
రోడ్డు బ్లాక్ చేశారు
రైతు బజార్‌లో విక్రయించాల్సిన కూరగాయలను విద్యానగర్ రోడ్డుపై అమ్ముతుండడంతో రోడ్డు బ్లాక్ అవుతోంది. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే అమ్ముతుండడంతో రోడ్డు రద్దీగా ఉంటోంది. ఈ రోడ్డు వెంటే ఆస్పత్రులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు, అంబులెన్స్‌లు వెళ్లలేని పరిస్థితి ఉంది. విక్రయదారులను రైతుబజార్‌కు తరలించాలి.
– విద్యానగర్‌వాసులు, జగిత్యాల
కొండ చెరువును కాపాడండి
రాయికల్ మండలంలోని ద్యావనపెల్లిలో కొండచెరువు కబ్జాకు గురవుతోంది. పశువులకు నీటి సౌలభ్యం కరువై రైతులు ఇబ్బంది పడుతున్నాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొండ చెరువుకు హద్దులు నిర్ణయించి కబ్జాదారుల నుంచి కాపాడాలి.
– దావన్‌పల్లి, రాయికల్
వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడు
వడ్డీతో సహా అ ప్పు చెల్లించినా వ్యాపారి లక్ష్మి ప తి వేధిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం బతుకు దెరువు కోసం దు బాయ్ వెళ్లాను. కథలాపూర్ మండలం పోతారా నికి చెందిన వడ్డీ వ్యాపారి పాలెపు లక్ష్మిపతి పరి చయం అయ్యాడు. ఆయన నుంచి రూ.2.20లక్షలు అప్పుగా తీసుకున్న. ఇప్పటివరకు రూ.5లక్షల దాకా చెల్లించాను. ఇటీవల స్వగ్రామానికి వచ్చాను. నాకంటే ముందే ఇక్కడకు వచ్చిన లక్ష్మీపతి అప్పు చెల్లించాలంటూ ఇంటికొచ్చి వేధిస్తున్నాడు. ఆ యన నుంచి నా కుటుంబానికి రక్షణ కల్పించండి. – దేశవేని నవీన్, ఽదరూర్

రోడ్డు బ్లాక్ చేశారు

రోడ్డు బ్లాక్ చేశారు