ప్రాణత్యాగాల పార్టీ కాంగ్రెస్
జగిత్యాలటౌన్: ప్రాణ త్యాగాల పార్టీ కాంగ్రెస్ అని జిల్లా అధ్యక్షుడు గాజంగి సదయ్య అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో పార్టీ జెండా ఎగరేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం కోసం దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహాత్మాగాంధీ పేరును చెరిపివేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, పథకాల పేరు మార్పుతో గాంధీ పేరు చెరిపివేయలేరని అన్నారు. పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకం పేరు మార్చి, నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్న మోదీ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి చేసేందుకు మరో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల గుండెల్లోని కాంగ్రెస్ పార్టీని చెరిపివేయలేరన్నారు. కార్యక్రమంలో బండ శంకర్, కొత్త మోహన్, తాటిపర్తి విజయలక్ష్మి, కల్లెపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, రమేశ్‌రావు, ఎలిగేటి నర్సయ్య, గుగ్గిళ్ల హరీశ్, మున్నా, నేహాల్, రమేశ్‌బాబు, అనిత, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
కథలాపూర్(వేములవాడ): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ 129వ కార్యక్రమాన్ని ఆదివారం మండలంలోని సిరికొండ గ్రామంలో బీజేపీ నాయకులతో కలిసి ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడబోమని ప్రపంచానికి ప్రధాని మోదీ తన నిర్ణయాలతో స్పష్టం చేశారన్నారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ దేశంలోని ప్రతీ పౌరుడికి దేశాభివృద్ధి, గొప్పతనం, ఔన్నత్యాన్ని చెప్పారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, మోతే గంగారెడ్డి, వెంకటేశ్వర్‌రావు, ఎడ్మల వినోద్‌రెడ్డి, బద్రి సత్యం, బండ అంజయ్య, కాసోజి ప్రతాప్, మహేశ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణత్యాగాల పార్టీ కాంగ్రెస్


