
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
జగిత్యాల: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 428 కేంద్రాల ద్వారా 65,554 మంది రైతుల నుంచి 3.88 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని, రూ.723.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నరకాలకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని వివరించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు ప్రారంభం
గొల్లపల్లి: మండలంలోని దమ్మన్నపేట నుంచి హనుమాన్ ఆలయం వరకు నిర్మించిన సీసీరోడ్డును విప్ అడ్లూరి మాజీమంత్రి జీవన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ పురాపాటి రాజిరెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ధర్మపురి: ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మీ చెక్కులను విప్ పంపిణీ చేశారు. 54 మందికి రూ.54 లక్షల చెక్కులు అందించారు. పేద ల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఎంపీడీవో రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సుమన్, నాయకులు ఎస్ దినేష్, చిలుముల లక్ష్మణ్ తదితరులున్నారు.