
పచ్చిరొట్ట విత్తనాల ధరలు తగ్గించండి
● రాయికల్‌లో రైతుల రాస్తారోకో ● మద్దతు ప్రకటించిన బీఆర్‌ఎస్
జగిత్యాలరూరల్(రాయికల్): పచ్చిరొట్ట విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాయికల్‌లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు పలికారు. బీఆర్‌ఎస్ రాయికల్ పట్టణ కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ ధరలు రెండింతలు పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. వాటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సై సుధీర్‌రావు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు వ్యవసాయాధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతునాయకులు కుర్మ మల్లారెడ్డి, తిరుపతి, సంజీవ్, నరేశ్, గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.