
బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
జగిత్యాల: బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఎవరైన ఆవులు, లేగదూడలను వధిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మంగళవారం సమీక్షించారు. స్లాటర్ హౌస్‌ల వద్ద పరిశుభ్రత ఉండేలా చూడాలని కమిషనర్లను ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
కార్మిక చట్టాలు అమలు చేయాలి
జగిత్యాలటౌన్: పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుతారి రాములు, ఎండీ.ముక్రం డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకొచ్చాక 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా విభజించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తోందన్నారు. కార్మికుల చట్టాలు అమలు చేయాలని ఈనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూలై 9కు వాయిదా వేశామన్నారు. కార్యక్రమంలో ఇరుగురాళ్ల భూమేశ్వర్, వెన్న మహేష్, రామిల్ల రాంబాబు, మునుగూరి హన్మంతు ఉన్నారు.
బాలామృతం పక్కదారిపై ఇన్‌చార్జి పీడీ విచారణ
మెట్‌పల్లి: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని కొందరు గేదెల పోషకులకు విక్రయిస్తున్న వైనంపై ‘సాక్షి’ ‘ఐసీడీఎస్‌లో ఆగని అక్రమాలు’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ శాఖ జిల్లా ఇన్‌చార్జి పీడీ నరేష్ మెట్‌పల్లికి వచ్చి స్థానిక ఏడో వార్డులో ఉన్న ఓ గేదెల కొట్టంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ గేదెలకు పెడుతున్న దాణాను పరిశీలించారు. అనంతరం పీడీ ‘సాక్షి’తో మాట్లాడారు. తమకు ఉన్న సమాచారంతో ఓ కొట్టంలో తనిఖీలు చేశామని, అందులో బాలామృతం ప్యాకెట్లు లభించలేదన్నారు. చిన్నారులకు ఈ ప్యాకెట్లను అందించే సమయంలో ఫొటోలు తీయాలనే నిబంధన ఉందని, దీనివల్ల అవి పక్కదారి పట్టే అవకాశమే ఉండదన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోషకాహారాన్ని అమ్ముకోవద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరగవు
కథలాపూర్: మాజీ ము ఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచం గర్వించదగిన నిర్మాణాలు చేపట్టారని, ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరగవని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి అన్నా రు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూం, యాదాద్రి ఆలయం మచ్చుతునకలు మాత్రమేనని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవా ళ్లు చెరిపేస్తామన్నోళ్లు ప్రస్తుతం ప్రపంచానికి చూపిస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల స్మారక జ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని మిస్ వరల్డ్ పోటీదారులకు చూపిస్తే రాష్ట్ర గొప్పతనం మరింత వ్యాపిస్తుందన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన వాటిని అందాల భామలకు చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్కయిందన్నారు.

బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

బక్రీద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలి