ఉన్నది మాట్లాడితే ఉలుకెందుకు?
● పార్టీ మారి బుకాయింపా?
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: ఉన్నది మాట్లాడితే ఎమ్మెల్యే ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. తాను గాంధీభవన్‌లో మాట్లాడుతుండగా సంజయ్ ఏ పార్టీ అని మీడియా మిత్రులు అడిగితే స్పీకర్‌ను అడగాలని మాత్రమే చెప్పానని, తానెక్కడా సహనం కోల్పోలేదని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 1983 నుంచి 14సార్లు బీ ఫాం పొందడం తనకు.. పార్టీకున్న అనుబంధానికి నిదర్శమని, అత్యధిక సార్లు టికెట్ పొందానని, అత్యధికసార్లు గెలిచింది.. ఓడిపోయింది కూడా తానేనని వివరించారు. 2014లో ఉత్తర తెలంగాణ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా గెలిచిందిన తానేనన్నారు. బీఆర్‌ఎస్ పాలనపై తాను చేసిన పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజాజీవితాన్ని ఎప్పుడూ లాభనష్టాలతో చూడలేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి ఉల్టా చోర్ కోత్వాల్‌కుడాంటే అన్న చందంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నర్సింగాపూర్‌లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపల్లి దుర్గయ్య, గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు.


