మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అవగాహన సదస్సును శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నిర్వహించారు. ఈసందర్భంగా సదస్సుకు హాజరైన రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రణాళికతో మెరుగైన బోధన అందించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్‌లో శుక్రవారం జెడ్పీహెచ్‌ఎస్ బాలుర, బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖలో ఒకేరోజు మార్పు సాధ్యం కాదని, నిర్వీరామంగా ప్రయత్నం చేస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు నిరుపేద రైతులు, కూలీలు, బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు చెందిన పిల్ల లు వస్తారని, వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్య, నైపుణ్యం అందించగలిగితే సూపర్‌పవర్‌గా ఎదుగుతామన్నారు. కార్యక్రమంలో డీఈవో రాము, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
డెంగీ నియంత్రణపై అవగాహన కల్పించాలి
మల్యాల(చొప్పదండి): డెంగీ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డెంగీ నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేకుండా
మట్టి తరలిస్తే చర్యలు
జగిత్యాలరూరల్: అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల నుంచి మట్టి తరలిస్తే చర్యలు తప్పవని జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 437లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తీస్తున్న ప్రొక్లెయిన్‌ను శుక్రవారం సీజ్ చేసి జగిత్యాల ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా మట్టి తీస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే


