చేల చుట్టూ.. చీరకట్టు..
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలువురు రైతులు యాసంగిలో మొక్కజొన్న సాగు చేస్తుండగా, అడవిపందులు గుంపులుగా పంట చేలపై పడి మొక్కలను కొరికేస్తున్నాయి. ఈనేపథ్యంలో పంట పొలాల చుట్టూ రంగురంగుల చీరలు కడితే అడవిపందులు వచ్చే అవకాశం తక్కువ. దీంతో రైతులు పంట పొలాలను చీరలతో సింగారిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌పల్లి, లక్ష్మీపూర్ గ్రామ రైతులు అంగట్లో ఒక్కో చీరను రూ.20 కొనుగోలు చేసి, చేల చుట్టూ కట్టి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ఊర్లలో ఏ మొక్కజొన్న తోటను చూసినా చీరలతో సింగారించుకున్నట్లు ఉంటుంది.


