ఆసుపత్రిని ఎందుకు పట్టించుకోవడం లేదు..?
ధర్మపురి: ధర్మపురి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో రూ.7కోట్లు వెచ్చించి 50 పడకలతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిరుపయోగంగా మారుస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పట్టణంలోని ఎంసీహెచ్‌ను మంగళవారం సందర్శించిన ఆ యన.. ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభు త్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం ఎంసీహెచ్‌లు ఏర్పాటు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఆస్పత్రి నిరుపయోగంగా మారినా మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చి రోగులకు వైద్యం అందించే తీరిక మంత్రికి లేదా అని ప్రశ్నించారు. ఆయన వెంట నాయకులు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సంగి సత్తెమ్మ, ఇందారపు రామన్న, అయ్యోరి రాజేశ్, చిలువేరి శ్యాం, ఎల్లాగౌడ్, చుక్క భీమ్‌రాజ్, ముత్తినేని లక్ష్మ ణ్ పాల్గొన్నారు.


