
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
మెట్‌పల్లిరూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగుతున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు వెంటనే తరలించాలని ఆదేశించారు. లారీల కొరత ఎక్కడా లేదన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, డీసీవో మనోజ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, వర్షాలు పడుతున్న నేపథ్యంలో వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని 65 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. ఇప్పటివరకు 11,51,922 క్వింటాళ్ల ధాన్యం సేకరించామన్నారు. ఏపీఎం గంగాధర్, సీసీలు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు.