
క్యూఆర్ కోడ్ అమలులో రెండు ఠాణాలకు ప్రశంసలు
జగిత్యాలక్రైం: ప్రజలు, బాధితులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా పోలీసు శాఖ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. సీఎఫ్‌సీ ద్వారా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో పది పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందులో జిల్లా నుంచి మేడిపల్లి ఠాణ రాష్ట్రంలో రెండో ర్యాంక్, ఇబ్రహీంపట్నం ఆరో ర్యాంక్ సాధించాయి. మేడిపల్లి ఎస్సై శ్యాంరాజ్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్‌కు బుధవారం హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్ చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ వారిని అభినందించారు. జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్రస్థాయిలో ప్రశంస పత్రం అందుకోవడం అభినందనీయమన్నారు.
మేడిపల్లికి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు
ఆరో స్థానంలో ఇబ్రహీంపట్నం ఠాణా
డీజీపీ చేతులమీదుగా పత్రాలు అందుకున్న ఎస్సైలు

క్యూఆర్ కోడ్ అమలులో రెండు ఠాణాలకు ప్రశంసలు