ధర్మపురి: పహల్గాంలో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యకు ఫలితంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం తీసుకున్న చర్యకు కాంగ్రెస్ అగ్ర నాయకులు సలాం కొట్టారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీకి జనం తరలివచ్చారు. స్థానిక నందీ కూడలి నుంచి గాంధీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా విప్ మాట్లాడుతూ, దేశ రక్షణ విషయంలో కేంద్రానికి పూర్తి మద్దతు ఉంటుందని, రానున్న రోజుల్లో మన దేశం వైపు పాకిస్థాన్ కన్నెత్తి చూడకుండా కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శోభారాణి, నాయకులు ఎస్.దినేశ్, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, గాజు భాస్కర్, నాయకులు తదితరులున్నారు.
క్షయ బాధితులను గుర్తించాలి
జగిత్యాల: క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, పొగ తాగేవారు, ఆల్కాహాల్ తాగడం, పొగాకు తినడం, డయాబెటిస్ ఉన్నవారిని గుర్తించి వివరాలు అందించాలన్నారు. 100 రోజుల్లో వారందరినీ స్క్రీనింగ్ చేసి పరీక్షలకు పంపి వ్యాధిగ్రస్తులుగా తేలితే చికిత్స అందించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, అర్చన, రవీందర్, సత్యనారాయణ, భూమేశ్వర్ పాల్గొన్నారు.
పాక్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాలి
జగిత్యాలటౌన్: కశ్మీర్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలపై పాక్ విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడాన్ని ప్రపంచదేశాలు ఖండించాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడం అభినందనీయమన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేమని అంటూనే తన భూభాగంలో ఉగ్రల శిబిరాలను ప్రోత్సహిస్తూ మన దేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. భారత్‌పై దాడులను సహించేది లేదని, దేశ సార్వభౌమత్వం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఎటువంటి యుద్ధ చర్యలకై నా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ఆపరేషన్ సిందూర్‌కు సలాం