
వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
జగిత్యాల/జగిత్యాలటౌన్/మేడిపల్లి/కథలాపూర్:
జిల్లాకేంద్రంలో గురువారం మధ్యాహ్నం గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మురుగు కాలువల్లోని చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. లోతట్టు ప్రాంతాలైన తులసీనగర్, లింగంచెరువు, పార్క్ సందులను పరిశీలించారు. ఆమె వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి, బల్దియా సిబ్బంది ఉన్నారు.
ఇళ్లలోకి చేరిన వరద నీరు
ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మేడిపల్లి వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడిపల్లి మండలకేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు నీరు రోడ్లపైకి చేరింది. భీమారంలోని కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మేడిపల్లి నుంచి దేశాయిపేట వరకు ఇటీవల వేసిన డబుల్ రోడ్డు పక్కన సైడ్‌బర్మ్ మట్టి కొట్టుకపోవడంతో వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి.
కథలాపూర్‌లో భారీ వర్షం
కథలాపూర్‌లో భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం

వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం