
అప్పుల బాధతో ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): అప్పులు తీర్చే మార్గం లేక జీవి తంపై విరక్తితో ము గ్గురు పిల్లల తండ్రి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. జవారిపేటకు చెందిన మెరుగు సంతోష్‌గౌడ్(38) తనకున్న మినీవ్యాన్‌తో పత్తి వ్యా పారం, ఇతరత్ర పనులు చేస్తుండేవాడు. ఇటీవల కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటి నిర్మాణా నికి తీసుకున్న రుణం, ఇతరత్ర అప్పులు కలిసి రూ.30లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చేమార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో శుక్రవారం తని మినీ వ్యాన్‌లో గాలి పల్లి శివారులోని పెద్దమ్మ ఆలయ సమీపం వర కు వెళ్లి క్రిమిసంహారకమందు తాగాడు. అపస్మారక స్థితికి వెళ్లిన సంతోష్‌గౌడ్‌ను గమనించిన స్థా నికులు 108కి సమాచారం ఇవ్వగా.. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.
వివాహిత ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు తాళలే క ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కడారి బాలమణి(42) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలమణి దంపతులు కుటుంబ పోషణకు అప్పులు చేశారు. అప్పులు తీరే మార్గం లేక మనస్తాపానికి గురైన బాలమణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.