
అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలి
జగిత్యాల: మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. వార్డుల్లో కొనసాగుతున్న పనులను నాణ్యతతో చేయించాలని, ఆగిపోయిన పనులకు తిరిగి టెండర్లు పిలవాలని, వర్షాకాలానికి ముందే పూర్తి చేసేలా చూడాలని సూచించారు. డీఈ నాగేశ్వర్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్, ఏఈలు చరణ్, అనిల్ పాల్గొన్నారు.
విద్యార్థుల్లో దేశభక్తిని పెంచాలి
విద్యార్థుల్లో దేశభక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గురువారం ఓల్డ్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలు వివరించాలని, మత్తుకు బానిస కాకుండా చూడాలన్నారు. డీఈవో రాము, మండల విద్యాధికారి చంద్రకళ, శ్రీనివాస్ పాల్గొన్నారు.