బాధితులకు న్యాయం అందించాలి
జగిత్యాలటౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అధికారులను ఆదేశించారు. ఎస్టీకులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీతో సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు జరిగిన న్యాయంపై చర్చించారు. జిల్లాలో 227 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధిత కుటుంబాలకు రూ.17,93,700 మంజూరు చేశామని, పెండింగ్‌లో ఉన్న 166 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే చెల్లిస్తామని తెలిపారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌గౌడ్, డీఎస్పీ రఘుచందర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రాజ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ తదితరులు ఉన్నారు.
ఓటరు జాబితాపై కసరత్తు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండడంతో అధికారులు ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. బల్దియాల్లో ఓటరు జాబితాను సవరిస్తున్నారు. జగిత్యాలలో 50వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా కసరత్తు చేస్తున్నారు. జనవరి ఒకటిన పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా ప్రకటించనున్నారు. వచ్చేనెల 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
ఐఎంఏ జిల్లా శాఖకు అవార్డు
జగిత్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. మంగళవారం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఐఎంఏ జాతీయస్థాయి సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి పురస్కారం అందుకున్నారు. రక్తదాన శిబిరాలు, వ్యాక్సినేషన్ డ్రైవ్, రక్తహీనత నివారణ కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, వైద్యుల కోసం నిర్వహించిన శాసీ్త్రయ సమ్మేళనాలతో పాటు, ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. వీటన్నిటిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని ప్రదానం చేసింది. జాతీయస్థాయి ప్రతినిధుల చేతుల మీదుగా అందించారు.
నృసింహుడికి 10 కిలోల వెండి వస్తువులు బహూకరణ
ధర్మపురి: ధర్మపురికి చెందిన గుండె వైద్య నిపుణుడు కస్తూరి శ్రీధర్, సునీత దంపతులు నృసింహ స్వామివారికి 10 కిలోల వెండితో తయారుచేసిన పాదపీటను మంగళవారం బహూకరించారు. ముక్కోటి వేడుకలకు హాజరైన సందర్భంగా స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు దంపతులను సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
బాధితులకు న్యాయం అందించాలి
బాధితులకు న్యాయం అందించాలి
బాధితులకు న్యాయం అందించాలి


