ఒడిదొడుకుల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా రైతులకు 2025 ఏడాది కన్నీళ్లు, నష్టాలనే మిగిల్చింది. పంటలకు తెగుళ్లు, పురుగులతో నెట్టుకొస్తున్న రైతులకు, చివరికి అకాల వర్షాలు దెబ్బతీశాయి. దీంతో, పంటలపై వచ్చే ఆదాయం ఏమో కానీ, పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో, రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయి భూములు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
యాసంగిలో వరితో పాటు దాదాపు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేయడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. ఆ సీజన్‌లో ఏదోలాగా నెట్టుకొచ్చిన రైతులకు, వానాకాలం సీజన్‌లో యూరియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. సొసైటీలు, దుకాణాల వద్ద రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఒకట్రెండు బస్తాలు పొందె పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో క్యూ లైన్లలో నిలబడే ఓపిక లేక పట్టాదారు పాస్‌బుక్కులు, చెప్పులను పెట్టి రోజంతా వేచి చూసినా ఒక బస్తా కూడా దొరకలేదు.
ఆదాయం రాక అన్నదాతల ఆగమాగం
పెరుగుతున్న పంట పెట్టుబడి ఖర్చులు
సంప్రదాయ పంటలవైపే జిల్లా రైతులు
2025 ఏడాది రైతులకు అంతంతే..
2026పైనే ఆశలు
దెబ్బతీసిన వర్షాలు
జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలను దాదాపు 3.80 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే, మూడునెలల పాటు కురిసి భారీ వర్షాలతో మక్క, పసుపు పంటల్లో నీరు నిలిచి దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇసుకను తొలగించేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. యాసంగి మార్చిలో కురిసిన వడగళ్ల వానకు వరిగింజలు రాలిపోయాయి. దాదాపు 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదించిన రైతులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మామిడిపూత, కాయలు రాలిపోయి తీవ్రనష్టం జరిగింది. వానాకాలంలో వరిపంట కోతకు గంటకు రూ 4.వేలు పెట్టి చైన్ హార్వేస్టర్లను ఉపయోగించారు.
యూరియా కష్టాలు
ఒడిదొడుకుల సాగు
ఒడిదొడుకుల సాగు


