
పాలన వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనం
మల్లాపూర్/కోరుట్ల/కోరుట్లరూరల్: కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనంలో పయని స్తోందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నా రు. మల్లాపూర్‌లో గురువారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అమలైన పథకాల్లో కోత పెడుతున్న ప్రభుత్వం ప్రజలు, రైతులను వంచిస్తోందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి కొట్లాడుతానన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి పాల్గొన్నారు.
హనుమాన్ జయంతిలో ఎమ్మెల్యే
కోరుట్ల/కోరుట్ల రూరల్: కోరుట్లతోపాటు కల్లూర్ హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం ప్రారంభించారు. నాయకులు చీటి వెంకట్రావు, రాజేశ్, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.