ఐదుగురికి తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా వ్యాధి బాధితులు ఉన్నారని, వ్యాధి ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ చేసుకుంటే పుట్టబోయే పిల్లలు 25శాతం వ్యాధిగ్రస్తులు అవుతారని వివరించారు. అలాంటి వారికి ప్రతి 15రోజులకోసారి రక్తం ఎక్కించాలని, ఖరీదైన వైద్యం చేయించాల్సి వస్తుందన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వ్యాధి మూడు దశల్లో కనిపిస్తుందని, మేజర్ పిల్లల్లో హిమోగ్లోబిన్ తగ్గిన వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకోసారి రక్తం అవసరం ఉంటుందని, జ్వరం రావడం, ఆకలి తగ్గడం, కామెర్లు, మూత్రం పసుపు రంగులో రావడం, ఇలా రకరకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. మొదటి నుంచే పరీక్షలు చేసుకుని వ్యాధిని అరికట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు సమియోద్దీన్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక క్షేత్రం.. శ్రీమానసాదేవి ఆలయం
గన్నేరువరం: మండలంలోని ఖాసీంపేటలో ఉద్భవించిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీమానసాదేవి ఆలయం సప్తమ వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఆలయం దక్షిణభారతదేశంలో మొదటిదిగా ప్రసిద్ధి చెందింది. 108 శక్తి పీఠాల్లో 6వ శక్తిపీఠం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి వెళ్లే రహదారిలో కరీంనగర్–సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని బద్దం చిన్న నర్సింహారెడ్డి వ్యవసాయ పొలంలో 2015 జూన్‌లో అమ్మవారి విగ్రహం వెలిసింది. గ్రామస్తులు భూ యజమానితో కలిసి తాత్కాలికంగా ఆలయాన్ని ఏర్పాటు చేసి అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అప్పటినుంచి పూజలందుకుంటున్న మానసాదేవి అమ్మవారికి 2018లో ఆలయాన్ని పూర్తి చేసి అదే ఏడాది ఏప్రిల్ 26 నుంచి 29 వరకు విగ్రహ ప్రతిష్టామహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 108 శివలింగ నాగ ప్రతిమల ధర్మగుండం, 12 ఫీట్ల భారీ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ఆలయానికి భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నారు. ఇక్కడ ప్రతి మంగళ, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 54 కిలోలతో ప్రత్యేక అభిషేకాలు మూడు రోజులపాటు జరిగే ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 8న 54 కిలోల పసుపుతో అమ్మవారికి హరిద్రా అభిషేకం, 54 కిలోల కుంకుమతో అపురూప లక్ష్మీకి కుంకుమాభిషేకం నిర్వహించనున్నారు. నేటి నుంచి సప్తమ వార్షికోత్సవం మూడు జిల్లాల సరిహద్దుల్లో ఆలయం దక్షిణ భారతదేశంలోనే మొదటిది మూడురోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాట్లు పూర్తి శ్రీమానసాదేవి సప్తమ వార్షికోత్సవానికి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది, కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నుంచి గుండ్లపల్లి మీదుగా, వెంకట్రావుపల్లి, పొత్తూరు మీదుగా బస్సు సౌకర్యం ఉంది. – ఏలేటి చంద్రారెడ్డి, మానసాదేవి ఆలయ చైర్మన్ మూడు రోజులు వేడుకలు అమ్మవారి ఆలయ సప్తమ వార్షికోత్సవాలు ఈనెల 8 నుంచి పదో తేదీ వరకు జరుగుతాయి. ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, మానసాదేవి లక్ష్మీపుష్పార్చన కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదం, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. – పెండ్యాల అమర్నాథ్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు -
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్‌కు భారత్ సైన్యం తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఈ చర్య మనదేశ పౌరులకు భరోసా కల్పించింది. లౌకిక దేశమని, ప్రజలందరూ సమానమేనని చాటిచెప్పింది. ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ మరోమారు భారత సత్తా చాటడానికి సిద్ధమని సంకేతం ఇచ్చింది. – కొమురోజు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, మంథని సైన్యానికి అండగా నిలుద్దాం పహల్గాం దాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూరం చేపట్టిన భా రత సైన్యం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మనదేశ ప్రజలంతా గర్వపడాల్సిన రోజు ఇది. టెర్రరిస్టులు మరోసారి మనదేశంపై దాడిచేస్తే ఎలా ఉంటుందోననే భయాన్ని చూపించారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దాడులు చేసిన భారత సైన్యానికి అందరం అండగా నిలవాలి. –బెజ్జంకి డిగంబర్, విద్యార్థి నాయకుడు, మంథని -
చర్చి నిర్మాణ పనులు అడ్డగింత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో నిర్మిస్తున్న చర్చి పనులను బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వాదోపవాదనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చించారు. బీజేపీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, చుట్టుపక్కల పొలాలు ఉన్నాయని, ఆ ప్రాంతంలో చర్చి నిర్మించొద్దని రైతులు గ్రామపంచాయతీ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయం తెలిసి తాము పనులు అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు దారితీయడంలో పోలీసులు సముదాయించారు. అక్కడి నుంచే తహసీల్దార్, ఎంపీడీవోలతో ఫోన్లో బీజేపీ నాయకులు మాట్లాడి.. చర్చి నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. నాయకులు నంది నరేశ్, మారవేణి రంజిత్‌కుమార్, దాసరి గణేశ్, గ్రామస్తులు ఉన్నారు. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
వేములవాడ: మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. పట్టణంలోని నటరాజ్ విగ్రహం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో అకస్మాత్తుగా వచ్చి టిఫిన్ సెంటర్‌పై రాళ్లు విసిరాడు. వంట పనిముట్లను చిందరవందరగా పడేశాడు. దీంతో అక్కడ టిఫిన్ చేస్తున్న కస్టమర్లు పరుగులు తీశారు. టిఫిన్ సెంటర్ నిర్వహుకుడు శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డాడు. గమనించిన టిఫిన్ సెంటర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఇతరులపై దాడి చేయకుండా అడ్డుకున్నారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు అప్పగించారు. సీఐల బదిలీకరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రెండు సర్కిళ్ల సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తిమ్మాపూర్ సీఐగా జి.సదన్‌కుమార్ నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తున్న కె.స్వామి ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయనున్నారు. హుజూరాబాద్ సీఐగా కరుణాకర్ బదిలీకాగా.. అక్కడ పనిచేస్తున్న గుర్రం తిరుమల్ ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కోర్టు భవనాలకు ముహూర్తం
● సిరిసిల్ల, పెద్దపల్లి సహా 12 జిల్లాలకు కొత్త కాంప్లెక్స్‌లు ● పోక్సో, ఫ్యామిలీ కోర్టుల కోసం బిల్డింగులు ● ‘న్యాయ నిర్మాణ్’ ప్రణాళిక కింద నిర్మాణాలు ● రూ.691 కోట్లతో టెండర్లు పిలిచిన ఆర్అండ్బీ ● ఉమ్మడి జిల్లాకు రూ.118 కోట్లు ● నాలుగంతస్తులు.. 2.18 లక్షల చదరపు అడుగుల స్పేస్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి ముహూర్తం సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పలు కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల కొరత ఉన్న విషయం తె లిసిందే. ఈ నేపథ్యంలో న్యాయనిర్మాణ ప్రణాళిక కింద మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి , యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, వికారాబాద్ మొత్తం 12 జిల్లాలో ఫ్యామిలీ, పోక్సో కోర్టుల భవన సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ, యాదాద్రి సర్కిల్ వారు పర్యవేక్షించనున్నారు. గత వారంలో టెండర్లు పిలవగా.. టె ండర్లకు మంచి ఆదరణ ఉందని సమాచారం. పలు పేరు మోసిన సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలు భవన ని ర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెల్సింది. ఈనెల రెండో వారంలో రూ.691.18 కోట్లతో టెండర్లు ఖ రారు కానున్నాయి, ఇందులో పెద్దపల్లి, సిరిసిల్ల కో సం దాదాపు రూ.118 కోట్లు కేటాయించనున్నారు. 24 నెలల్లో పూర్తి.. ఈ భవనాలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రతీ భవనంలో ఒక బేస్మెంట్ (88 కార్లు, 62 బైకులు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ లాట్), గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అనంతరం ఈ భవన సముదాయాల్లో పోక్సో, ఫ్యామిలీ కోర్టులు నడవనున్నాయి. ప్రతీ ఫ్లోర్లో 43వేల చదరపు అడుగుల నుంచి 44వేల చదరపు అడుగుల చొప్పున మొత్తం 2,18, 743.58 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా భవనాలు సిద్ధం చేస్తారు. మే రెండో వారంలో టెండర్లు ఖరారు కాగానే నిర్మాణాలు మొదలవుతాయి. నిర్మాణాలుమొదలైన 24 నెలల్లో అంటే 2027 నాటికి ఈ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.691.18 కోట్లతో.. మొత్తం రూ.691.18 కోట్ల బడ్జెట్‌తో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనం తూర్పు అభిముఖ ంగా విశాలంగా, విరివిగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాజ సం ఉట్టిపడేలా భవనం మధ్యలో భారీ ఎలివేషన్‌తో ముఖద్వారం, దానికి ఇరువైపులా రెండు విశాలమైన భుజాలతో ఆర్ట్స్ కాలేజీ తరహాలో భవనం స్కెచ్ కూడా ఖరారైంది. ప్రతీ భవనం సివిల్, ఎలక్ట్రిక్, సానిటరీ– వాటర్ వర్క్స్ కోసం దాదాపు రూ. 53 కోట్ల నుంచి రూ.59 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో సిరిసిల్ల కోర్టు కాంప్లెక్స్‌కు రూ. 59.92కోట్లు, పెద్దపల్లి కోర్టు భవన సముదాయాల కు రూ.58.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో జీఎస్టీ కలపలేదు. మొత్తం రూ.691 కోట్లలో రూ. 563 కోట్లు సివిల్ పనులకు, రూ.563.70 కోట్లు శానిటరీ, వాటర్ వర్క్స్ కోసం రూ.7.01 కోట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం రూ.120.46కోట్లుగా పేర్కొన్నారు. -
అనుమతి లేని ల్యాబ్స్
● ఇష్టారాజ్యంగా పరీక్షలు ● అందినంతా దోపిడీ ● ప్రాణాలతో చెలగాటం ● చోద్యం చూస్తున్న వైద్యశాఖ జగిత్యాల: ప్రజల ఆరోగ్యంతో పరీక్ష కేంద్రాలు (ల్యాబ్)ల నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే ప్రజల నుంచి అందినంతా దోచుకుంటున్నారు. వాస్తవానికి ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే వైద్యశాఖ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వైద్యశాఖ పట్టించుకోకపోవడంతో గల్లికో రక్త పరీక్ష కేంద్రాలు వెలిశాయి. చిన్నపాటి శిక్షణ పొందుతూ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఒక ల్యాబ్ఏర్పాటు చేయాలంటే సుమారు 100 స్క్వైర్ ఫీట్స్ గదితోపాటు అన్ని మిషన్లు ఉండాలి. ఎలాంటి మిషన్లు ఏర్పాటు చేయకుండానే ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా ల్యాబ్‌లో ఎంబీబీఎస్ డాక్టర్, పాథాలజిస్ట్, టెక్నిషియన్స్, మైక్రోబయాలజిస్ట్ ఉండాలి. ఇవి ఎక్కడ కూడా మచ్చుకై నా కనిపించవు. రోగికి చేసే పరీక్షల్లో ప్రమాణాలు పాటించడం లేదు. పరీక్ష చేసే కిట్లలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గల్లీకొకటి.. జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ల్యాబ్‌లు, రక్త పరీక్ష కేంద్రాలు ఇష్టారాజ్యంగా వెలిశాయి. ఆస్పత్రుల్లో, ల్యాబ్‌ల్లో పనిచేసిన వారు ఎలాంటి అర్హత లేకున్నా గల్లీకొకటి ఏర్పాటు చేశారు. చిన్నపాటి మెట్ల సందు ఉన్నా.. చిన్న షటర్ కనిపించినా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి విశాలమైన గదిలో ఏసీ, సెల్కాన్ మిషన్లు ఉండాలి. కానీ కొందరు నిర్వాహకులు ఏదో చిన్నపాటి మిషన్లు తెస్తూ పరీక్షలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. రక్త, మూత్రపరీక్షలు చేస్తూ రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. రూ.100కు చేసే పరీక్షకు రూ.500 తీసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లేవారిని జిల్లా నుంచి అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా దుబాయ్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అన్ని పరీక్షలు చేయించుకుని మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకున్న ల్యాబ్ నిర్వాహకులు విదేశాలకు వెళ్లే వారికి పరీక్షలు చేస్తూ వారికి అన్ని బాగానే ఉన్నట్లు రిపోర్ట్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా ల్యాబ్‌ల ముందు విదేశాలకు వెళ్లే వారికి చెకప్ చేయబడునని బోర్డులు తగిలిస్తున్నారంటే వారి వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప వైద్యశాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ‘జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలోగల దుర్గ కెమికల్ అండ్ బయోకెమికల్ ల్యాబ్‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారు. దీనిపై ఆరోపణలు రావడంతో వైద్యశాఖ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు..’ ఇలా ఈ ఒక్కటే కాదు.. జిల్లాలో అనేక ల్యాబ్‌లు అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. రోగుల నుంచి అందినంతా దోపిడీ చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి ల్యాబ్‌లో ఎంబీబీఎస్ డాక్టర్, పాథాలజిస్ట్, మైక్రో బయాలజిస్ట్ తప్పకుండా ఉండాలి. ఎక్కబడితే అక్కడ ల్యాబ్‌లను ఏర్పాటు చేయకూడదు. వైద్యశాఖ రిజిస్ట్రేషన్, అనుమతి ఉండాలి. ల్యాబ్‌ల్లో కావాల్సిన మిషన్లు ఏర్పాటు చేయాలి. కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశాం. మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో -
● జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై నిలిచిన రాకపోకలు ● అధికారుల హామీతో శాంతించిన రైతులు ● మద్దతు పలికిన జెడ్పీ మాజీ చైర్పర్సన్
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై బైఠాయించిన నిరసన తెలిపారు. అకాలవర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని తడిసిన ధాన్యంతోపాటు మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా తూకం వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల అరిగోస కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మార్కెట్ ముందు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి ఎదురుచూస్తున్నారని, కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి యుద్ధప్రతిపాదికన కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. -
ఏఈవోలకు వివరాలు ఇవ్వండి
జగిత్యాలరూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా రైతులకు విశిష్ఠ గుర్తింపు సంఖ్య నమోదును జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి రైతు వ్యవసాయ విస్తీర్ణాధికారులకు తమ పట్టాదారు పాస్‌బుక్కులు, ఆధార్‌కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలని, ఆ మొబైల్ నంబర్‌కు మూడు ఓటీపీలు వస్తాయని, ఆ వివరాలను వ్యవసాయ విస్తీర్ణాధికారికి అందిస్తే విశిష్ఠ సంఖ్య తెలుస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పథకాల్లో అమలులో పారదర్శకత ఉండేందుకు ఈ విశిష్ఠ సంఖ్య ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పీఎం కిసాన్, సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల్లో ఈ సంఖ్య తప్పనిసరి అని, 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రావాలన్నా.. ఈ సంఖ్య ప్రమాణికం అని వివరించారు. గాలివానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలిజగిత్యాలటౌన్: రెండురోజులుగా ఈదురుగాలులు, వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్.రాజు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. మల్లాపూర్, రాయికల్, బీర్పూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో మామిడి, 250 ఎకరాల్లో వరి, కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాల్లోని ధాన్యం తడిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట నాయకులు చిట్ల గంగాధర్, అక్కినపెల్లి కాశీనాథం, నరేందుల శ్రీనివాస్, ఎడమల వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బాధిత మహిళల రక్షణకు ‘భరోసా’ జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సీసీఎస్ సీఐ శ్రీనివాస్ అన్నారు. భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి చేయూత అందిస్తున్నామన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలు, బాలికలకు అండగా ఉంటున్నామని, వారి మానసిక పరిస్థితిని తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం సిబ్బందిని అభినందించారు. ఎస్సై గీత, భరోసా సెంటర్ కో–ఆర్డినేటర్ మనీష, అధికారులు సుజాత, ప్రతిభ పాల్గొన్నారు. భూదేవికి బూరెలు సమర్పణరాయికల్: భూమికి కోపం వచ్చి భూకంపం వచ్చిందంటూ బుధవారం మండలంలోని మూటపల్లికి చెందిన మహిళలు బూరెలు చేసి భూదేవికి సమర్పించారు. బూరెలు సమర్పిస్తే భూమాత శాంతిస్తుందని మహిళలు పేర్కొన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్జగిత్యాల: జగిత్యాల శానిటరీ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆర్మూర్‌లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ బదిలీపై ఇక్కడకు వచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఉన్నారు. శ్రీనివాస్ రావడంతో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. -
రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గపోరు
● కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం రసాభాస ● జువ్వాడి నర్సింగరావు, సుజిత్‌రావు వర్గాల మధ్య తోపులాట ● సముదాయించిన జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాలటౌన్: కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. పార్టీ జిల్లా పరిశీలకులు కత్తి వెంకటస్వామి సమక్షంలోనే ఇరువర్గాలు పరస్పర దూషణలు, తోపులాటకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలో ఏబీ కన్వెన్షన్‌లో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అయితే మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్దన్ స్టేజీపై కూర్చోవడంతో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు వర్గం ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా కల్వకుంట్ల సుజిత్‌రావు వర్గీయులు లేచి వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో కాసేపు తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని, పార్టీని నమ్ముకుని ఉన్న తమకు అన్యాయం చేశారని వేదిక వద్ద ఉన్న నాయకులను నిలదీశారు. నాయకులు ఎంత సర్దిచెప్పినా వినని నాయకులు జువ్వాడికి అనుకూలంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ బీఆర్ఎస్ కోవర్ట్ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సుజిత్‌రావు వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో గొడవ మరింత ముదిరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. అనంతరం సుజిత్‌రావు వర్గీయులైన గోవర్దన్ తదితరులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతకు మారుపేరని, పదేళ్ల బీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రభు త్వ పాలన సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి
హుజూరాబాద్: మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కంకణాల రాజ్కుమార్రెడ్డ్డి (47) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రాజ్‌కుమార్‌రెడ్డి భూమి కరీంనగర్– వరంగల్ బైపాస్ రోడ్డు కింద కోల్పోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రికి కుమార్తె శివాని అంత్యక్రియలు నిర్వహించింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్దిరెడ్డి సంతాపం తెలిపారు. పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : పెళ్లి సంబంధం కుదరడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు దేవయ్య కుమారుడు ఒగ్గు మహేశ్(21) గొర్రెల కాపరీగా పనిచేస్తున్నాడు. ఇటీవల పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా గొర్రెల కాపరీగా పనిచేస్తున్నాడనే సంబంధాలు కుదరడం లేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపానికి గురయ్యాడు. ఎల్లారెడ్డిపేట శివారులోని పొలాల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతు ఛిటకి తల్లి రాజవ్వ, సోదరుడు నగేశ్ ఉన్నారు. తల్లి మందలించిందని కూతురు.. గొల్లపల్లి: తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిల్వాకోడూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్ల లక్ష్మి కుటుంబం బతుకుదెరువు నిమిత్తం ముంబయి వెళ్లింది. ఆమె కూతురు త్రిష అక్కడే ఇంటర్ చదివింది. రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసి స్వగ్రామానికి వచ్చారు. కూతురు ఆలస్యంగా నిద్రలేవడంతోపాటు ఏ పనీ చేయకపోవడంతో తల్లి మంగళవారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన త్రిష (21) మంగళవారం అర్ధరాత్రి తమ రేకులషెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.ప్రేమ విఫలమై యువకుడు.. జమ్మికుంట: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు బుధవారం జమ్మికుంటలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. ఇల్లందకుంటకు చెందిన దార మొగిలి, రాజేశ్వరి దంపతుల కొడుకు దార ఎల్లేశ్(23) జమ్మికుంటలో ఇంటర్ చదివే రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు కలిసి తిరిగారు. తరువాత సదరు అమ్మాయి వేరే వివాహం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లేశ్ ‘ఆ అమ్మయిని నా శవం వద్దకు తీసుకరావాలని’ సెల్ఫీ వీడియో తీసుకొని జమ్మికుంటలో రైలుకిందపడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.