
22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం
వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా అంటూ ఉమ్మడి జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవం తేదీ ఖరారైంది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రెండు రైల్వేస్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రామగుండం, కరీంనగర్, పెద్దపల్లి రైల్వేస్టేషన్లకు అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌మిషన్ పథకం కింద రూ.73 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటిఫేజ్‌లో కరీంనగర్‌కు రూ.26.06 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు విడుదలయ్యాయి. రెండో ఫేజ్‌లో పెద్దపల్లి ఎంపికకాగా రూ.20 కోట్లు మంజూరయ్యాయి. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పరిశీలించనున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో తడిసిన సర్టిఫికెట్లు
జగిత్యాలరూరల్: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో పలు సర్టిఫికెట్లు, దరఖాస్తులు తడిసిపోయాయి. ఇటీవల కాలంలో విద్యార్థులు కుల ధ్రువీకరణ, ఆదాయం, ఈబీసీ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కార్యాలయం ఉద్యోగులు తీసుకున్న దరఖాస్తులను నిర్లక్ష్యంగా కిటికీ వద్ద వదిలేయడంతో వర్షం కురిసి కిటికిలోంచి నీరు వెళ్లి దరఖాస్తు ఫారాలన్నీ తడిసిపోయాయి. శనివారం ఉదయం కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగులు వాటిని ఆరబెట్టారు. దరఖాస్తు చేసుకున్న వారంతా తడిసిపోయిన సర్టిఫికెట్లను చూసి ఆందోళనకు గురయ్యారు.
సాఫ్ట్‌బాల్ పోటీలకు గోవిందారం విద్యార్థులు
మేడిపల్లి: భీమారం మండలం గోవిందారం ఉన్నత పాఠశాలకు చెందిన పిట్టల నవదీప్, పొన్నం రిశ్వంత్, గంగానవేణి సంతోష్, కొప్పుల రామ్‌చరణ్, చెల్ల నగేష్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు. వీరు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయా మ ఉపాధ్యాయుడు ప్రశాంత్ తెలిపారు. విద్యార్థులను హెచ్‌ఎం అస్ఫాక్ హుస్సేన్, ఉపాధ్యాయ బృందం అభినందించింది.
బంగారు చైన్ అప్పగింత
కథలాపూర్: కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన లోక స్వప్నకు ఓ బంగారు చైన్ దొరకగా.. పోగొట్టుకున్న వ్యక్తికి పోలీసుల సమక్షంలో అప్పగించి నిజాయితీ చాటుకుంది. ఈనెల 12న మండలంలోని దుంపేటలో శ్రీలక్ష్మినృసింహస్వామి జాతర ఉత్సవాలు జరిగాయి. కోరుట్లకు చెందిన మహిళ బంగారు చైన్ పోగొట్టుకుంది. ఆ చైన్ చింతకుంటకు చెందిన లోక స్వప్నకు దొరక గా వీడీసీ సభ్యులకు తెలిపింది. చైన్ పోగొ ట్టుకున్న వ్యక్తిది కోరుట్లగా గుర్తించి అతడికి సమాచారం అందించారు. శనివారం పోలీసుల సమక్షంలో చైన్‌ను అప్పగించారు. స్వప్నను వీడీసీ సభ్యులు సన్మానించారు.
దరఖాస్తులు ఆహ్వానం
జగిత్యాల: 2024–25 సంవత్సరానికి గాను బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ రెసిడెన్షియల్స్, నా న్ రెసిడెన్షియల్స్ పథకంలో భాగంగా ఉత్త మ పాఠశాలల ఎంపికకు జిల్లాలోని ప్రైవే టు, ఆంగ్ల మాధ్యమ స్కూళ్ల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, భోజన వసతి, రెండు జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ అందిస్తారని, ప్రతి విద్యార్థికి రూ.42వేల చొప్పున చెల్లిస్తామని తెలిపారు. దరఖాస్తులను పూర్తి చేసి 31లో పు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం

22న కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల ప్రారంభం