
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈదురుగాలుల
ఆయిల్‌పాం సాగుతో లాభాలు
మెట్‌పల్లిరూరల్: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లోని రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చిరొట్ట ఎరువుల యాజమాన్యం, సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించారు. ఆయిల్‌పాం సాగుకు పెట్టుబడి తక్కున్నారు. చీడపీడలు సోకే ఆస్కారం ఉండదన్నారు. సంప్రదాయ పంటలకు బదులు లాభాలు అందించే ఆయిల్ పాం సాగు చేయాలని సూచించారు. అనంతరం పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏడీఏ రమేశ్, ఏవో దీపిక, రైతులు పాల్గొన్నారు.