
యువతకు ఉపాధి కల్పిస్తాం
జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. గురువారం జగిత్యాల మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న 12 మంది ఎస్టీ, 152 మంది మైనార్టీ, 57 మంది ఈబీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.