
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
● బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
● వేములవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్
వేములవాడ: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు. రుద్రంగిలో శుక్రవారం జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వేములవాడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రవాణా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలన్నారు. ఏఎంసీ వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.