రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 22 2025 12:12 AM | Updated on May 22 2025 12:12 AM

రోడ్డు ప్రమాదంలో   వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హుజూరాబాద్‌: పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన శ్రావణ్‌(34) ప్రైవేటు ఉద్యోగి. తన ద్విచక్ర వాహనం వెళ్తుండగా హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేయగా మృతుడి పేరు మాత్రమే తెలిసింది. చౌరస్తా వద్ద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్వగ్రామం చేరిన మృతదేహం

మల్యాల: పోలాండ్‌ దేశంలో కారు ఢీకొని చనిపోయిన మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్‌ (29) మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. మల్యాలకు చెంది పర్శరాం, భూలక్ష్మీ కుమారుడు మనోజ్‌ ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లి వచ్చాడు. ఐదు నెలల క్రితం పొలాండ్‌ దేశం వెళ్లాడు. అక్కడ ఫిక్కీ అనే గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 12న డ్యూటీకి వెళ్తుండగా.. వెనుక నుంచి కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పొలాండ్‌లోని తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు అక్కల చంద్రభాను, కార్యదర్శి గంగుల శైలేంద్ర సహకారంతో మృతదేహం స్వగ్రామానికి చేరింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆయన చితికి తండ్రి పర్శరాం తలకొరివి పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement