అమ్మకంలోనే సమస్యలు
ప్రతి సీజన్‌లో వరిధాన్యం కొనుగోలుకు 420 కేంద్రాలు, వానాకాలంలో మొక్కజొన్న కొనుగోలుకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, ప్రతీ ధాన్యం కుప్పను తూర్పార పట్టమనడం, మిల్లర్లు క్వింటాల్‌కు 2 కిలోల తరుగు తీయడం, హమాలీలు ఇష్టారీతిన రేట్లు పెంచడంతో ఇబ్బందిపడ్డారు. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసినా నెలన్నర వరకు డబ్బులు చెల్లించకపోవడంతో యాసంగి పెట్టుబడికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి పంటను 15 వేల ఎకరాల్లో వేసినా సీసీఐ నిబంధనలతో చాలా మంది గ్రామాల్లోనే తక్కువ రేటుకు దళారులకు అమ్ముకున్నారు.


